Jump to content

వెలుపలి చెవి

వికీపీడియా నుండి
వెలుపలి చెవి
బయటి, మధ్య చెవి, opened from the front. Right side.
చెవి డొప్ప. Lateral surface.
గ్రే'స్ subject #229 1033
MeSH External+Ear

వెలుపలి చెవి లేదా బాహ్య చెవి (external ear) కర్ణబేరి త్వచానికి వెలుపలిగా ఉండే చెవి నిర్మాణం. బాహ్య శ్రవణ నాళం, చెవి డొప్ప దీనిలోకి వస్తాయి. ఇవి శబ్ద తరంగాలను బయటి నుండి సేకరించి కర్ణబేరి మీద కేంద్రికరిస్తుంది. ఈ భాగం శబ్దపు 4000 Hz తరంగదైర్ఘ్యం సామర్ధ్యాన్ని 30- to 100-రెట్లు ద్విగుణీకృతం చేస్తుంది. మనం సాధరణంగా వినగలిగే శబ్దం కూడా ఈ ప్రాంతంలొనే ఉంటుంది.

చెవి డొప్ప

[మార్చు]

బయటకు కనిపించే చెవి డొప్ప శబ్ద తరంగాలను బయటి నుండి సేకరించి కేంద్రీకరిస్తుంది. దీనిమధ్యలో మృదులాస్థిని కలిగి వుండి బయట ఉపకళా కణజాలంతో కప్పబడి ఉంటుంది. చాలా క్షీరదాలలో చెవిడొప్పను కదిలించ గలిగి ఉండి శబ్ద తరంగాల వైపు దీనిని తిప్పడానికి అవకాశం కల్పిస్తుంది. మనుషులు ఈ విధంగా కదిలించలేరు.

బాహ్య శ్రవణ నాళం

[మార్చు]

చెవి డొప్ప సేకరించిన శబ్ద తరంగాలు ఈ నాళం లోనికి ప్రవేశిస్తాయి. సరళమైన దీని నిర్మాణం ఈ తరంగాలను మధ్య చెవిలోనికి పంపిస్తుంది.

మూలాలు

[మార్చు]