Jump to content

వెన్నవెల్లి శరత్

వికీపీడియా నుండి

తెలంగాణలోని మెదక్ జిల్లా దరిపల్లి గ్రామానికి చెందిన వెన్నవెల్లి శరత్ కు 2023 సంవత్సరానికి ' అమెరికా యంగ్ ప్రొఫెషనల్ అవార్డు ' లభించింది[1]. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లో శరత్ కు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది[2]. 2023 అక్టోబర్ 29వ తేదీన అవార్డును ప్రధానం చేశారు[3]. శరత్ అమెరికాలోని హుస్టన్ తో పాటు అనేక నగరాల్లో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణానికి సారథ్యం వహించారు. ఇటీవల హోస్టన్ నగరంలో నిర్మించిన మెమోరియల్ పార్క్ కు, శరత్ కు నేషనల్ అవార్డు దక్కింది. ఈయన ప్రస్తుతం కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు మేనేజర్ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు.

మూలాలు :

  1. టీవీ, ముద్ర (2023-10-31). "అమెరికాలో ప్రతిష్ఠాత్మక యంగ్ ప్రొఫెషనల్ అవార్డ్ అందుకున్న శరత్ చంద్రరెడ్డి". ముద్ర టీవీ (in ఇంగ్లీష్). Retrieved 2023-11-07.
  2. "అమెరికాలో యంగ్ ప్రొఫెషనల్ అవార్డు అందుకున్న శరత్ చంద్రారెడ్డి". Telugu Times - USA NRI Telugu News Telugu News Papers In USA (in ఇంగ్లీష్). Retrieved 2023-11-07.
  3. Desk 9, Disha Web (2023-10-31). "ప్రతిష్టాత్మక యంగ్ ప్రొఫెషనల్ అవార్డ్ అందుకున్న శరత్ చంద్రా రెడ్డి". www.dishadaily.com. Retrieved 2023-11-07.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)