Jump to content

వెంపటి వెంకటనారాయణ

వికీపీడియా నుండి

వెంపటి వెంకటనారాయణ (1871 – 1935) కూచిపూడి నాట్యాచార్యుడు. భామాకలాప, గొల్ల కలాప ప్రదర్శసల ద్వారా విశేష ఖ్యాతి నార్జించుకున్న నటశేఖరుడు. అనేక సంస్థానాలలోనూ, విద్వత్సభలలోనూ విద్వత్తును ప్రదర్శించి అనేక సువర్ణఘంటా కంకణాది అమూల్య సత్కారాలను పొందిన లయబ్రహ్మ ఆయన.[1] ఈయన కూచిపూడి త్రయంలో ఒకరు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన పున్నమ్మ, కోదండరామయ్య దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి కూడా నాట్యాచార్యుడే. ఆయన తన తండ్రి వద్ద కూచిపూడి నాట్య శిక్షణను పొందాడు. ఆయన స్త్రీ వేషంలో సుప్రసిద్ధులైనాడు. ఆయన సత్యభామ, దాదినమ్మ, బాలింతవేషాలను వేసేవాడు. తన 60వ యేట వరకు కూడా ప్రదర్శనలిచ్చాడు. కళాకారునిగా విశేషసేవలందించిన ఆయన దాదినమ్మ అనే మూడుగంటల పాటు ఒక మంచానికి కట్టబడి శరీరంలోని పైభాగం మాత్రమే కనబడేటట్లు ఉండే వేషాన్ని వేసి ప్రదర్శించడంలో సుప్రసిద్ధులు. ఒకానొక సందర్భంలో హరికథా పితామహుడైన ఆదిభట్ల నారాయణదాసు సూత్రధారునిగానూ, వెంకటనారాయణ సత్యభామ గాను ఒక వేదికపై ప్రదర్శననిచ్చారు. ఆయనకు తాలప్రస్తార, ముఖ కవళికలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆయనను అభినవ సత్యభామగా పిలిచేవారు. ఆయన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వేయికి పైగా భామాకలాపం ప్రదర్శననిచ్చాడు.[2]

ఈయన మునిమనుమరాలు లలితాసింధూరి కూడా నాట్యకారిణి.[3]

మూలాలు

[మార్చు]
  1. తెలుగువారి జానపద కళారూపాలు (1992) రచించినవారు మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి
  2. "personalities: vempati venkatanarayana biography". Archived from the original on 2016-10-18. Retrieved 2016-11-12.
  3. కూచిపూడి మయూరం

ఇతర లింకులు

[మార్చు]