Jump to content

వెంగారెడ్డిపాళెం

అక్షాంశ రేఖాంశాలు: 14°33′57″N 79°48′08″E / 14.565783°N 79.802180°E / 14.565783; 79.802180
వికీపీడియా నుండి

వెంగారెడ్డిపాళెం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సంగం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం..

వెంగారెడ్డిపాళెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
వెంగారెడ్డిపాళెం is located in Andhra Pradesh
వెంగారెడ్డిపాళెం
వెంగారెడ్డిపాళెం
అక్షాంశరేఖాంశాలు: 14°33′57″N 79°48′08″E / 14.565783°N 79.802180°E / 14.565783; 79.802180
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం సంగం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

శ్రీ దోర్నాదుల వెంకటసుబ్బయ్య, ఈ గ్రామానికి సర్పంచిగా 2001 నుండి 2006 వరకూ పనిచేశారు. అంతకు ముందు ఆయన పంచాయతీ తాగునీటి పధకం కార్మికుడిగాపనిచేశారు. సర్పంచిగా విధులు నిర్వహిస్తూనే పంచాయతీ తాగునీటి పధకం కార్మికుడిగా గూడా పనిచేశారు. ఆ రకంగా అందరి ప్రశంసలూ పొందారు. తన పదవీ కాలంలో తాగునీటి పధకం మంజూరు చేయించారు. తన చేతనయి నంతగా గ్రామాభివృధికి కృషి చేశారు. సర్పంచిగా 2006 వరకూ బాధ్యతలు సమర్ధవంతముగా నిర్వహించారు. 2006 లో తన పదవీ కాలం పూర్తయిన తరువాత తిరిగి పంచాయితీ కార్మికుడిగా పనిచేస్తూ నెలకు రు.450-00 తీసుకుంటూ, ఆ వేతనంతోనే బతుకు బండి లాగిస్తున్నారు. ఉండటానికి సరియైన ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లు మంజూరయినా అది ఇప్పటికీ పూర్తికాలేదు. భార్య మానసిక అనారోగ్యంతో అదృశ్యం అయ్యారు. కొడుకులిద్దరూ ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళారు. ప్రసుతం ఆయన వయసు మీదపడింది. అయినప్పటికీ తన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహించుచున్నారు.

మూలాలు

[మార్చు]