వీరభద్ర రాజు బహదూర్
రాజా వైరిచెర్ల వీరభద్ర రాజు బహదూర్ | |
---|---|
జననం | 6 సెప్టెంబర్ 1877 |
వృత్తి | రాజకీయవేత్త, జమీందారు |
జీవిత భాగస్వామి | లక్ష్మీ నరసాయమ్మ |
పిల్లలు | వైరిచెర్ల నరసింహ సూర్యనారాయణ రాజు బహదూర్ (1898-1926), వైరిచెర్ల నారాయణ గజపతి రాజు బహదూర్ (జ. 1900), రాణీ జానకి రత్నాయమ్మ |
రాజా వైరిచెర్ల వీరభద్ర రాజు బహదూర్ (జననం 6 సెప్టెంబర్ 1877) ఒక భారతీయ రాజవంశీకుడు, రాజకీయవేత్త. ఈయన 1891 సెప్టెంబరు నుండి కురుపాం వంశపారంపర్య జమీందారుగా, మద్రాసు శాసన మండలి సభ్యుడిగా పనిచేశాడు.
ప్రారంభ జీవితం మరియు విద్య
[మార్చు]వీరభద్ర రాజా బహదూర్ 1877 సెప్టెంబరు 6న విజయనగరం జిల్లాలో అప్పటి కురుపాం జమీందారు సూర్యనారాయణ రాజాకు జన్మించాడు.[1] ఆయన విద్యాభ్యాసమంతా ఎఫ్. ఎ. మాస్ అనే ఆంగ్లేయుడి వ్యక్తిగత పర్యవేక్షణలో జరిగింది
రాజకీయ జీవితం
[మార్చు]1891 సెప్టెంబరులో తన తండ్రి మరణించిన తరువాత "రాజా" అనే బిరుదుతో వీరభద్ర రాజు కురుపాం జమీందారు అయ్యాడు. ఆ తరువాత 1900ల ప్రారంభంలో రాజకీయాల్లోకి ప్రవేశించి, 1905లో మద్రాసు న్యూయింగ్టన్ సలహా మండలిలో సభ్యుడిగా నియమితుడయ్యాడు. 1906లో ఈయన మద్రాసు శాసన మండలికి సంస్థానాల ప్రతినిధిగా, అదనపు సభ్యుడిగా నామినేట్ అయ్యాడు.
కుటుంబం
[మార్చు]1897 మే 19న, అనకాపల్లి జమీందారు సర్ గోడే నారాయణ గజపతిరావు రెండవ కుమార్తె రాణి సాహిబా లక్ష్మీ నరసాయమ్మ పట్ట మహాదేవిని వీరభద్ర రాజు వివాహం చేసుకున్నాడు.[2] ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
- రాజా వైరిచెర్ల నరసింహ సూర్యనారాయణ రాజు బహదూర్ (1898-1926)
- వైరిచెర్ల నారాయణ గజపతి రాజు బహదూర్ (జ. 1900)
- రాణీ జానకి రత్నాయమ్మ (1899-1944)
మూలాలు
[మార్చు]- Vadivelu, A. (1903). The Aristocracy of South India. Madras: Vest & Co. pp. 112–122.
- "Kurupam zamindari". 19 November 2018.
- C. Hayavadana Rao (1915). The Indian Biographical Dictionary. Madras: Pillar & Co. pp. 181–182.
- ↑ (in English) Page:The Aristocracy of Southern India.djvu/156. వికీసోర్స్.
- ↑ లక్కోజు, శ్రీనివాస్ (14 ఫిబ్రవరి 2022). "వాలెంటైన్స్ డే: 'వైజాగ్ తాజ్‌మహల్' వెనుక దాగిన ప్రేమకథ తెలుసా". బీబీసీ. Retrieved 1 October 2024.