వి.బాలకిష్టా రెడ్డి
ఆచార్య వి.బాలకిష్టా రెడ్డి | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | వి.బాలకిష్టా రెడ్డి |
విద్య | ఎల్. ఎల్. ఎం.నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్, పిహెచ్.డి. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, ఢిల్లీ |
విద్యాసంస్థ | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
వృత్తి | లా కళాశాల ఆచార్యుడు |
ఉద్యోగం | చైర్మన్ తెలంగాణ ఉన్నత విద్యా మండలి , తెలంగాణ, ఇండియా |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | పరిశోధకుడు, నిపుణుడు, రచయిత ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎయిర్ అండ్ స్పేస్ లా, ఇండియన్ జర్నల్ ఆఫ్ డిఫెన్స్ అండ్ మ్యారిటైమ్ లా చీప్ ఎడిటర్ |
గుర్తించదగిన సేవలు | పీహెచ్. డీ న్యూఢిల్లీ, వర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్,
రిజిస్ట్రార్, నిత్యాన్వేషణం ISRO డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్. |
పురస్కారాలు | 1). రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2017, 2). నల్సార్ ఎక్సలెన్స ఇన్ రిసెర్చ్ అవార్డు-2021 |
వి.బాలకిష్టా రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్. ఆయన 2024 అక్టోబర్ 17న తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా నియమిస్తూ విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో జారీ చేయడంతో."ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ వి.బాలకిష్టా రెడ్డి నియమితులయ్యాడు[1][2][3].
జననం, విద్యాభాస్యం
[మార్చు]వి. బాల కిష్టారెడ్డి తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా,తాడూరు మండలంలోని పర్వతయ్యపల్లి గ్రామంలో జన్మించాడు.జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల కుమ్మెరాలో పదవ తరగతి పూర్తి చేశాడు. బాల కిష్టారెడ్డి , ఇంటర్నేషనల్ లా ప్రొఫెసర్, డీన్ - స్కూల్ ఆఫ్ లా ప్రొఫెసర్ మహీంద్రా విశ్వవిద్యాలయం హైదరాబాద్.యం కే నయాంబర్ సార్క్ లా సెంటర్ కోఆర్డినేటర్ , హెడ్ సెంటర్ ఫర్ ఎయిర్ అండ్ స్పేస్ లా , నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం హైదరాబాదు నగరంలోని శామీర్‌పేట ప్రాంతంలో హెడ్ సెంటర్ ఫర్ ఎయిర్ అండ్ స్పేస్ లా చేసిన డాక్టర్ బాలకిష్టా రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాదు నుండి ఇంటర్నేషనల్ లా లో ఎల్ ఎల్ ఎం పూర్తి చేసి ఆ తర్వాత ఏం.ఫిల్ పట్టా అందుకున్నాడు. తదనంతరం జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్టీయూ) న్యూ ఢిల్లీ నుండి పీ హెచ్ డీ పట్టా అందుకున్నాడు.అతనికి ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ లా లో పన్నెండు సంవత్సరాల బోధన , పరిశోధన అనుభవం ఉంది.
వృత్తి జీవితం
[మార్చు]వి.బాల కిష్టారెడ్డి నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం (ఆంగ్లం:NALSAR - National Academy for Legal Studies and Research) లో ప్రొఫెసర్‌గా చేరి ఇంటర్నేషనల్ లా లో రిజిస్ట్రార్ హెడ్ సెంటర్ ఫర్ ఎరోస్ పేస్, డిఫెన్స్ లా నల్సార్ యూనివర్సిటీ లో సేవలందించాడు.హైదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ మహేంద్ర యూనివర్సిటీ లో డీన్ గా పని చేశాడు.2024లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా నియమితుడయ్యాడు[4].
సేవలకు గుర్తింపు
[మార్చు]వి.బాలకిష్టారెడ్డి యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పని చేస్తు పలు వర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేశాడు. అంతరిక్ష చట్టాల పై భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO)నియమించిన ముసాయిదా కమిటీలో క్రియాశీలక సభ్యుడుగా సేవాలందిస్తున్నాడు. తెలంగాణ మార్కెట్ల చట్టం -2016 , ఆంధ్రప్రదేశ్ స్కల్ డెవెలప్ మెంట్ బిల్లు -2016, ఆంధ్రప్రదేశ్ భూసేకరణ బిల్లు -2016, తెలంగాణ భూసేకరణ బిల్లు -2017, తెలంగాణ మున్సిపాలిటీల ముసాయిదా బిల్లు -2019 మొదలగు రూపకల్పనలో కీలక భూమిక పోషించాడు. చుట్టాలు విధి విధానాల పై అనేక పుస్తకాలను రూపొందించి ఆవిష్కరించాడు. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎయిర్ అండ్ స్పేస్ లా, ఇండియన్ జర్నల్ ఆఫ్ డిఫెన్స్ అండ్ మ్యారిటైమ్ లా తదితర సంస్థల్లో చీఫ్ ఎడిటర్ గా పలు సేవాలందించాడు.
రచనలు
[మార్చు]వి.బాలకిష్టా రెడ్డి రచించిన పుస్తకాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. అతని రచనలు,
•1. ఎయిర్ లా అండ్ పాలసీ ఇన్ ఇండియా,
•2. రీసెంట్ ట్రెండ్ ఇన్ ఇంటర్నేషనల్ స్పేస్ లా అండ్ పాలసీ,
•3.ఎమర్జింగ్ ట్రెండ్ ఇన్ ఎయిర్ అండ్ స్పేస్ లా,
•4.స్పేస్ లా & కాంటెంపరరీ ఇష్యూస్ మొదలగు పుస్తకాలు రచించారు.
అవార్డులు
[మార్చు]వి.బాలా కిష్టారెడ్డి విద్యా రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017 లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించింది. 2021 లో నల్సార్ ఎక్సలెన్స ఇన్ రి సెర్చ్ అవార్డు అందుకున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ Velugu, V6 (2024-10-16). "Telalangana: ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొ. బాలకిష్టా రెడ్డి". V6 Velugu. Retrieved 2024-12-10.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India, The Hans (2024-10-17). "Prof V Balakista Reddy appointed as new chairman of TGHEC". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-12-10.
- ↑ Today, Telangana (2024-10-16). "Telangana: Dr. Balakista Reddy appointed as new TGCHE chairman". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-12-10.
- ↑ ABN (2024-10-17). "Hyderabad: ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొ. బాలకిష్టారెడ్డి". Andhrajyothy Telugu News. Retrieved 2024-12-10.