విషం
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/39/Hazard_T.svg/220px-Hazard_T.svg.png)
విషం: విషం శరీరం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది, కొన్ని సార్లు విషం ప్రభావం వలన బాగా దేహమంతా నొప్పి, మసక బారిన దృష్టి, తల తిరగడం, మగత, పక్షవాతం కలుగుతాయి. విష తీవ్రత ఎక్కువగా ఉంటో మరణం సంభవిస్తుంది. విషం పాములలో, తేలులో, ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా పాముల కోరల్లో ఉంటుంది. పాము విషం మందుల తయారీలలో (జంతువులకు) విషం వాడుతారు.
విరుగుడు
[మార్చు]కొన్ని విషాలు నిర్దిష్ట విరుగుడు కలిగి ఉంన్నాయి:
విషం/మందు | విరుగుడు |
---|---|
పారాసిటమాల్ (acetaminophen) | N-acetylcysteine |
vitamin K anticoagulants, e.g. warfarin | విటమిన్ K |
opioids | నలాక్సోన్ |
ఇనుము (and other heavy metals) | desferrioxamine, Deferasirox or Deferiprone |
benzodiazepines | flumazenil |
ethylene glycol | ethanol, fomepizole or Thiamine |
మిథనాల్ | ఇథనాల్ or fomepizole |
సయనైడ్ | amyl nitrite, సోడియం నైట్రైట్ & sodium thiosulfate |
Organophosphates | ఎట్రోపిన్ & Pralidoxime |
మెగ్నీషియమ్ | Calcium Gluconate |
Calcium Channel Blockers (Verapamil, Diltiazem) | కాల్షియం గ్లూకొనేట్ |
Beta-Blockers (Propranolol, Sotalol) | Calcium Gluconate and/or Glucagon |
ఇసోనియాజిడ్ | పైరిడాక్సిన్ |
ఎట్రోపిన్ | Physostigmine |
విషాన్ని పీల్చే మొక్కలు
[మార్చు]మొక్కల సాయంతో, మట్టి నుంచి విష రసాయనాలను తొలగించే పద్ధతిని ఫైటోరెమేడియేషన్ (Phytoremediation) అంటారు. సూక్ష్మజీవుల నుంచి రెండు జన్యువులను వేరుచేసి అరాబిడాప్సిస్ థేలియానా అనే తీగ మొక్కలోకి ఎక్కించారు. ఇది ఏథెన్స్ లోని జార్జియా విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రయత్నం. ఆర్సెనిక్ బాగా చేరిన నేలలో కూడా ఈ మొక్క తట్టుకుని బాగా పెరుగుతుంది. అంతేగాక మట్టిలోని విష రసాయనాన్ని పెద్ద ఎత్తున పీల్చుకుని తన ఆకులలో నిలువ చేసుకుంటుంది. సూక్ష్మజీవి నుంచి తీసిన జన్యువులు ఈ విష రసాయనాన్ని పీల్చుకునే రకంగా మారుస్తాయి. రసాయనపు సమ్మేళనాలను విరిచి పీల్చడానికి అనువుగా మార్చగల శక్తి ఈ జన్యువుల కారణంగానే మొక్కకు అందింది. వివిధ రకాల మొక్కల వేళ్లు ఒక ఎకరం నేలలో , ఒక ఏడాది కాలంలో కోట్లమైళ్ల పొడుగున పెరుగుతుంటాయి. అవన్నీ కలిసి విష రసాయనాలను పీల్చడం మొదలు పెడితే మొత్తం రసాయనం నేలలో నుంచి బయటకు వచ్చేస్తుంది. రెండు లేదా మూడు సంవత్సరాలలో నేలలను పంటకు, మనుషుల వాడకానికి అనువుగా మార్చగల మొక్కలను తయారుచేయవచ్చునని, ఈ పరిశోధనలో ముఖ్యపాత్ర వహించిన రిచర్డ్ మీగర్ అంటున్నారు.[1]
మట్టిలో ఆర్సెనికి రసాయనం సహజంగానే ఉంటుంది. కానీ గనుల తవ్వకం, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలను ఇష్టం వచ్చినట్లు వదలడం, భూగర్భజలాలను వెలికి తీయడం కారణంగా, మట్టిలో దాని మోతాదు అపాయకరమైన చోటికి పెరుగుతుంది. ఈ రసాయనం కొంచెమున్నా కూడా క్యాన్సర్, నాడీమండల వ్యాధులు పుడతాయి. బంగ్లాదేశ్ లోనూ, మనదేశంలోని పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోనూ భూగర్భజలాలలో ఆర్సెనిక్ ఎక్కువగా ఉంది. అందుకే ఆ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఆర్సెనిక్ పాయిజనింగ్ కు గురవుతున్నారు.
ఆర్సెనిక్, కాడ్మియం, పాదరసం, రాగి, యశదం లాంటి కాలుష్య రసాయనాలను విడగొట్టి అపాయం లేకుండా చేయడం కుదరదు. అవి ఎక్కువగా ఉన్న మట్టిని తవ్వి మరెక్కడో గుంటలు పూడ్చడం ఒక పద్ధతిగా వస్తున్నది. కానీ దీనికయే ఖర్చు, తర్వాత నేల లోతులాంటి మార్పులు పనికి అడ్డంకులవుతున్నాయి. అటువంటి చోట్ల జన్యుపరంగా మార్చిన మొక్కలను పెంచితే రసాయనాలు సులభంగా నేలనుంచి బయటకు వస్తాయి. రసాయనాలుగల ఆకులను జాగ్రత్తగా తగలవెట్టి బెడద తప్పించుకోవచ్చు. ఈలోగా వాటిని పశువులు మాత్రం మేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి వుంటుంది. వరిలాంటి పంటలను, పెరిగే తామరవంటి మొక్కలను కూడా ఈ పద్ధతికి వాడుకుంటే రసాయన కాలుష్యాన్ని మరింత సులభంగా తొలగించవచ్చునని పరిశోధకులు అభిప్రాయం వెలిబుచ్చారు. అలాగే నేరుగా సూక్ష్మజీవులను వాడి కాలుష్యం తొలగించే పద్ధతుల గురించి కూడా పరిశోధనలు మరింతగా జరుగుతున్నాయి. మొక్కల సాయంతో లోహ రసాయనాలు నిర్మూలన గురించి ఈ మధ్యనే ఒక సదస్సు జరిగింది.