విశ్వనాథనాయని స్థానాపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశ్వనాథనాయని స్థానాపతి
మదురై నాయక రాజుల్లో మొదటివాడు
మదురై నాయక రాజ్య స్థాపకుడు విశ్వనాథ నాయకుడు
పరిపాలన1529– 1564C.E.
ఉత్తరాధికారిమధురై నాయకులు
మరణంమదురై, తమిళనాడు, భారత దేశం
తండ్రినాగమ నాయకుడు

విశ్వనాథనాయని స్థానాపతి లేదా విశ్వనాథ నాయకుడు , మదురైలో నాయక రాజుల పరంపరలో మొదటి వాడు. విశ్వనాథ నాయకుడు విజయనగరం నుండి మధురకు తరలివచ్చాడు. అతను వచ్చిన నాటిక మధుర మీనాక్షి దేవాలయము పూజలు లేక బూజుపట్టి ఉందట. మధుర రాజ్యమంతా చిట్టడవులుగా ఉందట. దొంగల భయం ఎక్కువగా ఉండేదట. దుర్గాలు శిథిలావస్థలో ఉండేవట గుళ్ళు గోపురాలు కళా విహీనములై ఉన్నాయట. శాంతి భద్రతలు లేవట.

మధురను మొట్టమొదటగా పునరుద్ధరించాలనుకొని, విశ్వనాథ నాయకుడు దళవాయి ప్రధాని అరియనాథ మొదలి, దళవాయి బిసపాకం కేశవప్పనాయడు మొదలగు వారిని సంప్రదించి, మధురను పునర్నిర్మించాడు. ఆపైన మీనాక్షి సుందరేశ్వరుల ఆలయమును ఇప్పుడున్న స్థితికి తెచ్చాడు.

అతని యేలుబడిలో మధుర సర్వ విధముల అభివృద్ధి చెందెననుట నిస్సంశయము. అని మధుర నాయక రాజులు పుస్తకంలో చల్లా రాధాకృష్ణశర్మ అంటారు.[1]

విశ్వనాథ నాయకుడు తొలుత పాండ్య చోళ మండలములకు రాజప్రతినిధిగా నియమింపబడ్డాడు. కానీ శ్రీకృష్ణదేవరాయల మరణం తరువాత, అచ్యుత దేవరాయల కాలములో చోళ మండలము ప్రత్యేక రాజ్యముగా చెలామణిలోకి వచ్చింది. చెవ్వప్ప నాయకుడు ఆ మండలానికి పరిపాలకుడయ్యాడు. అతడు అచ్యుత దేవరాయలవారి మరదలగు మూర్తెమ్మను వివాహం చేసుకున్నాడు. ఆ సందర్భంలో చెవ్వప్ప నాయకునికి తంజావూరి రాజ్యము అరణముగా లభించినట్లు తెలుస్తోంది.

మూలాలు

[మార్చు]
  1. చల్లా రాధాకృష్ణ శర్మ, మధుర నాయక రాజులు, లక్ష్మీనారయణ గ్రంథమాల, ప్రథమ ముద్రణ 1978, పుట 11