విశ్వం నాలుగు డైమన్షన్ల లో వంపు తిరిగి ఉంది
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
“కాలం” అనే అక్షం వెంబడి ప్రయాణం చేసి, “వెనక్కి” తిరిగి చూస్తే మూడు దిశలు ఉన్న మన భౌతిక ప్రపంచంలో ఉన్న వంపులు కనబడతాయా?” ఒక క్యూబ్ ఆకారం లో ఉన్న రబ్బర్ ని తీసుకోండి. దానిని మూడు దిక్కులలోనూ వంచవచ్చు కదా? ఆ వంపుని చూడటానికీ అనుభవించటానికీ నాలుగో దిశ ఐన సమయం అవసరం లేదు. క్యూబ్ ని ఎక్స్ అక్షం వైపూ, వై అక్షం చుట్టూ వంచితే, ఆ క్యుబ్ పై ఉన్న ఒక చీమ చేసే “వై అక్షం దిశ లో కదలిక” వలన వేరే ఏ దిశలోనూ కదలిక ఉత్పన్నం కాదు. కానీ జెడ్ అక్షం వైపు కదిలితే అది ఎక్స్ అక్షం వైపుకూడా కదలికని తెస్తుంది.ఈ క్యూబ్ ని మూడు అక్షాల దిశలవైపుకీ ఒకే సారి వంచవచ్చు. అప్పుడు అది ఉల్లిపాయ అకారం లోనే ఉంటుంది. అప్పుడు ఏ ఒక్క దిశలో జరిపిన కదలిక అయినా మిగిలిన దిశలలో కూడా కదలికను తెస్తుంది. ఈ క్యూబ్ ని నాలుగవ దిక్కు అయిన సమయం వైపు వంచటాన్ని ఊహించుకోవటం కొంచెం కష్టం. కానీ రెండు దిశలు ఉన్న వస్తువుని (ఉదా: కాగితం) మూడవ దిశ లో వంచినపుడు, ఆ వంపు వెంబడి ప్రయాణం చేస్తే మూడవ దిక్కులో ప్రయాణిస్తాం.అలానే కాలం అనే నాలుగవ దిశ లో వంచబడిన స్థలం, (మూడు దిశల వస్తువు) యొక్క వంపు వైపుకి వెళ్తే కాలం లో ముందుకీ వెనుకకీ ప్రయాణం చేయగలగాలి. అంతే కాదు, స్థలాన్ని కాలం డిశలో వంచుతూనే, మిగిలిన మూడు దిశలలో కూడా వంచవచ్చు. అప్పుడు, మనం యే దిశ లో ప్రయాణం చేసినా, ఈ వంపు వలన కొంత కాలం దిశలో కూడా ప్రయాణం చేస్తాం! ఇక స్థలకాలం (స్పేస్ టైం) నాలుగు దిశల వస్తువు, ఉన్న నాలుగు దిశలలోనే వంచబడింది. అన్ని అక్షాల వెంబడీ వంచబడింది. ఉల్లిపాయ పొరలని ఒక దానికొకటి స్పైరల్ లా కనెక్షన్ ఇచ్చినట్లు. బాగా గుండ్రంగా ఉండి స్పైరల్ గా వంపులు తిరిగిన నత్తగుల్ల ఆకారమూ ఈ ఆకారమూ ఒకటే!