విలేజ్ వ్యాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విలేజ్ వ్యాన్ యూట్యూబ్ లోగో

విలేజ్ వ్యాన్ అనేది తెలుగు యూట్యూబ్ ఛానల్ ,[1] ఇది 2020 అక్టోబర్ 23 న  సురేష్ జుత్తాడ ప్రారంభించాడు. దీని ప్రధాన కార్యాలయం విశాఖపట్నం  , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఉంది.

ప్రస్థానం

[మార్చు]
సురేష్_జుత్తాడ.jpg

సురేష్ జుత్తాడ జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేసిన సురేష్ పదేళ్లపాటు ఆంధ్రజ్యోతి, హెచ్.ఎం.టీవీ, 99 టీవీ, స్టూడియో ఎన్ వంటి ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల్లో వివిధ హోదాల్లో పనిచేశాడు . ఆయా సంస్థల్లో సంతృప్తి లభించకపోవడంతో స్వస్థలమైన శ్రీకాకుళం జిల్లాకు వచ్చి విలేజ్ వ్యాన్ యూ ట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టాడు.

చిత్రీకరణ

[మార్చు]

గిరిజనుల జీవనశైలి, ఆచార వ్యవహారాలు, వారి కష్టాలు, కన్నీళ్లు, ఎదుగుతున్న తీరు, మోసపోతున్న కథనాలను అందిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, చత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని సవర, గదబ, బగత, జాతాపు, యానాది, కొండరెడ్డి, కోయ, గుత్తి కోయ, కోలాం వంటి అనేక ఆదివాసీ తెగల కథనాలను ప్రేక్షకులకు అందించాడు. ఇప్పటివరకు మూడు కోట్లకు చేరువవుతున్న వ్యూస్ తో అన్ని వర్గాల ప్రజలకు విలేజ్ వ్యాన్ అలరిస్తోంది. ఎన్నో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న కథనాలను అందించిన విలేజ్ వ్యాన్ ఛానల్ ప్రారంభించిన ఏడాదికే యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్ అందుకుంది.[2]

పురస్కారం

[మార్చు]

1. అన్ లీష్ ది పవర్ ఆఫ్ పాజిటివ్ ఇన్ ఫ్లుయన్స్ అవార్డు-2023, (ఎండ్ నౌ ఫౌండేషన్)

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, ఆదివారం (2023-01-08), గిరిజన జీవనం.., retrieved 2024-06-01
  2. Village Van (2023-12-23), విలేజ్ వ్యాన్ చానెల్ కు గౌరవం Special Award for Village van, retrieved 2024-06-01