విలియం జాన్ థామ్స్
విలియం జాన్ థామ్స్ (1803 నవంబరు 16 - 1885 ఆగష్టు 15) 1846లో జానపద సాహిత్యం(Folklore) అనే పదాన్ని రూపొందించిన బ్రిటీష్ రచయిత.[1] ఆయన స్ఫూర్తితోనే ప్రపంచ జానపద దినోత్సవం (world folklore day) ప్రతీ ఆగస్టు 22న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.[2]జానపద కథలు, పురాణాల గురించి ఆయన పరిశోధన చేసాడు. అది జానపద సాహితీ్యం అభివృద్ధికి తోడ్పడింది. ఆయన ఒక మార్గదర్శక జనాభా శాస్త్రవేత్త (Demographer).
జీవిత చరిత్ర
[మార్చు]ఆయన 1803 నవంబరు 16న జన్మించాడు. ఆయన పురాతత్వవేత్తగా, రచయితగా పనిచేశాడు. అనేది బ్రిటీష్ సైన్యంనకు చెందిన రాయల్ చెల్సియా హాస్పిటల్ సెక్రటరీ కార్యాలయంలో చాలా కాలం గుమాస్తాగా పనిచేశాడు. ఆయన అండన్ కు చెందిన సొసైటీ ఆఫ్ యాంటిక్వేరీస్‌లో సహచరుడిగా చేయబడ్డాడు. 1838లో కామ్‌డెన్ సొసైటీకి కార్యదర్శి అయ్యాడు. 1845లో, ఆయన యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంటు ఎగువ సభ అయిన హౌస్ ఆఫ్ లార్డ్స్[3]కు క్లర్క్‌గా నియమితుడయ్యాడు. ఆ తరువాత హౌస్ ఆఫ్ లార్డ్స్ లైబ్రరీలో డిప్యూటీ లైబ్రేరియన్‌గా నియమించబడ్డాడు. 1849లో, ఆయన నోట్స్ అండ్ క్వరీస్ అనే త్రైమాసిక పత్రికను స్థాపించి, కొంతకాలం ఎడిటర్ గా వ్యవహరించాడు.
ఆయన 1846లో బ్రిటీష్ పత్రిక ది ఎథీనియంకు రాసిన వ్యాసంలో "జానపద సాహిత్యం" అనే పదాన్ని కనిపెట్టిన ఘనత పొందాడు.[4] ఆయన "ప్రసిద్ధ పురాతన వస్తువులు", "పాపులర్ లిటరేచర్"లతో సహా ఆ సమయంలో ఉపయోగించిన అనేక ఇతర పదాలను భర్తీ చేయడానికి folk+lore అనే సమ్మేళన పదాన్ని కనుగొన్నాడు. ఆయన జర్మన్ రచయిత జాకబ్ గ్రిమ్ రచనలను ఇష్టపడ్డాడు.
ఆయన 1885 ఆగస్టు 15న మరణించాడు. లండన్‌లోని బ్రోంప్టన్ స్మశానవాటికలో ఆయన ఖననం చేయబడ్డాడు.
మూలాలు
[మార్చు]- ↑ Sims, Martha; Martine Stephens (2005). Living Folklore. Logan, Utah: Utah State University Press. p. 23. ISBN 9780874216110.
- ↑ "నేడు అంతర్జాతీయ జానపద కళల దినోత్సవం". web.archive.org. 2023-08-21. Archived from the original on 2023-08-21. Retrieved 2023-08-21.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Role and work of the House of Lords". Parliament UK. Retrieved 18 June 2023.
- ↑ Jonathan Roper. Our National Folk-Lore.