Jump to content

వినోద్ ధామ్

వికీపీడియా నుండి
వినోద్ ధామ్
జననం1950 (age 73–74)
పూణే, భారతదేశం
నివాసంభారతదేశం
పౌరసత్వంభారతదేశం
జాతిభారతీయుడు

వినోద్ ధామ్ ఇంటెల్ పెంటియమ్ చిప్ యొక్క రూపకర్తగా ప్రసిద్ధుడు. ధామ్ 1950 సం. పంజాబీ కుటుంబంలో జన్మించారు. అయన తండ్రి మిలిటరీ వ్యక్తీ, భారత దేశ విభజన తరువాత రావల్పిండి నుండి భారతదేశానికి వచ్చారు. ధామ్ 21 సంవత్సరాల వయసులో ఢిల్లీ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులైనారు. అ తరువాత ఢిల్లీలోని సెమీ కండక్టర్ కాంటినెంటల్ డివైసెస్లో చేరినారు, అ పిమ్మట 1975 లో ఉన్నత విద్య అభ్యసించుటకు యూనివర్సిటీ అఫ్ సిన్‌సినాటీలో చేరారు. 1977 లో మాస్టర్ డిగ్రీ పుచుకొని ఎన్.సి.ఆర్ కార్పోరేషన్లో ఉద్యోగ నిమిత్తం చేరినారు. ఆపై ఇంటెల్, ఏ.ఎం.డిలలో చేరి ఉన్నతమైన చిప్‌లను తయారుచేశాడు.