విధేయన్
విధేయన్ | |
---|---|
దర్శకత్వం | అడూర్ గోపాలక్రిష్ణన్ |
స్క్రీన్ ప్లే | అడూర్ గోపాలక్రిష్ణన్ |
దీనిపై ఆధారితం | పాల్ జకారియా రాసిన భాస్కర పట్టెలరుమ్ ఎన్టీ జీవితం అనే నవల ఆధారంగా |
నిర్మాత | కె. రవీంద్రన్ నాయర్ |
తారాగణం | మమ్ముట్టి ఎంఆర్ గోపకుమార్ తన్వి ఆజ్మీ |
ఛాయాగ్రహణం | మంకడ రవివర్మ |
కూర్పు | ఎం. మణి |
సంగీతం | విజయ భాస్కర్ |
నిర్మాణ సంస్థ | జనరల్ పిక్స్ |
విడుదల తేదీ | 1994 |
సినిమా నిడివి | 112 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
విధేయన్, 1994లో విడుదలైన మలయాళ సినిమా. జనరల్ పిక్స్ బ్యానరులో కె. రవీంద్రన్ నాయర్ నిర్మించిన ఈ సినిమాకు అడూర్ గోపాలక్రిష్ణన్ దర్శకత్వం వహించాడు.[1] ఈ సినిమాలో మమ్ముట్టి, ఎంఆర్ గోపకుమార్, తన్వి ఆజ్మీ ప్రధాన పాత్రలు పోషించగా, విజయ భాస్కర్ సంగీతం అందించాడు.[2] మలయాళ రచయిత పాల్ జకారియా రాసిన భాస్కర పట్టెలరుమ్ ఎన్టీ జీవితం అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమాకు మలయాళంలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, జాతీయ ఉత్తమ నటుడు (మమ్ముట్టి) అవార్డులు వచ్చాయి. కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చిత్రంతోపాటు అనేక అవార్డులను గెలుచుకుంది.
నటవర్గం
[మార్చు]- మమ్ముట్టి (భాస్కర పటేలర్)
- ఎంఆర్ గోపకుమార్ (థమ్మీ)
- తన్వి అజ్మీ (భాస్కర పటేలర్ భార్య)
- సబిత ఆనంద్ (ఓమన)
- అలియర్
- బాబు నంబూతిరి
- కెపిఏసి అజీజ్
- ప్రొ. కెవి తంపి
- కృష్ణన్ కుట్టినాయర్
- నవీన్ డి. పాడిల్
నిర్మాణం
[మార్చు]జకారియా రాసిన ఈ నవల పటేలా శేఖర గౌడ (శిరాడి శేఖర) అనే నిజ జీవిత పాత్రను దృష్టిలో ఉంచుకొని రాయబడింది. రచయిత జటారియా కర్ణాటకలోని మంగళూరు సమీపంలో నివసిస్తున్నప్పుడు ఈ పటేలార్ కథలు విన్నాడు.[3] సినిమా విడుదలైన తర్వాత, అడూర్ సినిమాపై జకారియాతో గొడవ పెట్టుకున్నాడు. అడూర్ తన కథను హిందుత్వంతో నింపాడని జకారియా అన్నాడు.[4]
అవార్డులు
[మార్చు]- జాతీయ ఉత్తమ నటుడు - మమ్ముట్టి
- మలయాళంలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ - అడూర్ గోపాలక్రిష్ణన్
- కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు[5]
- ఉత్తమ చిత్రం - కె. రవీంద్రన్ నాయర్ (నిర్మాత), అడూర్ గోపాలక్రిష్ణన్ (దర్శకుడు)
- ఉత్తమ దర్శకుడు - అడూర్ గోపాలక్రిష్ణన్
- ఉత్తమ నటుడు - మమ్ముట్టి
- ఉత్తమ కథ - పాల్ జకారియా
- ఉత్తమ స్క్రీన్ ప్లే - అడూర్ గోపాలక్రిష్ణన్
- కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు: స్పెషల్ జ్యూరీ అవార్డు - ఎంఆర్ గోపకుమార్
- ఇతర అవార్డులు
- రోటర్‌డామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎన్ఈటిపిఏసి అవార్డు[6]
- ఇంటర్‌ఫిల్మ్ అవార్డు - మన్‌హీమ్ -హైడెల్‌బర్గ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం[6]
- ఫీచర్ ఎఫ్ఐపిఆర్ఈఎస్సిఐ, స్పెషల్ జ్యూరీ ప్రైజ్, సింగపూర్
మూలాలు
[మార్చు]- ↑ "Vidheyan (1993) | Vidheyan Malayalam Movie | Movie Reviews, Showtimes". NOWRUNNING (in ఇంగ్లీష్). Retrieved 2021-08-26.
- ↑ "Vidheyan (1993)". Indiancine.ma. Retrieved 2021-08-26.
- ↑ "പട്ടേലർ എന്നൊരു സത്യം". Malayala Manorama. March 27, 2011.
- ↑ Gowri Ramnarayan (September 24 – October 7, 2005). "A constant process of discovery". Frontline (magazine). Retrieved 2021-08-26.
- ↑ "Kerala State Film Awards: 1993". Kerala State Chalachitra Academy. Archived from the original on 2 October 2010. Retrieved 2021-08-26.
- ↑ 6.0 6.1 http://timesofindia.indiatimes.com/entertainment/malayalam/movies/Must-Watch-International-Award-Winning-Malayalam-Films/Must-Watch-International-Award-Winning-Malayalam-Films/photostory/52255804.cms