విద్యుదయస్కాంత పరికరాలకు తగిన అయస్కాంత పదార్ధాలు
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
విద్యుదయస్కాంత పరికరాలకు తగిన అయస్కాంత పదార్ధాలను ఎన్నుకోవడానికి I-H, B-Hగ్రాఫ్ లు ఉపయోగపడతాయి.
(a) విద్యుదస్కాంత కోర్ లను ఎన్నుకోవటం
[మార్చు]విద్యుదస్కాంత కోర్ లకు ఉపయోగపడే వస్తువులకు క్రింది లక్షణాలు వుండవలెను.
(1) ఎక్కువ అయస్కాంత ప్రేరణ లేదా ఎక్కువ శేషాయస్కాంతత్వము.
(2) తక్కువ నిగ్రహ బలము.
(3) తక్కువ ప్రేరణ క్షేత్ర బలానికి కూడా ఎక్కువ అయస్కాంత ససెప్టబిలిటీ
(4) అయస్కాంత ప్రేరణ చక్రంలో చాలా తక్కువ శక్తి నష్టపోవటం.
మెత్తటి ఇనుము, ఉక్కు B-H గ్రాఫ్ లను పరిశీలిస్తే, ఉక్కుకన్న మెత్తటి ఇనుములోనే పై లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. కనుక విద్యుదయస్కాంత కోర్ లకు మెత్తటి ఇనుమే వాడతారు.
(b)ట్రాంస్ ఫార్మర్, డైనమోకోర్ లు
[మార్చు]ట్రాంస్ ఫార్మర్, డైనమోకోర్లకు ఉపయోగపడే పదార్ధాలకు క్రింది లక్షణాలు వుండవలెను.
(1) తక్కువ ప్రేరణ క్షేత్రబలానికికూడా ఎక్కువ అయస్కాంత పర్మియబిలిటీ.
(2) అయస్కాంత ప్రేరణ సైకిల్ లో తక్కువ శక్తి నష్టపోతుంది.
ఈ లక్షణాలు ఉక్కులోకన్న మెత్తటి ఇనుములోనే ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ట్రాంస్ ఫార్మర్, డైనమోకోర్ లకు మెత్తటి ఇనుమునే వాడతారు. ఇది గాక స్టాలాయ్, పెర్ం అలాయ్, మ్యూనెటల్, రేడియో మొటర్ మొదలైన ఇనుముతో కూడిన మిశ్రమ లోహాలలోకూడా పై లక్షణాలు ఎక్కువగావుండటాం వలన వీటిని కూడా ట్రాంస్ ఫార్మర్, డైనమోకోర్లకు వాడతారు.
(c)శాశ్వత అయస్కాంతాలు
[మార్చు]వీటికి క్రింది లక్షణాలు వున్న పదార్ధాలను ఉపయోగిస్తారు.
(1) అధిక శేష అయస్కాంతత్వం.
(2) ఎక్కువ నిగ్రహ బలము.
(3) యాంత్రిక దోషాలకు, ఉష్ణోగ్రతా భేదాలకు అయస్కాంతత్వము నష్టపోకుండా ఉండటం.
మెత్తటి ఇనుములోకన్న ఉక్కులో పై లక్షణాలు అధికంగా వుండటంవల్ల ఉక్కును శాశ్వత అయస్కాంతాలు తయారుచేయటానికి ఉపయోగిస్తారు. ఉక్కుతో బాటు టంగ్ స్టన్ ఉక్కు, కోబాల్ట్ ఉక్కు, ఆల్ని కోఉక్కు మొదలైన ఉక్కుతో కూడిన మిశ్రమ లోహాలలో కూడా పై లక్షణాలు అధికంగా ఉండటంవల్ల, వీటిని కూడా శాశ్వత అయస్కాంతంలు తయారుచేయటానికి ఉపయోగిస్తారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- device for electromagnetic wave radiation in micron wavelength ranges US 3443854 A[permanent dead link]
- Materials and Devices for the 21st Century: Stronger, Lighter, and More Energy Efficient
మూలాలు
[మార్చు]- ↑ విద్యుదయస్కాంత పరికరాలకు తగిన అయస్కాంత పదార్ధాలను ఎన్నుకోవటం,పేజి నెం-185, స్థిర విద్యుత్ శాస్త్రము- ద్రవ్య అయస్కాంత ధర్మాలు, సంపాదకులు బి. రామచంద్రరావు,తెలుగు అకాడమి, 1972,హైదరాబాద్