విద్యార్థులకు పాఠ్యాంశంగా భగవద్గీత
రాష్ట్రాలు కోరుకుంటే తమ విద్యాసంస్థల్లో విద్యార్థులకు పాఠ్యాంశంగా భగవద్గీత బోధించవచ్చని 2021 డిసెంబరు 20న లోక్‌సభలో ప్రభుత్వం ప్రకటించింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ స్కూలు ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) సిలబస్‌లో వివిధ తరగతుల్లో ఇప్పటికే భగవద్గీతను బోధిస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి అన్నపూర్ణ దేవి ఈ సందర్భంగా ప్రస్తావించారు.[1]
గుజరాత్ ప్రభుత్వం 2022 మార్చి17న తీసుకున్న నిర్ణయం మేరకు ఇకపై ఆ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు భగవద్గీతను పాఠ్యాంశంగా బోధిస్తారు. దీనిపై రాష్ట్ర విద్యా శాఖ కార్యాచరణ ఇప్పటికే మొదలుపెట్టింది. విద్యార్థుల సమగ్ర వికాసానికి 2022-23 విద్యా సంవత్సరంలో దేశ సంస్కృతి, జ్ఞాన వ్యవస్థను పరిచయం చేయడంలో భాగంగా భగవద్గీతలోని విలువలను విద్యార్థులకు అందించడమే ఉద్దేశమని విద్యాశాఖ మంత్రి జితు వాఘాని తెలిపారు. ఆరు నుంచి 8వ తరగతి వరకు కథలు, శ్లోకాల రూపంలో భగవద్గీత పాఠాలు ఉంటాయని, 9-12వ తరగతి విద్యార్థులకు కథ, శ్లోకాలు ఫస్ట్ లాంగ్వేజ్ పాఠ్యపుస్తకంలో ఉంటాయని ఆయన తెలిపారు.[2]
ఇవీ చదవండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Punnam, Venkatesh (2021-12-20). "రాష్ట్రాలు వీలైతే విద్యార్థులకు భగవద్గీత బోధించవచ్చు". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-02-25. Retrieved 2022-03-21.
- ↑ Telugu, TV9 (2022-03-17). "Gujarat: ఇక నుంచి ఆ రాష్ట్రంలో స్కూల్స్‌లో భగవద్గీత తప్పనిసరి... వచ్చే ఏడాది నుంచి అమల్లోకి". TV9 Telugu. Retrieved 2022-03-21.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)