Jump to content

విద్యార్థి విజ్ఞాన్ మంథన్

వికీపీడియా నుండి

డి ఆర్ డి ఓ, బార్క్, సి ఎస్ ఐ ఆర్ వంటి జాతీయ ప్రఖ్యాత పరిశోధనా సంస్థలను సందర్శించే అవకాశం తో పాటు మూడు వారాలు ఇంటర్న్ షిప్ ఏడాది పాటు నగదు ప్రోత్సాహకాలు అందుకునేందుకు విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది[1]. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ ,విజ్ఞాన భారతి , నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏటా విద్యార్థి విజ్ఞాన్ పరీక్ష నిర్వహిస్తుంది. ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకు జూనియర్లుగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు సీనియర్లుగా పరిగణించి పరీక్ష నిర్వహిస్తారు . 2024 కు సంబంధించి జాతీయస్థాయి పరీక్ష మే 18, 19 తేదీల్లో నిర్వహించనున్నారు. ఐ సి ఎస్ సి , సి బి ఎస్ సి ,రాష్ట్ర బోర్డు విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు.ఎంపిక ఇలా ఈ పోటీ పరీక్షలను పాఠశాల ,జిల్లా , రాష్ట్ర ,జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. జిల్లాలో ఆరు నుంచి ఇంటర్ వరకు ప్రతి తరగతిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు చొప్పున మొత్తం 18 మంది విద్యార్థులకు మెరిట్ ధ్రువ పత్రాలు ఆన్లైన్లో అందిస్తారు.రాష్ట్ర స్థాయిలో ప్రాథమిక పరీక్షలో రాణించిన మొదటి 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి చేసి మొత్తం 120 మందిని రాష్ట్ర స్థాయికి పంపుతారు. అక్కడ సత్తా చాటిన 18 మందిని విజేతలుగా ప్రకటిస్తారు . మొదటి ముగ్గురికి నగదు ప్రోత్సాహకాలు ఇస్తారు.రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన వారిలో నుంచి 18 మందిని జాతీయస్థాయి ప్రతిభావంతులుగా గుర్తిస్తారు .వారికి 25000 15000 2000 చొప్పున దీంతోపాటు నెలకు 2000 చొప్పున ఏడాది పాటు ఉపకార వేతనం అందిస్తారు. ఈ పరీక్ష కోసం విద్యార్థులు వ్యక్తిగతంగా లేదా పాఠశాల నుంచి రిజర్వేషన్ . సైన్స్ ప్రయోగాలకు పాఠశాల స్థాయి నుంచి బీజం పడాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ పరీక్షల నిర్వహిస్తుంది . ఈ పరీక్షల విద్యార్థులు కనబరిచేందుకు ప్రణాళిక బద్ధంగా చదవాలి .ఈ అవకాశాన్ని సద్వినియోగం చూసుకోవాలి. పరీక్ష విధానం ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది . సీనియర్ జూనియర్ విభాగంలో 100 ప్రశ్నలు ఉంటాయి . ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్పు ఉంటుంది గణితం , సామాన్య శాస్త్రం , పాఠ్య పుస్తకాలనుంచి 50% విజ్ఞాన శాస్త్రం , లాజికల్ రీజనింగ్ కు 10% , శాస్త్రవేత్త బీర్బల్ సహాని జీవిత చరిత్రకు 20 శాతం ప్రశ్నలు ఉంటాయి[2]. ఆన్లైన్ నమోదు ఇలా 2023 -24 విద్యాసంవత్సరానికి సంబంధించి డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ. వివిఎం.ఓఆర్జి. ఇన్ వెబ్సైట్లో లేదా ప్లే స్టోర్లో వివియం యాప్ ను డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు . 200 రూపాయల రుసుము ఆన్లైన్లో చెల్లించి ఈ నెల 15వ తేదీలోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు . తెలుగు ,హిందీ, ఆంగ్లభాష విభాగాల్లో ఈ పరీక్ష ఉంటుంది . అక్టోబర్ ఒకటో తేదీన నమూనా నిర్వహిస్తారు. అదే నెల 29 లేదా 30న జిల్లా స్థాయి పరీక్ష జరగనుంది[3]

మూలాలు

[మార్చు]
  1. "Vidyarthi Vigyan Manthan 2023 brochure launched: Scientific temper talent hunt exam to be held at October end". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-08-05. Retrieved 2023-10-13.
  2. "VVM Registration 2023 for Vidyarthi Vigyan Manthan at vvm.org.in (Science Talent Search Exam)". TeachersBadi (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-09-11. Retrieved 2023-10-13.
  3. "Vidyarthi Vigyan Manthan (VVM)". NCSM (in ఇంగ్లీష్). Retrieved 2023-10-13.