Jump to content

విఠల్ సుందర్

వికీపీడియా నుండి
విఠల్ సుందర్ పరుశురామి
రాజా ప్రతాప్‌వంత్ బహదూర్
a 5 foot square, castle-like white tomb of stone blocks
విఠల్ సుందర్ పరుశురామి సమాధి
హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రి
పరిపాలన8 జూలై 1762 – 10 ఆగష్టు 1763
పూర్వాధికారిబసాలత్ జంగ్
ఉత్తరాధికారిమూసా ఖాన్ నవాబ్ రుక్నుద్దౌలా
మరణం10 ఆగష్టు 1763
రాక్షస్‌భువన్ (ప్రస్తుత మహారాష్ట్రలోని భీడ్ జిల్లా)
తండ్రిసుందర్ నారాయణ్ పరుశురామి

విఠల్ సుందర్ పరుశురామి (మ. 10 ఆగష్టు 1763), 18వ శతాబ్దపు దక్కన్ ప్రాంతానికి చెందిన దౌత్యవేత్త, నిజాం అలీఖాన్ పాలనాకాలంలో హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రి (దీవాను). 1762, జూలై 8న నిజాం అలీఖాన్ దక్కన్ సుబేదారుగా నియమించబడినప్పుడు, ఆయన వెంటనే విఠల్ సుందర్‌ను తన దీవానుగా నియమించి, రాజా ప్రతాప్‌వంత్ అనే బిరుదు ప్రదానం చేశాడు.[1] విఠల్ సుందర్‌ మహారాష్ట్రకు చెందిన దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[2][3][4][5] విఠల్ సుందర్, 1763, ఆగష్టు 10న జరిగిన రాక్షస్‌భువన్ యుద్ధంలో నిజాం సైన్యాలకు సేనానిగా ముందుండి నడిపించాడు. విఠల్ సుందర్ ఈ యుద్ధంలో మరణించాడు.[6]

విఠల్ సుందర్ తన ఉద్యోగ జీవితాన్ని మరాఠా ప్రభువుల కొలువులో పీష్వా నానాసాహేబ్ (బాలాజీ బాజీరావు) వద్ద ప్రారంభించాడు. ఒకరోజు మధ్యాహ్నవేళలో ఈయన కార్యాలయంలో విశ్రాంతి తీసుకుంటుండగా నానాసాహేబ్ సూచి, ఈ బుద్ధిపై పరుషమైన వ్యాఖ్యలు చేశాడు. దీనితో, మరాఠాల కొలువును వీడి, నైజాం కొలువులో చేరాడు. అక్కడ విలాసాలను అస్వాదించే నిజాం అలీ సేవలో పనిచేశాడు. 1750లలో సలాబత్ జంగ్ నిజాంగా అధికారంలో ఉన్నాడు. ఇబ్రహీం ఖాన్ గర్దీ, ఫ్రెంచి సైనికాధికారి బుస్సీ, సలాబత్ జంగ్‌ను సమర్ధించారు. అప్పటి నిజాం దీవానుగా రామదాస్ పంత్ అనే శ్రీకాకుళానికి చెందిన బ్రాహ్మణుడు పనిచేశాడు. ఈయనకు బుస్సీ, రాజా రఘునాథ్ దాస్ అనే బిరుదునిచ్చాడు. రామదాస్ పంత్, విఠల్ సుందర్‌ను తన సంరక్షణలో తీసుకున్నాడు. 1752లో జీతభత్యాల విషయంలో వివాదం చెలరేగి, నిజాం సైనికులు రామదాస్ పంత్‌ను హతమార్చిన తర్వాత, విఠల్ సుందర్ నిజాం కొలువులో ప్రాముఖ్యతలోకి వచ్చాడు.[7]

విఠల్ సుందర్, నిజాం అలీఖాన్‌ ను దక్కన్ సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని ప్రోత్సహించాడు. ఇది నిజాం అలీఖాన్ ఆశను ఉసిగొల్పింది. దానితో సలాబత్ జంగ్‌ను బంధించి, హతమార్చాడు.

మూలాలు

[మార్చు]
  1. K. Chandraiah (1998). Hyderabad, 400 Glorious Years. K. Chandraiah Memorial Trust. p. 73.
  2. Govind Sakharam Sardesai (rao bahadur) (1948). New History of the Marathas: The Expansion of the Maratha Power, 1707-1772. Phoenix Publications. p. 468.
  3. Tony Jaques (2007). Dictionary of Battles and Sieges: P-Z. Greenwood Publishing Group. p. 838.
  4. G. T. Kulkarni; M. R. Kantak (1980). Battle of Kharda: Challenges and Responses. Deccan College, Post-Graduate & Research Institute. p. 43.
  5. Journal of the University of Bombay, Volume 27. University of Bombay. 1958. p. 12.
  6. Ramesh Chandra Majumdar (1977). The History and Culture of the Indian People: The Maratha Supremacy. Bharatiya Vidya Bhavan. p. 829.
  7. Kulkarni, Uday S. "THE THREE AND A HALF WISE MEN OF THE PESHWA PERIOD". eSamskriti. Retrieved 31 August 2024.