Jump to content

విజయ మేరి చర్చి, హైదరాబాదు

వికీపీడియా నుండి
విజయ మేరి చర్చి

విజయ మేరి చర్చి హైదరాబాదులోని చింతల్‌బస్తీ ప్రాంతంలో ఉన్న క్రైస్తవ ప్రార్థనామందిరం. ఇది 1905లో స్థాపించబడింది. దీనిని ఆరోగ్యమాత చర్చి అని కూడా పిలుస్తారు.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

చరిత్ర

[మార్చు]

హైదరాబాదులోని చింతల్ బస్తీ, మహావీర్ హాస్పిటల్, మాసబ్ ట్యాంక్, ఏసి గార్డ్స్, ఖైరతాబాదు మొదలైన ప్రాంతాలకు సమీపంలో ఒక చర్చి ఉంటే బాగుంటదని భావించిన బ్రిటీషు వారు చింతల్‌బస్తీ ప్రాంతంలో ఈ చర్చిని నిర్మించారు.

నిర్మాణం

[మార్చు]

1903లో ఈ చర్చి నిర్మాణం ప్రారంభమై, అదే ఏడాది చివర్లో నిర్మాణం పూర్తయింది. దీని నిర్మాణానికి 3,500 రూపాయలు ఖర్చు అయింది. 1904, జనవరి 10న డోగ్మా యొక్క జ్ఞాపకార్థంగా బిషప్ విగానో చేత ఈ చర్చి ప్రారంభించబడింది.[2] అయితే, రోజురోజుకి చర్చికి వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో నూతన ప్రార్థన మందిర నిర్మాణంకోసం 1954, డిసెంబర్ 27న ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ శంకుస్థాపన చేశాడు. 1959, సెప్టెంబర్ 15న ఈ నూతన భవనం ప్రారంభించబడింది.[3]

ఎనభై అడుగుల ఎత్తున్న ఈ చర్చికి 47 అడుగుల ఎత్తైన అష్టభుజ గోపురం ఉంది.

కార్యక్రమాలు

[మార్చు]

ఈ చర్చిలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న మేరిమాత జన్మదిన వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకలకు దాదాపు లక్షమందికి పైగా వస్తారు.

మూలాలు

[మార్చు]
  1. విజయ మేరి చర్చి,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 45
  2. Telangana Today, Hyderabad (2 September 2018). "Hyderabad's 114-year-old shrine set for annual fete". Sunny Baski. Archived from the original on 3 April 2019. Retrieved 3 April 2019.
  3. Deccan Chronicle (7 September 2017). "Khairatabad gears up for Mother Mary feast". Archived from the original on 3 April 2019. Retrieved 3 April 2019.