విజయవాణి (వారపత్రిక)
స్వరూపం
![]() | |
సంపాదకులు | మల్లెల శ్రీరామమూర్తి |
---|---|
తరచుదనం | వారపత్రిక |
మొదటి సంచిక | జనవరి 14, 1948 |
దేశం | భారతదేశం |
కేంద్రస్థానం | విజయవాడ |
భాష | తెలుగు |
విజయవాణి మల్లెల శ్రీరామమూర్తి సంపాదకత్వంలో 1948 జనవరి సంక్రాంతినాడు ప్రారంభమైన తెలుగు వారపత్రిక. పన్నెండు పేజీల ఈ పత్రిక ధర రెండణాలు. విజయవాడ నుండి వెలువడింది. ఈ పత్రిక ప్రతి బుధవారంనాడు విడుదల అయ్యేది. యూనివర్సల్ ప్రింటర్స్‌లో ఈ పత్రిక ముద్రితమైంది.[1]
ఈ పత్రికలో పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, మారేపల్లి రామచంద్ర శాస్త్రి, చెళ్ళపిళ్ళ దుర్గేశ్వరశాస్త్రి, జమ్మలమడక మాధవరామశర్మ, చిలుకూరి నారాయణరావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, చిట్టా రామకృష్ణారావు, అల్లంరాజు లక్ష్మీపతి మొదలైనవారి రచనలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ యామిజాల జగదీశ్. "రెండణాల పత్రిక". మొలక. Retrieved 22 February 2025.