Jump to content

విజయలక్ష్మి (కన్నడ నటి)

వికీపీడియా నుండి
విజయలక్ష్మి
జననం
మద్రాస్ (ప్రస్తుతం చెన్నై), తమిళనాడు, భారతదేశం[1]
ఇతర పేర్లువిజ్జి
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1997–2018

విజయలక్ష్మి భారతీయ నటి. ఆమె ప్రధానంగా కన్నడ, తమిళ చిత్రాలలో నటించింది. 1997లో, ఆమె నాగమండల చిత్రంతో కన్నడ చిత్రరంగంలో అడుగుపెట్టింది.[2] ఇందులో రాణిగా నటించిన ఆమెకు కన్నడలో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వరించింది.[3]

తెలుగులోనూ హనుమాన్ జంక్షన్ (2001)లో ఆమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా మోహన్‌లాల్‌తో కలిసి మలయాళ చిత్రం దేవదూతన్‌లో కూడా నటించింది.

బాల్యం

[మార్చు]

విజయలక్ష్మి మద్రాస్‌లో జన్మించింది. కర్ణాటకలోని బెంగళూరులో చదువుకుంది. ఆమె మాతృభాష తమిళం. ఆమెకు ఉష అనే సోదరి ఉంది. ఆమె తల్లి శ్రీలంక తమిళురాలు.[4]

కెరీర్

[మార్చు]
1997 కన్నడ చిత్రం నాగమండలలో విజయలక్ష్మి (కుడి), ప్రకాష్ రాజ్ (ఎడమ).

విజయలక్ష్మి తన కెరీర్‌లో దాదాపు 40 సినిమాల్లో నటించింది. అందులో 25 కన్నడ చిత్రాలు ఉన్నాయి. ఆమె ప్రకాష్ రాజ్ సరసన జానపద కథ ఆధారంగా దర్శకుడు టి. ఎస్. నాగాభరణ దర్శకత్వం వహించిన నాగమండల చిత్రంలో తొలిసారిగా నటించింది. ఆమె తన అందం, అభినయంతో గుర్తింపు పొందింది.

తమిళంలో పూంతోట్టం సినిమాతో ఆమె రంగప్రవేశం చేసింది. తమిళంలో విజయ్, సూర్యతో కలిసి ఫ్రెండ్స్ చిత్రంలో నటించింది.[5] ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత, ఆమె కలకలప్పు, రామచంద్ర, మిలిటరీ, సూరితో సహా అనేక చిత్రాలలో నటించింది.[6] అంతేకాకుండా తమిళ కామెడీ చిత్రం బాస్ ఎంగిర భాస్కరన్‌తో ప్రేక్షకులలో ఆమె ప్రజాదరణ పొందింది. ఇది 2010లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది.[7] ఈ చిత్రం తెలుగులో నేనే అంబానీగా విడుదలైంది.[8]

తెలుగులో హనుమాన్ జంక్షన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మోహన్‌లాల్‌తో ఒక మలయాళ చిత్రం దేవదూతన్‌లో కూడా నటించింది.[9]

టెలివిజన్

[మార్చు]

ఆమె కొన్ని తమిళ టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించింది. రాడాన్ మీడియా వర్క్స్ నిర్మించిన బంగారు బేటే అనే గేమ్ షోకి ఆమె యాంకర్ కూడా.

మూలాలు

[మార్చు]
  1. V Lakshmi (8 November 2010). "I'm a pure Tamilian: Vijayalakshmi". The Times of India. Archived from the original on 14 June 2012. Retrieved 25 March 2014.
  2. "పెళ్లి పేరుతో శారీరకంగా!.. డైరెక్టర్‌పై స్టార్‌ హీరోయిన్ ఫిర్యాదు! | Tamil Actress Vijayalakshmi Once Again Complaint On Seeman - Sakshi". web.archive.org. 2023-09-11. Archived from the original on 2023-09-11. Retrieved 2023-09-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "45th Filmfare South Best Actresses : Santosh : Free Download & Stream…". 5 February 2017. Archived from the original on 5 February 2017.
  4. "'Friends' Actress Vijayalakshmi Hospitalized; Seeks Help From Film Industry". 26 February 2019.
  5. "Kalki interview". Kalki (in తమిళము). 21 January 2001. Retrieved 23 April 2022.
  6. Manimegalai, A (12 July 2019). "வீடுகூட இல்லாமல் கஷ்டப்படுகிறேன்! கடனை அடைக்க வேண்டும்! தமிழ் நடிகர்களிடம் உதவி கேட்கும் நடிகை விஜயலட்சுமி!". Asianet News (in తమిళము). Retrieved 22 July 2023.
  7. V Lakshmi (30 October 2010). "Vijayalakshmi's back in action". The Times of India. Retrieved 25 March 2014.
  8. "Nene Ambani Director". FilmiBeat. Retrieved 2022-04-22.
  9. "ആരും സഹായത്തിനില്ല, നരക ജീവിതം: സഹായം അഭ്യർഥിച്ച് 'ദേവദൂതൻ' നടി". Malayala Manorama (in మలయాళం). 9 August 2019. Retrieved 23 July 2023.