Jump to content

విక్రమాదిత్య సింగ్

వికీపీడియా నుండి
విక్రమాదిత్య సింగ్
విక్రమాదిత్య సింగ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 జనవరి 2023
గవర్నరు రాజేంద్ర అర్లేకర్
శివ ప్రతాప్ శుక్లా

శాసన సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
18 డిసెంబర్ 2017
ముందు వీరభద్ర సింగ్
నియోజకవర్గం సిమ్లా రూరల్

వ్యక్తిగత వివరాలు

జననం (1989-10-17) 1989 అక్టోబరు 17 (వయసు 35)[2]
సిమ్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు
నివాసం *పదమ్ ప్యాలెస్, రాంపూర్ బుషహర్ , హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
పూర్వ విద్యార్థి సెయింట్ స్టీఫెన్స్ కళాశాల

విక్రమాదిత్య సింగ్ (జననం 17 అక్టోబర్ 1989) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు సిమ్లా రూరల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

విక్రమాదిత్య సింగ్ 2021 జూలై 10న, జూలై 8న తన తండ్రి మరణించిన తర్వాత, రాంపూర్‌లోని పదమ్ ప్యాలెస్‌లో జరిగిన ప్రైవేట్ వేడుక పూర్వపు రాచరిక రాష్ట్రమైన బుషహర్‌కు నటి రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

విక్రమాదిత్య సింగ్ 1989 అక్టోబరు 17న సిమ్లా జిల్లాలో బుషహర్ రాచరిక రాజకుటుంబంలో రాజా వీరభద్ర సింగ్, ప్రతిభా సింగ్ దంపతులకు జన్మించాడు . ఆయన సోదరి మాజీ న్యాయమూర్తి అభిలాష కుమారి. విక్రమాదిత్య సింగ్ తన పాఠశాల విద్యను సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్ పూర్తి చేసి ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, హన్స్‌రాజ్ కాలేజ్ నుండి చరిత్రలో తన గ్రాడ్యుయేషన్ బిఎ, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎంఏ (ఆనర్స్.) పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

విక్రమాదిత్య సింగ్ తన తండ్రి అడుగుజాడల్లో 2013లో రాజకీయాల్లోకి వచ్చి 2013 నుండి 2017వరకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2017లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సిమ్లా రూరల్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. విక్రమాదిత్య సింగ్ 2022లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 8 జనవరి 2023 నుండి సుఖ్విందర్ సింగ్ సుఖు మంత్రివర్గంలో పబ్లిక్ వర్క్స్, యువజన సేవలు & క్రీడల శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.

విక్రమాదిత్య సింగ్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మండి లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కంగనా రనౌత్ చేతిలో ఓడిపోయాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Council of Ministers - Government of Himachal Pradesh, India". himachal.nic.in. Retrieved 2023-01-13.
  2. "Details of MLA Vikramaditya Singh". hpvidhansabha.nic.in. Archived from the original on 10 July 2021.
  3. "Mandi constituency result: BJP's Kangana Ranaut wins by margin of 74,755 votes". 25 June 2024. Archived from the original on 25 June 2024. Retrieved 25 June 2024.