Jump to content

వికీపీడియా చర్చ:2021 లక్ష్యాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

2021 వికీ ప్రణాళిక పేజీకి స్వాగతం

[మార్చు]

2021 లో తెవికీ కార్యక్రమాలు పేజీకి గౌరవ వికీపీడియన్లు అందరి తరుపున స్వాగతం.చదువరి గారు నూతన ఆలోచనా ధోరణితో ఏ కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుందో, మంచి మంచి పేర్లతో ఈ పేజీకి రూపకల్పన చేసి సృష్టించినందుకు ధన్యవాదాలు. ఒకసారి గుర్తు వచ్చినవి మరలా గుర్తుకు రాని సందర్బాలకు, ఈ పేజీ ఒకరకంగా మంచి సాధనమని నాఅభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 09:08, 29 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మొలకల విస్తరణ కొనసాగింపు

[మార్చు]

గత సంవత్సరం ప్రాజెక్టులో చాలా వరకు మొలకల్ని విస్తరించగలిగాము. అదే పనిని ఈ సంవత్సరం కూడా కొనసాగించి మొలకలన్నవే లేకుండా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే ట్రెండింగ్ లో ఉన్న వ్యాసాలను అంటే ఎక్కువ వీక్షణలున్న వ్యాసాలని వికీశైలికి అనుగుణంగా తీర్చిదిద్దడం, విస్తరించడం లాంటి పనులు చేస్తే మనం పాఠకులకు మరింత చేరువ కావచ్చు. - రవిచంద్ర (చర్చ) 09:16, 29 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]