Jump to content

వికీపీడియా చర్చ:శైలి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ ప్రశ్న వ్యక్తుల జీవిత చరిత్ర, లేదా లేదా ఒక ప్రదేశాన్ని వర్ణించేటప్పుడు సంబందించినది.

  1. ఉదాహరణ వ్యాసం పేరు : ఫలానా రావు
వ్యాసం వ్రాసేటప్పుడు, ఆయన అని వ్రాయాలా లేక, ఈయన అని వ్రాయాలా
  1. ఉదాహరణ వ్యాసం పేరు : ఫలానా ప్రదేశం
వ్యాసం వ్రాసేటప్పుడు, ఇది అని వ్రాయాలా లేక, అది అని వ్రాయాలా ఈ సందిగ్ధం చాలా ఎక్కువగా ఉన్నది.

--మాటలబాబు 03:58, 12 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

చాలామంచి ప్రశ్న లేవనెత్తారు. నేను ఎడాపెడా ఒక పద్ధతంటూ లేకుండా ఇష్టమొచ్చినట్టు రాశాను. నాకూ తెలియదు. చదువరిని గానీ, కాసుబాబు గారిని కానీ అడగాలి. మిగిలిన విజ్ఞాన సర్వస్వాలు పరిశీలించి చూస్తా --వైజాసత్య 04:03, 12 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు తెలుసని కాదు. కాని చర్చకు ఉపయోగపడే కొన్ని విషయాలు ఇక్కడ వ్రాస్తున్నాను.

  • ఇంగ్లీషు వారికి ఈ సమస్య లేదనుకొంటా. వారు చక్కగా He, She అని వ్రాసేయవచ్చు.
  • కొమర్రాజువారి విజ్ఞాన సర్వస్వంలో 'ఇతడు', 'ఈ జిల్లా', 'ఇది', 'ఈమె' అనే వ్రాశారు. వారు నిస్సందేహంగా ఈ విషయమై ఆలోచించి నిర్ణయం తీసికొని ఉంటారు.
  • "అది", "ఇది" గురించి - చదువరి (వికీ వీరుడు చదువరి అని కాదు, సామన్యార్ధకంలోనే) దృష్టి అప్పటికే ఒక వ్యాసం, మనిషి, లేదా స్థలం పైన కేంద్రీకృతమైంది. కనుక ఆ వ్యాసంగానికి సంబంధించిన విషయాలను 'ఇది, ఇతడు, ఈవూరు, ఈయన' అని ప్రస్తావించడమే ఉచితం. 'వెంకన్న' వ్యాసంలో 'మల్లన్న' గురించి ప్రస్తావన రావచ్చును. వెంకన్నను 'ఇతడు' అనీ, మల్లన్నను 'అతడు' అనీ ప్రస్తావించడం సబబు అనుకొంటాను.
  • "ఇతడు", "ఈయన" గురించి - కొమర్రాజువారి గ్రంధంలో "ఇతడు" అనే అందరి గురించీ వ్రాశారని పైన చెప్పాను. అది సరే. మరి కాస్త విస్తరిస్తే - స్త్రీల గురించి మాత్రం మనకు "ఈమె", "ఆమె" అనే వాడుతాము. 'ఈయన' కు స్త్రీలింగంలో 'ఈమె గారు' అనవచ్చు గాని ఆ వాడుక అంత విస్తారంగా లేదు. వికీ శైలికీ అనుగుణం కాదు. కనుక "ఈమె", "ఇతడు" అనేవే వికీ శైలికి ప్రామాణికంగా స్వీకరించవచ్చునని నా అభిప్రాయం.
  • దేవత వచ్చింది. దేవుడు వచ్చాడు - అని వ్రాయడానికి తెలుగులో సర్వత్రా అలవాటు పడ్డారు. ఇక సుబ్బమ్మకూ, పుల్లయ్యకూ అదనపు గౌరవాన్ని అంటగట్టాల్సిన అవుసరం లేదు.
  • ఇక్కడ నేను వ్రాస్తున్నది నేను స్వయంగా అనుసరించిన శైలికే భిన్నంగా ఉన్నది. వీలు దొరికినప్పుడు పాతవి సరి దిద్దుతాను.

--కాసుబాబు 10:06, 14 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబు గారన్నట్టు కొమర్రాజు గారి వి.స లో ఇతడు, ఈమె, ఇది అనే (సమీపార్థంలో) వాడారు. అయితే వికీపీడియా:ఏకవచన ప్రయోగం పేజీలో ఉదహరించిన రెండో వి.స లో ఆమె అంటూ దూరార్థంలో వాడారు. ఇదొకటి ఆలోచించాలి. ఇకపోతే, నా అభిప్రాయాలు:
  1. దూరార్థం, సమీపార్థం - ఈ రెంటిలో నా మొగ్గు దూరార్థానికే (ఆమె, ఆయన, అది -వీటికే!). అయితే, ఆ గ్రామం అనే కంటే ఈ గ్రామం అనే మాటే బాగుంది. (రెండు నాలుకల ధోరణి తప్పలేదు, మన్నించాలి). కేవలం ఆయా పదాలను వాడిన వాక్యాలను చదివి, ఆ అనుభూతిని బట్టి మాత్రమే చెబుతున్న మాటలివి. అంతేగాని, ఏదో ఓ పద్ధతిని ఎంచుకుని సూత్రీకరించినవి కావు.
  2. అతడు, ఆయన - ఈ రెంటిలో అతడు మరింత విజ్ఞాన సార్వస్వీయంగా అనిపిస్తోంది. నేను ఇప్పటి వరకు ఆయన సరైనదని అనుకుంటూ, అదే వాడుతూ వచ్చాను.
ఈ చర్చలో సభ్యులందరూ చురుగ్గా పాల్గొనాలని వినతి. ఈ చర్చను కొనసాగించి, ఒక ప్రామాణికతను సాధిద్దాం. వికీకి దూరంగా ఉన్న పెద్దలను కూడా సంప్రదిస్తే మరింత ఉపయోగమేమో ఆలోచించండి. _చదువరి (చర్చరచనలు) 13:05, 14 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఇంతకు ఏమి నిర్ణయించారు? ఏదయినా ఉదాహరణ వ్యాసం ఒకటి చూస్తే చదివి అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది!! --నాగడు 22:24, 19 ఆగష్టు 2007 (UTC)
ఇంకా ఏమీ నిర్ణయించలేదు. అర్జంటు విషయాలకు ముఖ్యమైన విషయాలు బలికావటమంటే ఇదే. నేనీ విషయం గురించి మిగిలన వాళ్ళ అభిప్రాయాలు సేకరించే పని ఇంకా చేపట్టలేదు. ఉదాహారణకి ఏదైనా వ్యక్తి గురించిన వ్యాసం తీసుకోవచ్చు (టి.జి.కమలాదేవి#రంగస్థలం, టంగుటూరి ప్రకాశం పంతులు) --వైజాసత్య 22:51, 19 ఆగష్టు 2007 (UTC)

మూసలు, వ్యాసాల పేర్లు గురించి

[మార్చు]
 (ఈ చర్చ కాసుబాబు చర్చా పేజీనుండి ఇక్కడికి మార్చబడింది)
కాసుబాబు గారు వ్యాసాలకు మూస లకు ఆంగ్ల పేర్లు అంగీకరించడం లేదు. వాటిని తొలగించేస్తున్నారు.--మాటలబాబు 12:42, 2 ఆగష్టు 2007 (UTC)
మూసలకు ఆంగ్ల పేర్లు ఉన్నా, తెలుగు పేర్లు ఉన్నా ఒకటే. ఎందుకంటే, ఈ మూసలను ఇంకో వ్యాసంలో చేర్చిన తరువాత మూస పేరు కనపడదు, మూసలో ఉన్న సమాచారం మాత్రమే కనపడుతుంది. వ్యాసాలకు (దారిమార్పు పేజీలకు), ఆంగ్ల పేర్లపై ఇంకొంచెం చర్చ జరగాలి. అలాగే వ్యాసం మొత్తం ఆంగ్లంలో కనిపిస్తూ ఉంటే వాటిని ఎవరికీ అనువదించాలని తొందరగా అనిపించదు, పైగా తెలుగులో వారికి తెలిసిన సమాచారం చేర్చడానికి కూడా వెనుకాడవచ్చు. అందుకనే ఆంగ్లవికీ నుండి తెస్తున్న వ్యాసాలను తొలగించేస్తున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 13:27, 2 ఆగష్టు 2007 (UTC)
మూసలు, వ్యాసాల పేర్లు గురించి:
  • మూసలకు ఇంగ్లీషు పేర్లు ఉంటే పర్వాలేదనేది సర్వజనామోదం పొందిన విషయం అనుకొంటాను. ఇంగ్లీషులోంచి తెచ్చుకొన్న వ్యాసాలు నేరుగా పనిచేయడానికి ఇది చాలా అవుసరం కూడాను. విధానంలో మార్పు ఉంటే తెలియజేయ గలరు.
  • సాధారణంగా వ్యాసాలకు ఇంగ్లీషు పేర్లు ఉండకూడదన్న విషయాన్ని నేను అంగీకరిస్తాను. అయితే దారి మార్పుడు పేజీలకు మినహాయింపు ఇవ్వడం ఉచితం అనుకొంటాను. ఉదాహరణకు ఇంగ్లీషులోంచి తెచ్చుకొన్న ఒక మూస సమాచార పెట్టె లో ఒక ఇంగ్లీషు వ్యాసం పేరు నిక్షిప్తమై ఉంటుంది. ఆ వ్యాసం తెలుగులో ఉండదు కాని అది దారి మళ్ళింపు ద్వారా ఒక తెలుగు వ్యాసానికి వెళ్ళవచ్చును. ఇలా కాకపోతే మనం మూసనూ మార్చాలి. ప్రతి సమాచార పెట్టెనూ తిరగ రాయాలి. ఇది అదనపు శ్రమే కాకుండా అనుభవం లేని సభ్యులకూ, ప్రోగ్రామర్లు కాని నాలాంటి వాళ్ళకూ నిరుత్సాహం కలిగిస్తుంది.
  • వ్యాసం అధికంగా ఆంగ్లంలో కనిపించకూడదనేది నేను పూర్తిగా అంగీకరిస్తాను. సాధారణంగా నేను ఆంగ్లంలోంచి తెచ్చిన వ్యాసాలను పూర్తిగా అనువదిస్తాను (అంతా తలో చేయీ వేస్తుంటారు అనుకోండి). ఒకవేళ మీరు దేశాల జాబితాలు, దేశాలకు సంబంధించిన వ్యాసాలు గురించి ప్రస్తావిస్తున్నట్లయితే - అది ఇంకా అసంపూర్ణమైన పని. ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం నేను వీటిమీద దృష్టి పెట్టడానికి ముఖ్యమైన కారణం - విజ్ఞాన సర్వస్వంలో ఇవి తప్పకుండా ఉండాల్సిన విషయాలు అని.

--కాసుబాబు 09:06, 3 ఆగష్టు 2007 (UTC)

మాటలబాబు ఎందుచేతనో ఆంగ్ల పేర్లతో ఉన్న మూసలను తొలగిస్తున్నామని పొరపాటుపడ్డారు. అలాంటిదేమీలేదు. మూసల పేర్లన్నీ తెలుగులోకి మార్చటం అనవసరం. కాసుబాబు గారన్నట్టు తలనొప్పి వ్యవహారం కూడానూ. ఇక ప్రదీపు తొలగిస్తానంటున్నది ఆంగ్లమునుండి యధాతధంగా ఇక్కడ అతికించి కొంచెం కూడా అనువాదం చెయ్యని వ్యాసాలననుకుంటా (మూసల గురించి కాదు). ప్రతి విషయానికి ఆటవిడుపుండాలన్నట్టు కాసుబాబు గారు చెప్పినటువంటి కొన్ని సందర్భాలలో అవసరమైతే ఆంగ్ల పేరుతో దారిమార్పులు చేయవచ్చు. సాధారణంగా వ్యాసాలకు ఆంగ్ల దారిమార్పులు ఉండకూడదని నా అభిప్రాయం --వైజాసత్య 09:59, 3 ఆగష్టు 2007 (UTC)
మూసలు కూడా తెలుగు లొ ఉంచడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం, కాని ప్రారంభం లొ ఉన్న మూసలు అంగ్లం లొ ఉన్న ఫరవా లేదు. వ్యాసాలకు ఆంగ్ల పేర్లు ఇవ్వడానికి నా అంగీకారం ఎంత మాత్రం లేదు. ఆట విడుపుగా కూడా.. కానీ మూసలకు ఆంగ్ల పేర్లు ఇవ్వవచ్చు, తరలింపు ఏర్పాట్లు చెయ్యవచ్చు. ప్రదీప్ గారు ఎంతో కష్టపడి బాటు చేసి నేం స్పేసు లు మార్చారు. వర్గం అనే నేం స్పేసు--మాటలబాబు 10:33, 3 ఆగష్టు 2007 (UTC)
మూస లు తెలుగులొ ఉంచాలి అని అంటున్నందుకు కారణం-పెద్దల ఔదార్యం వల్ల తెలుగు ఎడిట్ బాక్స్ లకి ఇన్స్‌సిక్రిప్ట్ సంపాదించుకొన్నాం. మూసల పేర్లు తెలుగులొ ఉంటే టైపు చేయడానికి వీలుగా ఉంటుంది, ఎందుకంటే ఎడిట్ బాక్స్ లొ డిఫాల్ట్ గా తెలుగు వస్తోంది కాదా, ఆంగ్ల మూసల పేర్లు అయితే అస్తమాను టిక్కు పెట్టుకోవడానికి తీసుకోవడానికి సమయం సరిపోతుంది, కాలం వ్యర్థం అయిపోతుంది--మాటలబాబు 21:21, 4 ఆగష్టు 2007 (UTC).
మీ వాదన నాకు సబబుగానే తోస్తోంది. అచ్చుల పేజీ ఇప్పుడు నేరుగా తెలుగు పేరునే ఉపయోగిస్తోంది. దయచేసి మూస:CSS IPA vowel chart దారిమార్పు పేజీని తొలగించండి. సురేశ్ కొలిచాల 21:48, 4 ఆగష్టు 2007 (UTC)
  • ఇది కొంచెం ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఒక్క కోణంలో నుంచే ఆలోచించి నిర్ణయం తీసుకొంటే అది చాలా పొరపాటు అవుతుంది. కొత్త వికీయులకి మూస అంటే బొత్తిగా తెలియదు. అలాంటి వారు ఆంగ్ల వ్యాసాలను Copy / Paste చెయ్యడం చాలా సహజం. అంతెందుకు..నేనే చాలా వరకు ఆంగ్ల సమాచార_పెట్టె లను తెస్తూంటాను. కానీ Copy చేసిన వెంటనే InfoBox లన్నీ ఎర్రగా కనిపించడం భలే చికాకుగా ఉంటుంది. చాలాసార్లు ZWJ / ZWNJల వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డానో / ఎన్ని గంటలు వృధా చేసుకున్నానో నాకే తెలుసు. సరైన తెలుగు మూస కోసం వెతకడం పెద్ద తలకాయ నొప్పి. మనం మొదలు పెట్టే మూసలు తప్పకుండా తెలుగు పేర్లు పెడదాం. InfoBox లాంటి popular మూసకు, ఆంగ్లం నుంచి తెచ్చే ప్రముఖ మూసలక్ దారి మార్పు పేజీలను కల్పిద్దాం. ఇక్కడ మాటలబాబు చెప్పినది కూడా కొంచెం చెవికి ఎక్కించుకోవాలి. తెలుగు నుండి ఆంగ్లానికి మారే ప్రక్రియను తేలిక చెయ్యాలి. Esc మీట నొక్కడం కష్టంగా ఉంటే, ఏ Shitf+Space / Ctrl +Space / Alt+Space తేలికేమో చూద్దాం. (ఇంతకూ సమస్యను సరిగ్గా అర్థం చేసుకున్నానా?) --నవీన్ 05:47, 5 ఆగష్టు 2007 (UTC)
నవీన్, నువ్వు రాసిన చాలా చోట్ల పదాంతాల్లో కూడా ZWNJ ఉండటం చూశాను. (అంటే ఫైర్‌ఫాక్స్ అని రాస్తే ఫైర్ పక్కన ఎలాగూ ZWNJ తప్పదు, కానీ ఫాక్స్ తర్వాత కూడా ZWNJ ఉండటం) ఇది బరాహ మాయనా? నవీన్ మాయనా?? ;-). ఇక లిప్యాంతరీకరణ స్విచ్చింగ్ విషయంలో ఇంటర్నెట్టు ఎక్స్‌ప్లోరర్లో ఎస్కేప్ వాడటం నాక్కూడా పెద్ద చికాకుగా అనిపిస్తుంది. నువ్వన్నట్టు వేరే సీక్వెన్స్ పెడితే బాగుంటుంది. ఏవైనా సులువుగా గబగబా నొక్కడానికి వీలయ్యే సీక్వెన్సులు?? --వైజాసత్య 07:40, 5 ఆగష్టు 2007 (UTC)

చర్చలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు. చర్చను కొనసాగించ వచ్చును కూడా. (Discussion Not closed). ఒకరోజు అగి, దీనిని "శైలి చర్చ"కు మారుస్తాను. ఇది నాకు మాత్రమే సంబంధించినది కాదు గనుక. ఇప్పటికి జరిగినంతలో ఇలా సమీక్షిస్తున్నాను.

మూసల పేర్లు ఆంగ్లంలో గాని, తెలుగులో గాని ఉండ వచ్చును.(అసలు సంగతి - మూసలో వ్రాసేది "కోడ్" చాలా వరకు ఆంగ్లంలోనే ఉంటుంది. ఇక పేరులో ఏమున్నది?). అంతే గాకుండా ఇప్పటికి ఇంగ్లీషు పేర్లలో ఉన్న మూసలు వందల సంఖ్యలో ఉంటాయి. వాటిని మార్చడానికి అయ్యే శ్రమను కూడా గమనించ వలసినది. మనం చేసుకొనే మూసలను తెలుగులోనే చేసుకుందాము. తరచు వాడే మూసలు కూడా తెలుగులోనే ఉండుగాక.
వ్యాసాల పేర్లు ఆంగ్లంలో దాదాపు నిషిద్ధం. 'దాదాపు' అని ఎందుకంటున్నానంటే కొన్ని ఇంగ్లీషు సినిమా, పుస్తకాల పేర్ల వ్యాసాలకు ఆంగ్ల శీర్షికలు (దారి మార్పుకు మాత్రమే) అనుమతించ వచ్చును. Harry Potter అనే వ్యాసం హ్యారీ పాటర్కు దారి మళ్ళుతుందన్నమాట.
ఈ విధానం ప్రకారం దేశాల జాబితాల జాబితాలో ఆంగ్లం పేరుతో ఉన్న వ్యాసాలను తొలగిస్తాను.

--కాసుబాబు 07:28, 5 ఆగష్టు 2007 (UTC)


మూసలన్నింటికీ తెలుగు పేర్లు కల్పించడం చాలా కష్టం. మాటలబాబు చెప్పిన దాన్ని బట్టి నేనర్ధం చేసుకున్నదేంటంటే దిద్దుబాటు మోడ్ లో మూసలలో ఆంగ్లం ఉండటం వల్ల కష్టమవుతుంది అంటున్నారు. అక్కడ కూడా అసలు తెలుగే లేకుండా చెయ్యాలంటే వేరియబుల్స్ తో సహా అన్నీ తెలుగులోకి మార్చాలి. చాలా సంక్లిష్టమైన మూసలు ఎలా పనిచేస్తాయో అర్ధం చేసుకోవటమే కష్టం. అవి అర్ధం చేసుకొని తెలుగించే బదులు అసలే మానవ వనరులు కొంచెం తక్కువున్న తెవికీలో వాటిని కాస్త జాగ్రత్తగా వాడుకోవటం మంచిది. చిన్న చిన్న మూసలు తెలుగించడం తేలికే. చాలా మటుకు సులువైన మూసలకు, పెద్దగా డిపెండెన్సీలు (వీటిపై ఆధారపడే మూసలు) లేని మూసలకు తెలుగు పేర్లు కూడా కొద్దిగా శ్రమతో చేయవచ్చు. కానీ అప్పటికే ఆ ఆంగ్ల పేరుతో ఆ మూస ఉన్న వ్యాసాల ప్రయోజనార్ధం తెలుగు పేరు పెట్టినా ఆంగ్ల పేర్లు ఉంచాల్సి వస్తుంది. వ్యాసాలన్నింటిలో ఉన్న ఆంగ్ల మూసల పేర్లు తెలుగుకు మార్చినా ఈ పద్ధతి పనిచెయ్యదు ఎందుకంటే నేనొక సందర్భం వివరిస్తాను చూడండి (నేను కొత్తలో ఆంగ్లము నుండి మూస తెచ్చి తెలుగించి దేశ సమాచారపెట్టె అని నామకరణం చేశాను. కానీ ఆ తర్వాత ఇంకో సభ్యుడు ఒక దేశం పేజీ రాస్తూ ఆంగ్లం నుంచి టెక్స్టును యధాతధంగా తెచ్చి అతికించాడు..ఆంగ్ల పేరుతో ఎర్రలింకుగా ఉన్న మూస కనిపించకపోయే సరికి తిరిగి ఆంగ్లమునుండి ఆ మూసను ఆంగ్ల పేరుతో అతికించాడు.) --వైజాసత్య 08:03, 5 ఆగష్టు 2007 (UTC)
మనకెలాగూ తెలుగులో ఉంటేనే నచ్చుతుంది. అంచేత పేర్ల వరకు తెలుగులోనే ఉంటే బాగుంటుందేమో!? ఫలానా మూస ఉందని, దాని ఉపయోగం ఫలానా అనీ తెలియక పోతే, అది ఏ భాషలో ఉన్నా ఒకటే! అంచేత -
  • మనం మూసలను చక్కగా వర్గీకరించాలి.
  • అన్ని మూసల జాబితాను, వాటి ఉపయోగాలతో సహా తయారు చెయ్యాలి.
  • మన మూసలకు సరి సమానమైన ఇంగ్లీషు మూసల పేర్లు కూడా ఆ జాబితాలో చేర్చాలి.
మూసలకు ఇంగ్లీషు పేర్లున్నా, తెలుగు పేర్లున్నా పై పనులు మాత్రం అవసరం అని నా ఉద్దేశ్యం. __చదువరి (చర్చరచనలు) 09:01, 5 ఆగష్టు 2007 (UTC)
ఈ దిశగా ఒక ప్రయత్నము ప్రారంభించా. వికీపీడియా:మూసలు తలా ఒక చెయ్యి వెయ్యండి --వైజాసత్య 10:47, 5 ఆగష్టు 2007 (UTC)

ఆంగ్ల పొడి అక్షరాలు

[మార్చు]

ప్రస్తుతం ఉన్న శైలి ప్రకారం పొడి అక్షరాల మధ్య ఖాళి ఉండకూడదని ఉంది. ఎందుకని? ఇంగ్లీషులో వ్రాసేటపుడు ఖాళి వదిలే వ్రాస్తాము కదా. ఉదాహరణ en:N. T. Rama Rao సాయీ(చర్చ) 11:03, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగులో సాధారణంగా రెండు రకాలుగా పొడి అక్షరాలను రాస్తూంటారు. మొదటిది ఆంగ్ల పొడక్షరాలనే తెలుగులో రాయటం (ఉదా: ఎన్.టీ.ఆర్), రెండవది పొడక్షరాలకు తెలుగు పదాలనే వాడటం (ఉదా: రావి శాస్త్రి). ఇలా రెండవ రకంగా తెలుగులో పొడి అక్షరాలను రాస్తున్నప్పుడు ఖాళీలను వదలటం నేను ఎక్కడా చూడలేదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:15, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు అర్థం కాలేదు ప్రదీపు గారు. సాయీ(చర్చ) 11:18, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
రావిశాస్త్రి = రాచకొండ విశ్వనాధ శాస్త్రి. ఇంతకీ మీకే భాగం అర్థంకాలేదు, నేను చెప్పిందేదీ అర్థంకాకపోతే ఇంకొరు వచ్చిచెప్పేదాకా వేచి చూడండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:37, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పుడర్థమైంది. ఇంతకీ మీరేమంటారు? ఖాళి ఉండాలా ఉండకూడదా? సాయీ(చర్చ) 11:40, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చ ముందుకెళ్ళట్లేదు సాయీ(చర్చ) 16:49, 24 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఖాళీ ఉన్నా లేకున్నా పెద్ద కొంపమునిగేదేం లేదు. తెలుగు భాషకు ఈ విరామసంకేతాలు కొత్త..వీటిని ఎలా వ్రాయాలని ఒక ప్రామాణిక శైలి మాన్యువల్ తెలుగులో ఇప్పటికీ ఉన్నట్టు లేదు. కాబట్టి ఎలా వ్రాసినా ఒకే నిర్ధిష్ట విధానములో వ్రాస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో అలా ఒక నియమం పెట్టడం జరిగింది. ప్రదీపన్నట్టు తెలుగులో విరామియ్యటమే ఒక పెద్ద ఖాళీ మళ్ళీ ఖాళీ ఎందుకనే అభిప్రాయమున్నది. ఈ విషయాల్లో నేను నిపుణున్ని కాను..ఎవరైనా భాషావేత్తను సంప్రదిస్తే బాగుంటుంది --వైజాసత్య 19:18, 24 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


మూడు విధాల పరిశీలన

సాయీ ఈ విషయం లేవనెత్తాక నేను కొన్ని పాత పేపర్లు, పుస్తకాలు తిరగేశాను. మూడు విధాల గురించి క్లుప్తంగా ..

ఎ.కె.టి.వెంకట రామకృష్ణ - (అసలు ఖాళీలు లేకుండా): ప్రస్తుతం తెలుగు వికీలో మనం ఈ విధానం వాడుతున్నాము. కాని వ్యాకరణ పరంగా ఇది సరి కాదు. ఇక్కడ "ఎ.కె.టి.వెంకట" అనేది ఒక పదంగాను, "రామకృష్ణ" అనేది మరొక పదంగాను పరిగణించబడుతాయి. ఇది హేతుబద్ధం కాదు.
ఎ. కె. టి. వెంకట రామకృష్ణ - ప్రతి పొడి అక్షరానికీ ఖాళీలు ఉంచడం. - ఆంగ్లంలో వాడుక పద్ధతి (ఆంగ్ల వికీపీడియా గురించి కాదు) ప్రకారం ఇది సరైనది అనుకోవచ్చును . కాని అక్షరాలు విరజల్లినట్లుంటాయి. అంతే గాకుండా ఇంగ్లీషువాళ్ళకు ఇలాంటి రూలు ఏమీ లేదు. వాళ్ళకిష్టమైనప్పుడు ఇంకో విధం మొదలుపెట్టి ఇది ఫలానా స్టైలు అని ఒక క్రొత్త పేరు కూడా పెట్టేసుకొంటారు. సిలబస్‌లో చేర్చేస్తారు. (Look at the sample paper to see how the authors' first names are listed. You will note that only the initials are given, and that multiple initials are separated by a full stop without spaces. So in the Initials box, select the option A.B. making sure to choose the option without spaces between the initials.[1]. --- Do not insert a space between two initials: W.R. [2]). కనుక మనం వారిని అనుసరించవలసిన పని లేదు. అంతే కాకుండా "ఎన్.టి.ఆర్.", "వై.ఎస్.ఆర్." ఇలా పొడి అక్షరాలను పేర్లుగా వాడే పద్ధతి మనకున్నది. కనుక అక్షరాల మధ్య ఖాళీలుంటే అసంబద్ధంగా ఉంటుంది.
ఎ.కె.టి. వెంకట రామకృష్ణ - పొడి అక్షరాల మధ్య ఖాళీలు లేవు. కాని చివరి పొడి అక్షరం తరువాత చుక్క తరువాత, పదం మొదలయ్యేముందు ఒక ఖాళీ ఉంది. నేను పరిశీలించిన పుస్తకాలు, పేపర్లలో కూడా ఇదే చూశాను. కనుక ఇది సరైన విధం అనిపిస్తున్నది.
--కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:27, 24 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు కూడా మూడవదే సరైనదనిపిస్తుంది. సాయీ(చర్చ) 06:01, 26 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీ శీర్షికలలో అనవసర ZWNJ అక్షరాల వాడుక

[మార్చు]
  • /page-titles-with-unnecessary-zwnj లో వాడుకరులు, వారు సృష్టించిన ZWNJ గల పేజీ శీర్షికల సంఖ్య చూడండి. ZWNJ శీర్షికలో వాడటం వలన మనం నేరుగా లింకు ఇవ్వాలనుకున్నప్పుడు సరిగా ఇవ్వలేకపోతాం. వాటికి ZWNJ లేకుండా దారిమార్పు చేయాల్సి వస్తుంది. కావున కొత్తగా పేజీలు సృష్టించేవారు, ఇతర గూగుల్ ఫలితాలనుండి అతికించటం కాకుండా నేరుగా టైప్ చేసి పేజీ శీర్షిక సృష్టించితే మంచిది. అర్జున (చర్చ) 06:50, 7 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, zwnj అనేది పదాంతంలో వస్తే సవరించాలి. మధ్యలో వస్తే సబబే గదా?. __చదువరి (చర్చరచనలు) 07:45, 7 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, అవునండి, మీరు చెప్పేది సబబే. ZWNJ క్వెరీ తయారుచేయటానికే రెండు మూడు గంటలు పట్టింది కావున పోస్ట్ చేశాను. మీరు కోరిన విధంగా అదనపు లింకులు ఆ పేజీలో చేర్చాను, పట్టిక సరిచేశాను. కొన్ని disambiguation కొరకు బ్రాకెట్లు చేర్చినవి కూడా జాబితాలో వున్నాయి. బహుశా వాటిని Excel లేక గూగుల్ స్ప్రెడ్ షీట్లో వడపోత చేయటం క్వెరీ కన్నా సులభమేమో పరిశీలించండి. కొన్ని బ్రాకెట్లున్నా దోషంతో వున్నాయి. (ఉదా: కొత్తపల్లి (గరుగుబిల్లి‌ మండలం)) అర్జున (చర్చ) 09:30, 7 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
దారిమార్పుల పని పూర్తి చేశాను. --అర్జున (చర్చ) 00:45, 15 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Ramu Surya Rao (RSR Mastaru)

[మార్చు]

Ramu Surya Rao popularly known as RSR Mastaru in academic circles of Godavari districts of Andhra Pradesh. Gbandarupm (చర్చ) 15:02, 30 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]