వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/మూలాల్లో లోపాల సవరణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది ఎన్నో సంవత్సరాల నుండి చూపుచున్న మూలాల లోపాల విముక్తి ప్రాజెక్టు

[మార్చు]

చాలా వ్యాసాలలో, చాలా రోజులు నుండి చాలా వ్యాసాలలో కూర్పు చేసిన వివిధ మూలాలలో ఉన్న నిర్వహణ లోపాలను ఎర్ర లింకులు ద్వారా, కొన్ని బ్లూ లింకులు ద్వారా చూపెడతాయి.ఒక వేళ వాటిని సవరిద్దామని ప్రయత్నించినా కొన్ని అర్థమైనా కొన్ని ఒక పట్టాన అర్థమయ్యేవికావు.చాలా సార్లు వీటి విషయంలో కొన్నిటిని సవరించి, కొన్ని అవగాహన లేక కుదరలేదు.వీటి విషయంలో చదువరి గారు రెండు మూడు రోజుల నుండి ఓపికగా అన్నిటిని ఒక చోటకు చేర్చి, వాటిని ఎలా సవరించాలో తగిన సూచనలతో ఒక మంచి ప్రాజెక్టును తీసుకువచ్చినందుకు చదువరి గార్కి ధన్యవాదాలు.దీనికి కాలపరిమితి ఏమిలేనందున, నిర్వాహకులందరూ ఎవరికి అవకాశం కలిగినప్పుడు వారు తప్పని సరిగా ఈ ప్రాజెక్టులో పాల్గొనవలసిందిగా నా మనవి. యర్రా రామారావు (చర్చ) 15:07, 9 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ యర్రా రామారావుగారు, మూలాల లోపాల విముక్తి ప్రాజెక్టును రూపొందించిన చదువరి గారికి ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:08, 9 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ముందుగా ఏం చేద్దాం

[మార్చు]

@K.Venkataramana, @యర్రా రామారావు, @Pranayraj1985 గార్లకు, ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నందుకు ధన్యవాదాలు.

ముందుగా వర్గం:CS1 errors: dates వర్గంలో పని చేద్దామని నా ఉద్దేశం. తేదీ సరైన ఆకృతిలో లేని మూలాలున్న పేజీలు ఈ వర్గంలో చేరతాయి. దీనిలో ఉన్న సౌకర్యం ఏమిటంటే లోపం ఉన్న మూలం పక్కనే ఆ లోపం చూపిస్తుంది. కాబట్టి వీటిని సవరించే పని వేగంగా చెయ్యవచ్చు. నేను AWB వాడి చాలా పేజీల్లో లోపాలను సవరించాను. ఇకపై మానవికంగా చెయ్యాల్సినవే ఎక్కువ. అయితే పనిలో పనిగా ఇతర వర్గాల్లో కూడా పనిచెయ్యవచ్చు. అలా చేస్తే మరీ మంచిది. పరిశీలించండి.__ చదువరి (చర్చరచనలు) 06:32, 10 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ చదువరి గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:36, 10 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఎన్వికీలో పరిస్థితి - మన సమాచారం కోసం

[మార్చు]

ఎన్వికీలో en:Category:CS1 errors అనే వర్గాన్ని పరిశీలించాను. అక్కడ 60 పైచిలుకు ఉపవర్గాలున్నాయి. వాటిలో పేజీలు చాలా తక్కువగా ఉన్నాయి. మనతో పోలిస్తే చాలా చాలా తక్కువగా ఉన్నట్టు లెక్క. ఉదాహరణకు CS1 errors: dates వర్గంలో మన దగ్గర 3285 పేజీలుంటే (ఇప్పుడు 679 అయ్యాయి), ఎన్వికీలో అదే వర్గంలో కేవలం 25 పేజీలున్నై. ఇతర వర్గాల్లో కూడా పేజీల సంఖ్య బాగా తక్కువగా ఉంది. దీన్నిబట్టి వాళ్ళు నిర్వహణ పట్ల చాలా చురుగ్గా ఉంటున్నట్టుగా మనం భావించవచ్చు. ఇతర భారతీయ భాషా వికీపీడియాలు కూడా కొన్ని చూసాను. వాళ్ళ కంటే వర్గీకరణ విషయంలో మనం ముందున్నామని నాకు అనిపించింది. __ చదువరి (చర్చరచనలు) 06:38, 10 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు చదువరి గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:09, 11 జనవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]