వికీపీడియా చర్చ:రచ్చబండ (పాలసీలు)/జిల్లా, నగర వ్యాసాలకు ప్రామాణిక సమాచారపెట్టెలు
జిల్లా సమాచారపెట్టెపై అభిప్రాయం
[మార్చు]- ప్రాంతం:ఆంధ్ర ప్రదేశ్ - ప్రాంతం:ఆంధ్రప్రదేశ్ (కలిపి చేప్పే పదం)
- కేంద్రము - కేంద్రం (వికీపీడియా శైలికి అనుగుణంగా)
- జనాభా(2011) - జనాభా (2011) (సాధారణ మార్పు)
- భాష(లు) - భాష (లు) (సాధారణ మార్పు)
- ప్రామాణిక కొలమానము - ప్రామాణిక కొలమానం (ఇది అవసరమా? భారతదేశం అంతా ఒకటే గదా...)
అదనపు చేర్పులు ప్రతిపాదన
[మార్చు](ఇవి జిల్లా స్వరూపం చూడగానే తెలియటానికి)
- జిల్లాలు
- రెవెన్యూ డివిజన్లు
- మండలాలు
- రెవెన్యూ గ్రామాలు
- గ్రామ పంచాయితీలు
(ఇవి జిల్లా ముఖ్యపట్టణం దిగువున) --ఈ విధంగా స్వల్ప మార్పులు చేస్తే బాగుంటుందనుకుంటాను. 2019-04-25T12:19:10 User:యర్రా రామారావు
- @User:యర్రా రామారావు గారికి, కొత్త అనగా ఆంగ్లవికీనుండి దిగుమతి చేసిన మూసకు (అనగా కుడివైపున వున్న మూసకు) మార్పులు చేర్పులు ప్రతిపాదించండి. మీరు కోరిన మొదటి విభాగములో తెలుగులో అనువాద పరంగా మార్పులు చేయడానికి ఇబ్బందిలేదు. ఎటొచ్చి రెండవ విభాగంలో మీరు కోరినట్లు జిల్లా పేజీలలో రెవెన్యూ గ్రామాలు, గ్రామ పంచాయితీలు చేర్చటానికి మూసలు ఆంగ్లవికీనుండి తెచ్చిన మూస కోడ్ పరంగా మార్చవలసి వస్తుంది. నేను ప్రతిపాదించినది అలా మార్చకుండా వుంటే మేలని. మీరు ఇచ్చిన వివరం మూలాలలో వుండవచ్చు. ఒక్కొక్క రకంమూసంలో దాని క్రింది రకం విభాగాలు ఎన్ని ఉన్నాయని ఇస్తే సరిపోతుంది. అంటే జిల్లాలో మండలాల సంఖ్య చేర్చడం. మండలాలలో గ్రామ పంచాయితీల సంఖ్య చేర్చటం. ఇలా వుంటే ముందు ఏమైనా మార్పులు వస్తే ఒక చోట మార్పు చేస్తే సరిపోతుంది. లేకపోతే ఒక కొత్త గ్రామం ఏర్పడింది అనుకుంటే మండలం పేజీలోను , జిల్లా పేజీలోను మార్పు చేయాలి. రెవెన్యూ డివిజన్లు, రెవిన్యూ గ్రామాలు కేవలం రెవిన్యూ అధికారులకే ఎక్కువభాగం ఉపయోగం అనుకుంటాను. అందుకని నిర్వహణని సులభం చేసుకోవడానికి వాటిని వదిలివేయడం కేవలం వ్యాసంలో వివరం వ్రాసుకోవడం మంచిదనుకుంటాను. ఏమైనా అర్ధం కాకపోతే మరల అడగండి--అర్జున (చర్చ) 10:24, 25 ఏప్రిల్ 2019 (UTC)
విధానం అవసరమా?
[మార్చు]User:యర్రా రామారావు గారు తప్ప, పెద్దగా స్పందనలు లేనందున ఈ విధానం అవసరమా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. తెలుగు వికీలో మొదటినుండి ఆంగ్ల వికీలోని సమాచారపెట్టె మూసలనే చాలావరకు దిగుమతి చేసే వాడుకున్నాము. వైజాసత్య మండలాలకు, గ్రామాలకు (అర్ధంతరంగా ముగిసిన) మూసలు మినహాయిస్తే తెవికీలో ప్రత్యేకమైన సమాచారపెట్టెల మూసలు వున్నట్లు తెలియదు. ఆంగ్లవికీలోని పాతమూసలస్థానే కొత్త {{infobox settlement}} దాని ఆధారితమైన {{Infobox India district}} వచ్చినందున పాతమూసలలోని కొంత సమాచారం తొలగించబడింది. అయినా ఈ మూసలలో సమాచారం చేర్చటంలో చాలామంది పంచుకున్నందున , ముందు జాగ్రత్తగా ఈ విధానం చర్చ ప్రారంభించబడినది. ఈ చర్చ గడువు ముగిసినతర్వాత వోటు పద్ధతి అవసరంలేకుండా తెవికీ సాంప్రదాయంగా కావలసిన మార్పులు చేయవచ్చుఅనుకుంటున్నాను. అభ్యంతరాలున్నవారు స్పందించవలసిందిగా కోరుతున్నాను.--అర్జున (చర్చ) 08:23, 26 ఏప్రిల్ 2019 (UTC)
- ప్రతిస్పందనలు రానందున, విధానం అవసరంలేనిదిగా పరిగణించడమైనది. --అర్జున (చర్చ) 02:23, 6 మే 2019 (UTC)
- చర్చకు కాలదోషం పట్టినందున {{సహాయం కావాలి-విఫలం}} తొలగించాను.--అర్జున (చర్చ) 23:45, 22 మార్చి 2021 (UTC)