Jump to content

వికీపీడియా చర్చ:రచ్చబండ/వికికాన్ఫెరెన్స్ ఇండియా 2020 హైద్రాబాదు ముందస్తు చర్చ ముగింపు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

చైతన్య ఆంధ్ర ప్రదేశ్ వి.వి.ఐ.టి వికీ-క్లబ్ వారిని భాగస్వాములుగా చేసుకోవాలని, ఏ ప్రయోజనాలను ఆశించి నిర్ణయించుకున్నారో తెలియచేయగలరా?B.K.Viswanadh (చర్చ)

నేను చెప్తాను విశ్వనాథ్‌ గారూ. ఈ కృష్ణచైతన్య వెలగా అన్న అతనే శూన్యం నుంచి పెద్ద ఉద్యమ స్థాయికి, మన తెలుగు వికీపీడియన్లు సైతం నేర్చుకోదగ్గ విధానంలో వీవీఐటీ అనే ఇంజనీరింగ్ కళాశాలలో పదుల సంఖ్యలో వికీమీడియన్లను, కనీసం ఏడెనిమిది మంది యువ వికీ నాయకులను అభివృద్ధి చేసిన వ్యక్తి. వయసు 22. ఇప్పుడు కళాశాలలో సర్వ స్వతంత్రమైన (కాలేజీ యాజమాన్యం కానీ, మరే ఇతర సంస్థలు కాని నియంత్రించని) వికీ క్లబ్ దాన్ని స్థాపించిన కృష్ణచైతన్య ప్రమేయం అక్కరలేకుండా నిర్వహిస్తున్న యువ నాయకులు ఉన్నారు. వారు వట్టిమాటలు కాకుండా గట్టిమేల్ తలపెడుతున్నారు. యువతీ యువకులు, మీలాగా నాలాగా గట్టి వికీపీడియన్లు, అంతకుమించి పదుల సంఖ్యలో కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేసినవారు, ఈ ఏడాది ట్రైన్-ద-ట్రైనర్ బిడ్డింగ్ వేసి విశాఖపట్టణంలో సీఐఎస్‌-ఎ2కెతో సహ నిర్వహణ చేసినవారు - అయిన వీరందరూ లేకుండా తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌ వికీపీడియా సముదాయం అసంపూర్ణం. అలానే మనతో కలిసి మొన్న మినీ-ట్రైన్ ద ట్రైనర్ అద్భుతంగా సాగడంలో సహాయపడ్డవారు. మీరు కార్యక్రమాల నిర్వహణలోనూ, భాగస్వామ్యంలోనూ ఈమధ్య అచేతనంగా ఉండడంతోనూ, అలానే ఈ వీవీఐటీ వాళ్ళ కృషి మొదలై మూడేళ్ళు అయివుండడంతోనూ ఇవన్నిటి పట్ల అవగాహన మీకు ఉండివుండకపోవడం సహజం. కాబట్టి, మీరు 2017-18లో వీళ్లు చేసిన పని, 2018-19లో వీళ్ళు వికీమీడియా ఉద్యమానికి చేసిన సేవ, 2019-20ల్లో వీళ్ళు చేస్తున్న కృషి చూడండి. ఇంకో సంగతి, వీళ్ళు తెలుగు వికీసోర్సులో కూడా కనీసం మూడు నెలల నుంచి ఓ మంచి విద్యార్థి వికీలైబ్రేరియన్లను తయారుచేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి, మనకీ సాయపడుతున్నవాళ్ళే. మొత్తంగా చెప్పేదేమంటే-
  1. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వికీపీడియన్లు అన్నప్పుడు ఆ నిర్వచనంలోకి మన తెలుగు వికీపీడియన్లు వచ్చినట్టే, ఈ వీవీఐటీ వికీకనెక్ట్ వికీపీడియన్లు కూడా వస్తారు.
  2. వీళ్ళ నిర్వహణా సామర్థ్యం, సువ్యవస్థితమైన వీరి సముదాయం ఎలాంటి కాన్ఫరెన్సు నిర్వహణకైనా చాలా ప్రయోజనకరం.
  3. మీలాగా, నాలాగా వీళ్ళు కూడా తెలుగు వికీమీడియా ప్రాజెక్టులకు తాము చేయగలిగింది ఎప్పుడూ చేసే తోటి వికీపీడియన్లే. తెలుగు వికీసోర్సులో వీరి కృషి దానికొక చిన్న సూచిక.
ఇదండీ సంగతి. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 08:23, 27 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు. వివరించినందుకు ధన్యవాదాలు. వీరి కృషిని, వీరు ఈ సదస్సులో నిర్వహణ పట్ల నిబద్దత కలిగిఉన్నారని సముదాయానికి తెలియచేయడం ముందస్తు అవసరంగా అనిపించి నేనీ ప్రశ్నను మీముందుచాను.B.K.Viswanadh (చర్చ) 13:12, 28 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వికికాన్ఫెరెన్స్ ఇండియా చేయటానికి మన సముదాయాలు, వాలంటీరుల సంఖ్య సరిపొదని నా అభిప్రాయం. మొదట ఒక లొకల్ ఈవెంట్ చేసి చూడవచ్చు Kasyap (చర్చ) 05:19, 29 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Kasyap గారు ముందస్తు ట్రైల్ కార్యక్రమాలు కొన్ని చేయడం మంచిదే. దానికి ఒక ప్రణాళిక సిద్దం చేసుకోవాలి, తదుపరి కార్యక్రమాలకు, కలయికలకు ఒక తాత్కాలిక వేదిక సిద్దం చేసుకోవాలి.అన్నిటికంటే కమిట్‌మెంట్ ఉన్న కొందరు సభ్యులను ఎప్పుడు అవసరమైనా అందుబాట్లో ఉండేలా చూసుకోవాలి. హైద్రాబాద్ కేంద్రంగా ఉన్న వికీ సభ్యులను చైతన్యపరుచుకోవాలి..B.K.Viswanadh (చర్చ) 06:00, 4 నవంబర్ 2019 (UTC)