Jump to content

వికీపీడియా చర్చ:తెలుగు ప్రముఖుల జాబితా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

జాబితా అవసరమా?

[మార్చు]

వికీపీడియా జీవితచరిత్రల జాబితా అవసరమా? ఇప్పటికే వర్గాల వారీగా ఆయా వర్గాలలో ఈ సమాచారం అందుబాటులో ఉంది. ఒకవేళ ఇలా జాబితాగా చేయాలనుకున్ననూ బాటుద్వారా సునాయాసంగా చేయవచ్చు. అంతేకాక వ్యక్తులు వేరు జీవితచరిత్ర వేరు. జీవితచరిత్రల జాబితా అంటే వ్యక్తులకు సంబంధించిన జీవితచరిత్ర గ్రంథాల జాబితా అనే అర్థం వస్తుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:08, 15 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఇదివరకే ఉన్న జీవితచరిత్ర (?) వ్యాసాలకు సంబంధించి ప్రాజెక్టు పేజీని ప్రారంభించే అవసరం ఎందుకో తెలుసుకోదలిచాను. ప్రాజెక్టు పేజీలో ఆ ప్రాజెక్టు పనికి సంబంధించి చేయాల్సిన పద్దతులు పేర్కొంటే చాలు. ఉదా:కు చూడండి. వికీపీడియా:వ్యక్తుల పేర్లు సి. చంద్ర కాంత రావు- చర్చ 19:58, 15 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంత్ రావుగారూ ! ప్రముఖుల వ్యాసాలను ప్రణాళికగా అభివృద్ధి చేయాలని ఈ పేజీ సృష్టించబడింది. ఈ ఇప్పటికి ఉన్నవి కాక వ్రాయవలసిన కొత్తవ్యాసాల పేర్లను చేర్చాలి. వాటి నుండి ఆసక్తికరమైనవి ఎంచుకుని సభ్యులు వ్యాసాలు ప్రారంభిస్తారు.t.sujatha (చర్చ) 03:16, 16 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రాజెక్టుకు అనుబంధంగా ఉపయోగపడుతుందని ప్రారంభించాను. వివిధ రంగాలలో ప్రసిద్ధిచెందిన వ్యక్తుల జాబితాలు చాలా ఉన్నాయి. అన్నింటినీ కలిపడమే ఈ జాబితా ముఖ్య ఉద్దేశ్యము.Rajasekhar1961 (చర్చ) 11:38, 16 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఇంకా రాయవలసిన వాటిని గుర్తించడానికి జాబితాలు వుపయోగపడతాయి. ఇంగ్లీషు వికీలో ప్రధానపేరుబరిలోనే జాబితాలను వర్గాలకంటె భిన్నంగా వుండే మార్గదర్శకంగా వాడుతున్నారు. --అర్జున (చర్చ) 03:47, 19 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి ప్రయత్నం. ఆయా అక్షరాలు క్రమంలో ఇంకా కొత్త వ్యక్తులు (వివిధ రంగాలలో కృషి)గురించి కూడా చేర్చేందుకు ప్రయత్నం అవశ్యం. Behara venkata Lakshmi narayana (చర్చ) 07:47, 27 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.

ఈ పేజీ మొదటి పేరుబరిలోకి తరలిస్తే ఎలా ఉంటుంది

[మార్చు]

ఈ పేజీని వికీపీడియా పేరుబరి నుండి మొదటిపేరుబరితో తెలుగు ప్రముఖుల జాబితా అని దారిమార్పు లేకుండా తరలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.తెలుగు ప్రముఖుల జాబితా పేరుతో మొదటి పేరుబరిలో ఎలాంటి వ్యాసం లేదు.అయితే దీని నిర్వహణ గూర్చి కూడా అలోచించాల్సిన అవసరం ఉంది. యర్రా రామారావు (చర్చ) 14:03, 29 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంకో విషయం దీనికి లింకు చేసిన వికీ డేటా ఆంగ్లవ్యాసం ప్రధానపేరుబరిలోనే ఉంది. యర్రా రామారావు (చర్చ) 07:37, 14 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]