వికీపీడియా చర్చ:కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం
విశిష్టవికీపీడియన్లు కు బదులు
[మార్చు]User:T.sujatha, విశిష్టవికీపీడియన్లు కు బదులుగా కొమర్రాజు లక్ష్మణరావు వికీ పురస్కార గ్రహీతలు అనడం మెరుగేమో ఆలోచించండి. --అర్జున (చర్చ) 17:30, 30 నవంబర్ 2013 (UTC)
పురస్కారలకు సభ్యుల మద్య పోటీ???????????
[మార్చు]రాజ శేఖర్ గారూ..... ఎవరెన్ని చెప్పినా ఇది ముమ్మాటికి సభ్యుల మద్య పోటీనే..... స్వీయ ప్రతిపాదన. అనే అంశం అందుకు నిదర్శనం. సహ సభ్యులు కూడ ఇతరులను ప్రతి పాదించ వచ్చు ననే అంశ కొంత ఊరట. కాని అందులో మరొక్క కిటుకు కూడ పెట్టారు అంశాలవారిగా ఇతర వివరాలు చేర్చమని. మళ్ళీ కథ మొదటికే వచ్చినది. ఒకరి పేరు ఇతర సహ సభ్యులు ప్రతిపాదించినా ఆ ప్రతి పాదనలో మన స్వాత్కోర్ష వ్రాయక తప్పదు. అనగా వికీలో నాకింత ఘన చరిత్ర వున్నది. నాకు పురస్కారమివ్వండి అని అభ్యర్దించడమే... అలా కాకుండా ఒక సంఘం (పురస్కార ఎంపిక మండలి).... సభ్యుల పనితనం గమనించి గుట్టు చప్పుడు కాకుండా పేర్లను ప్రకటిస్తే బాగుండేదని నా స్వంత అభి ప్రాయము. పరిశీలించగా ఇదంతా ఆంగ్ల సాంప్రదాయం నుండి వచ్చినట్లు తోస్తున్నది. ఇది మార్చ వీలు లేదేమో.
పైన నేను చెప్పినట్లు ఈ పురస్కార సాంప్రదాయము ఆంగ్ల వికీ నుండి దిగుమతి అయినట్టుంది. ఎలాగూ పురస్కార ప్రధానము చేయ నిచ్చయించారు గనుక.... గంప గుత్తగా అనగా అన్ని వికి ప్రాజెక్ట్లులకు ఒకే పురస్కారము కాకుండా.... ఒక్కొక్క విభాగానిని ఇద్దరు ముగ్గురిని ప్రధమ, ద్వితీయ, తృతీయ పురస్కారాలు ఇస్తే బాగుంటుందేమో పరిశీలించండి. అనగా తెవికి/విక్షనరీ/వికీసోర్సు,/వికీ బుక్స్/వికీకోట్/వికీమీడియా (బొమ్మలు విభాగము) మొదలగునవి. నగదు తో పాడు ఆ పురస్కారాలకు మంచి పేర్లు పెడితే బాగుండునేమోనని కూడ ఆలోచించ గలరు. (పై నా అభిప్రాయం..ఇక్కడ వ్రాయడం అభ్యంతర కరమని అనిపిస్తే..... తొలిగించ..... మనవి)Bhaskaranaidu (చర్చ) 08:15, 4 డిసెంబర్ 2013 (UTC)
- Bhaskaranaidu , మీ సందేహాన్ని రాజశేఖర్ గారి చర్చాపేజీలో రాయగా, రాజశేఖర్ గారు ఇక్కడికి తరలించి మంచిపని చేశారు. మీ సందేహాన్ని ఎంపికమండలి చర్చించి త్వరలో సమాధానమీయగలదు. ప్రస్తుతము జరుగుతున్న పనిని ఏ విధంగానుకుంటుపడకుండా కొనసాగించమని మీకు మరియు సహ సభ్యులకు మనవి చేస్తున్నాను. --అర్జున, కార్యదర్శి, ఎంపికమండలి--అర్జున (చర్చ) 09:49, 4 డిసెంబర్ 2013 (UTC)
- నా సందేహాలు వికీపీడియా:రచ్చబండ#నా సందేహాలు, సూచనలులో తెలిపాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:43, 5 డిసెంబర్ 2013 (UTC)
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం ప్రశ్నలు-సమాధానాలు
[మార్చు]1)అసలు ఇది ఎంపికనా? లేదా ఎన్నికనా? అనేది స్పష్టం కావడం లేదు. ఎంపిక అన్నప్పుడు ఎవరైనా ఒక సభ్యుడు ఒక పేరును ప్రతిపాదిస్తే ఆ తర్వాత మళ్ళీ ప్రతిపాదిత సభ్యుడి అంగీకారం అవసరమేనా?
వికీమీడియా ప్రాజెక్టులలో సభ్యుడు మారుపేరుతో, సంపర్క సమాచారం లేకుండా పనిచేసే వీలుంది. ఈ వినూత్న పురస్కారానికి నగదు కూడా వుండడంతో సభ్యుని సంపర్కము అవసరం. అంతే కాక ఎప్పుడో రచనలు చేసిన వారు మరల వికీలో సక్రియులవటానికి ఒక అవకాశం. ఈ ఎంపిక బహుముఖీయ మూల్యాంకనం పై ఆధారపడింది కాబట్టి ఎంపికమండలి కృషి సమర్ధవంతంగా వుండటానికి, దాని ఫలితం సభ్యునికి అందడానికి ప్రతిపాదిత సభ్యుని అంగీకారం తప్పనిసరి.
2)ప్రదిపాదిత (పురస్కార) సభ్యుని పేజీలో ఇతర సభ్యుల సమర్థన అవసరమేనా? ఎంపిక ప్రక్రియలో దీనికుండే ప్రాధాన్యత ఏమిటి? ఇది ఓటింగ్ కానప్పుడు ఇతర సభ్యుల మద్దతులు కూడా పొందడానికి ఇవి అందాల పోటీలు గాని టెలివిజన్‌లో ప్రసారమయ్యే డ్యాన్సు ప్రోగ్రాంలు కాని కావు కదా!
ఒక ప్రతిపాదిత సభ్యునికి ఎక్కువమంది ప్రతిపాదనలు చేసే అవకాశం వుంది. వికీమార్పులలో ఏకకాలంలో జరుగుతాయి కాబట్టి ఒక ప్రతిపాదన సభ్యునికి రెండవ సారి చేసినవారు, సమర్ధనలో పేరు చేర్చే అవకాశం వుంటుంది. ప్రతిపాదిత సభ్యుడు వికీ సభ్యులతో ఎన్నోరకాల సంబంధాలు కలిగివున్నప్పుడు, ఎక్కువమంది సమర్ధించే వీలుంది. ఈ విధానం వలన సభ్యులలో ప్రశంసల వెల్లువెత్తి చాలామందిని ఈ పురస్కారానికి ప్రతిపాదించటానికి ప్రోత్సహించే వీలుంది. ఈ వివరము ఎంపిక ప్రక్రియలో ప్రధానం కాకపోయినా ప్రతిపాదిత సభ్యునివిషయమై క్లిష్ట చర్చలలో ముఖ్యభూమిక పోషించేవీలుంది.
3)ఎన్నిక అన్నప్పుడు పోటీ వాతావరణం నెలకొంటుంది. ఇప్పుటి ప్రక్రియ పరిశీలిస్తే పోటీలాగానే కనిపిస్తోంది. ఎంపిక ప్రక్రియ అన్నప్పుడు, ఎంపిక మండలి ఉన్నప్పుడు ఈ ప్రక్రియలో సభ్యుల ప్రమేయం అవసరమా?
కొంత వరకు సోషల్ మీడియాలో పొరపాటుగా వాడిన ఎన్నిక అన్న వూహతో సందేహాలు వచ్చాయి. అయితే ఇది పైన చెప్పినట్లు ఎంపిక మాత్రమే కాని ఎన్నిక కాదు. ప్రతిపాదన సమర్ధన అనేవి సాధారణ ఎన్నికలు, లేక సభా తీర్మానాలలో వుండే అంశాలు ఇక్కడ వాడుకోవటం జరిగింది.
ఎంపిక మండలి మీద పక్షపాత ధోరణి వ్యవహరించారన్న ఆరోపణలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకున్నాం. ఎంపిక మండలి సభ్యులకు ప్రతిపాదించే అవకాశం మరియు ఇతర ప్రతిపాదనలను సమర్ధించే అవకాశం కూడా లేదు.
పోటీని ఆరోగ్యవంతమైన పోటీగా పరిగణించితే పోటీ అన్న పదానికి వ్యతిరేకత వుండే అవకాశంలేదు. నిత్యజీవితంలో పోటీ తప్పదు. కానీ పోటీ పక్రియ వ్యక్తి కృషిలో మెరుగుపరచేవాటిని స్పష్టపరచేటప్పుడు, ఇతరులతో సహకారాన్ని ఒక అంశంగా పరిగణించినప్పుడు, వికీకృషిని వ్యాప్తిని తెలియచేసేటప్పుడు, ఇది మరింత కృషి చేయటానికి, జాతీయ, అంతర్జాతీయ అవకాశాలకు మార్గం సుగమం చేసేటప్పుడు, వికీ అభివృద్ధికి దోహదపడేటప్పుడు, ఏ దురుద్దేశాలకు తావులేకుండా, నిప్పక్షపాతంగా జరిగేటప్పుడు అటువంటి దాన్ని అందరూ స్వాగతిస్తారని మా నమ్మకం.
4)పురస్కార ఎంపికకు ప్రాతిపదికలేమిటి అనేది స్పష్టంగా లేదు. అంటే ఎంపిక మండలి ఇష్టానిష్టాలపై ఆధారపడి ఉంటుందా?
ప్రతిపాదన పత్రాన్ని పరిశీలించినట్లయితే ప్రతిపాదిత సభ్యుని వికీ కృషి గురించి సమగ్ర సమాచారం పొందుపరచడానికి వీలుగా తయారుచేయడం జరిగిందని గమనిస్తారు. ఇది ప్రధానంగా ఆధారాలతో కూడిన సమాచారాన్ని వీలైనంతవరకు పరిమాణాత్మకంగా లేకపోతే గుణాత్మకంగా అనుభవజ్ఞులైన ఎంపికమండలి చర్చల ద్వారా విశ్లేషించి చేసే నిర్ణయం.
ప్రాతిపదికకు స్పష్టమైన కొలబద్ద దిశగా పనిప్రారంభించాం. త్వరలోనే విడుదలచేస్తాం. వీటిపై సభ్యుల సలహాలు ఆహ్వానించి వాటిని పరిశీలించి కొలబద్దని ఖరారు చేస్తాం.
5)ఎంపికకు కేవలం తెవికీలో కృషి మరియు తెవికీకై కృషి మాత్రమే పరిగణనలోకి వస్తుందా లేదా తెలుగు బాషా అభివృద్ధికి సేవలందించిన సభ్యులందరినీ పరిగణలోకి తీసుకుంటారా? అలా అయితే ఒకట్రెండు దిద్దుబాట్లు మాత్రమే చేసి బయటి ప్రపంచంలో తెలుగు విజ్ఞానానికి కృషిచేస్తున్న వారికి కూడా పురస్కారం ఇవ్వవచ్చా?
ప్రతిపాదన మూసని పరిశీలించినట్లైతే ఈ పురస్కారం యొక్క పరిధి కేవలం వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధి వరకే ఉన్నదని తెలుస్తుంది. తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో పనికి మొదటి తొమ్మిది అంశాలు, తెలుగుకే పరిమితం కాని వికీమీడియా ప్రాజెక్టులైన కామన్స్, ఇంగ్లీషు,ఇతర భారతీయభాషలు మరియు వికీమీడియా కు సహాయపడే ట్రాన్స్లేటే వికీ లాంటి ప్రాజెక్టులలో కృషిని పదవ అంశంగా నిర్ణయించాము. ఈ మూస NWR2011 మూలంగా దాని ఫలితాలపై వచ్చిన స్పందనలను పరిగణించి లోపాలను తొలగించి సమగ్రంగా వుండేటట్లు చేయబడింది.
6)సెప్టెంబరు 2012 లోపే చేరిన సభ్యులను మాత్రమే ఎంపిక ప్రక్రియలో ఎందుకు పరిగణించాలి? ఆ తర్వాత చేరి ఇప్పుడు చురుకుగా ఉంటూ తెవికీలో సేవలందిస్తున్న వారిని విస్మరించడం సమంజసమేనా? 9/2013ను కట్ ఆఫ్ డేట్ గా మారిస్తే మరికొందరి సేవలను గుర్తించినట్లు కాదా?
విశేష కృషి చేయాలంటే కనీసం ఒక సంవత్సరమైనా పడుతుందని అంచనా. పైగా ఈ మొదటి పురస్కారం పదేళ్ళ కృషిని గుర్తిస్తున్నాం, ఆ తరువాత ప్రతి సంవత్సరం గత రెండేళ్ళ కృషిని గుర్తించి పురస్కారం ఇవ్వాలని ఆలోచన. ఈ సారి కేవలం కట్ ఆఫ్ కారణంగా అనర్హులైన వారికి వచ్చే సంవత్సరం పురస్కారం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే ఈ తేది తర్వాత చేరినవాళ్ళకు తదుపరి సంవత్సరాలలో గుర్తింపుకు అవకాశం లభిస్తుందన్నమాట. అలాగే ఎంపికకు అర్హులుకాకుండా విశేష కృషి చేసిన వారికి కూడా ఎంపికమండలి ప్రశంసా పత్రం ఇచ్చేటందుకు ఇంకా చర్చించవలసివుంది.
7)కేవలం 9/2012 లోపు దిద్దుబాట్లు చేసినవారు అన్న ఒక్క అర్హతతో వందలాది సభ్యుల పేర్లు ప్రతిపాదితమైతే ఎంపికమండలికి అనవసర ప్రయాస కాదా? ప్రతిపాదనకు మరిన్ని అర్హతలు అవసరం లేదా? కనీసం ఇన్ని విశేషవ్యాసాలు, ఇంత కాలం నిర్వహణ, ప్రధాన శీర్షికల భాద్యత చేపట్టడం, 100 లేదా 250 దిద్దుబాట్లు చేసి ఉండటం లాంటి మరికొన్ని అర్హతలు చేరిస్తే బాగుండేది. (కనిష్ట 1000, గరిష్ట 2000 అనేది ఇచ్చారు కాని అర్థం కావడం లేదు) ఎంపిక కొలబద్ద అనేది ఒక్కరిపైనే ఆధారపడి ఉంటుందా? దాన్ని ఎవరైనా మార్చవచ్చా? ఒకరు చేసిన కొలబద్దనే ఎంపిక మండలి పరిగణిస్తుందా? కొలబద్దే ఇంకా పూర్తికానిదే ఎంపిక ప్రక్రియ ప్రారంభించవచ్చా?
వృధా ప్రయశే, ఎన్ని ప్రతిపాదనలు వస్తాయో, వస్తాయో, రావో అన్న పరిస్థితిలో ప్రతిపాదనకు ఎక్కువగా అర్హతలు పెట్టలేదు. ఈసారి ప్రతిస్పందన చూసి వచ్చే సంవత్సరం నుండి ప్రతిపాదనా స్థాయిలోనే మరిన్ని అర్హతలు చేర్చవచ్చు. కొలబద్దను ఇంకా పూర్తిగా ఖరారు చెయ్యలేదు. కానీ స్థూలంగ ఇప్పటికే విడుదల చేశాం.ఈ కొలబద్దను రూపొందించడానికి అందరి సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుంటాయి. ప్రతిపాదనా అర్హతలు వేరు పురస్కారపు నిర్ణయానికి ఉపయోగించే కొలబద్ద వేరు.
ప్రతిపాదన మూసరూపం లో సమగ్రమైన వివరాలు చేర్చే వీలున్నందున, కొలబద్ద ఖరారు కొంత ఆలస్యమైనా పెద్ద ఇబ్బంది లేదు. మొత్తం ప్రక్రియ సాధ్యమైనంతవరకు వీకీపద్దతిలోనే జరుపుతున్నందున కొలబద్ద చిత్తు ప్రతి ప్రారంభించాము. మార్పులు చేయవచ్చని, సూచనలు చేయవచ్చని కూడా తెలిపాము.
8)గణాంకాలలో నమోదుకాని నిర్వహణలాంటి పనులు, సలహాలు-సూచనలు తదితరాలు ఈ ప్రక్రియలో ఎలా పరిగణిస్తారు?
వికీపీడియాలో ప్రతిఒక్క పని నమోదు అవుతుంది. వాటినన్నిటిని పరిగణించడానికి గణాంకాల లింకులు కూడా ప్రతిపాదనలో వచ్చేటట్లు చేశాము. కొన్ని విషయాలలో అన్నీ గణాంకాల్లో అంచనా వెయ్యలేనపుడు. ఇక్కడ ఇతర సభ్యుల వ్యాఖ్యలు, ప్రతిపాదనలో ప్రతిపాదితుని వ్యాఖ్యలు చాలా ఉపయోగపడతాయి. అందుకే వీలైనంత పుష్టిగా ప్రతిపాదన తయారుచెయ్యాలి. అలాగే ప్రతిపాదితుని కృషిపై ఎంపిక మండలికున్న అవగాహన కూడా ఉపయోగపడుతుంది.
9)కొందరి గణాంకాలు బాగా ఉండవచ్చు కాని అలాంటి దిద్దుబాట్ల వల్ల తెవికీ వ్యాసాలలో ఎంత నాణ్యత పెరిగిందనేది ఎలా తెలుస్తోంది? వాపుకు బలుపుకు తేడా గుర్తించడానికి కొలబద్దలో ఏమైనా ఆధారం ఉందా?
రెడీమేడ్ గా లభ్యమయ్యే గణాంకాలు కాక ఎంత పరిమాణంలో మార్పులుచేర్పులు చేశారు వంటి గణాంకాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నాం. మీకు తోచిన గణాంకాలుంటే సూచనలు చేయగలరు. కొలబద్దలో మార్పుల సంఖ్యతోపాటు, మార్పుల ప్రభావం అనేదానిపై ప్రత్యేక శ్రద్ద వుంటుంది. ఇప్పటికే రూపొందించిన కొలబద్ద చిత్తుప్రతిలో చూచాయగా తెలిపాము. పూర్తిగా తయారైన తరువాత స్పష్టత పెరుగుతుంది.
10)ఎంపిక అనేది మండలి మెజారిటీ నిర్ణయమా? లేదా అధ్యక్షుడి తుది నిర్ణయమా? అలా కాకుండా ఒక్కో సభ్యుడు రెండేసి సభ్యులను ఎంపికచేస్తారా? ఎలా ఎంపిక చేశారనేది తెలుసుకోవడానికి అందరికీ అవకాశముందా?
మొదట అంగీకారానికి వచ్చే దిశగా చర్చలు జరుతాయి. ఎంపిక మెజారిటీ నిర్ణయమే. ఎంపికను వీలైనంతగా పారదర్శంగా చేసే ప్రయత్నాలు చేస్తున్నాము. మండలికి వచ్చే ప్రతిపాదనలను సముదాయమే నిర్ణయిస్తుంది కాబట్టి మండలి సభ్యులు తమకు అనుకూలంగా ఉన్న వారిని ఎంపిక చేసే ప్రమాదం లేదు. అందులో మండలి ఒకరిద్దరు కాకుండా ఐదు మంది సభ్యులతో ఏర్పడింది.
వచ్చిన ప్రతిపాదనలను ఎంపికమండలి సభ్యులు చర్చిస్తారు. ప్రతిఒక్కరు వేరు వేరుగా ప్రతిపాదనని మూల్యాంకనము చేస్తారు, ఈ మూల్యాంకనాల సగటు ఆధారంగా ప్రతిపాదనల వరుస క్రమం తయారవుతుంది. ఇక ఆ వరుసలో ఎక్కడ పురస్కారం ఎంపికకు హద్దు గీయాలి అన్న విషయంలో ఎంపికమండలి సభ్యులు చర్చల ద్వారా ఏకాభిప్రాయానికి వస్తారు. ఒక వేళ అలా వీలుకానప్పుడు వోటింగ్ ప్రక్రియ ద్వారా నిర్ణయం జరుగుతుంది.
11)తెవికీలో ఏది చేసిననూ అంతా బహిర్గతమే. అలాంటప్పుడు ఒక్కో ప్రతిపాదిత సభ్యునికి ఒక పేజీ కేటాయించడం వారి కృషిని వ్రాసుకోమనడం బాగుండదు. విశేషకృషి చేసినవారు తమగురించి వ్రాసుకోవడానికి ఇష్టపడనప్పుడు పురస్కారం పొందే అవకాశం సన్నగిల్లినట్లేనా?
బహిర్గతమే కానీ ఆ సమాచారం అంతా త్రవ్వితీసి అనుసంధించి బేరీజు వెయ్యాలంటే సులభమైన పనికాదు. తమ గురించి తాము వ్రాసుకోనప్పుడు ఎంపిక మండలి వీలైనంతగా ఆ సభ్యుని కృషిని అంచనా వెయ్యటానికి ప్రయత్నిస్తుంది. అందుకే ఎవరికి వారు, మరియు ఇతర సభ్యులు ప్రతిపాదనను బలిష్టంగా తయారుచేస్తే సులువుగా ఉంటుంది.
పైగా ఇలా తమ కృషిని ఒక్క చోట సమీక్షించి వ్రాసుకోవటం వళ్ళ, వీరి కృషి అందరూ చక్కగా అవగాహన చేసుకొని, గుర్తించే అవకాశం ఉంది. జాతీయ సమావేశాలకు లేక వికీమేనియా మొదలైన సమావేశాలకు అభ్యర్ధనలు తయారుచేసుకోవటానికి ఈ ప్రక్రియ లో అనుభవం చాలా వుపయోగపడుతుంది
12)ఎంపికైన 10 సభ్యులకు ర్యాంకులిస్తారా? లేదా ఒక్కో రంగంలో చేసిన కృషి ప్రకారం ఎంపికచేస్తారా? లేదా ఎంపికైన వారందరినీ సమానంగానే పరిగణిస్తారా? ఎంపికైన వారందరినీ సమానంగానే పరిగణిస్తాం.
13)దశమ వార్షికోత్సవం అనేది కేవలం తెవికికే అయిననూ తెవికీ కాకుండా ఇతర తెలుగు వికీప్రాజెక్టులకు కూడా పరిగణిస్తే ఒక్కో ప్రాజెక్టుకు ఎన్ని పురస్కారాలు కేటాయిస్తారు. రెండుమూడు ప్రాజెక్టులలో విశేషకృషి చేసిన వారికి ఒకటికి మించి పురస్కారాలు ఇచ్చే ప్రతిపాదన కూడా ఉందా?
అన్ని ప్రాజెక్టులలో కృషిని సమిష్టిగా పరిగణిస్తాం. పురస్కారాలు ప్రాజెక్టువారిగా కేటాయించబడవు. ఒకటికి మించి ప్రాజెక్టులలో కృషిచేసే వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఉండదు. కానీ ప్రస్తుత విధానంలో వికీపీడియాలో పనిచేసిన వారికి కాస్తా మొగ్గుగా ఉన్నది. దాదాపు ప్రస్తుత సభ్యులందరు వికీపీడియాలో కృషి చేసిన వారే కాబట్టి ప్రస్తుతానికి ఇది అంత సమస్య కాదని అంచనా.
14)పురస్కారాల ఎంపికపై తమకు అన్యాయం జరిగిందని ఎవరైనా సభ్యులు భావించినప్పుడు ఎవరినైనా సంప్రదించే అవకాశం ఉందా? ఎంపిక మండలి నిర్ణయమే తుదినిర్ణమా? ఎంపిక మండలి సభ్యులకున్న ప్రమాణాలేమిటి అనేది తెలుసుకోవచ్చా?
ఏ ప్రకియా పరిపూర్ణం కాదు. ఎంపిక మండలి నిర్ణయమే తుది నిర్ణయం. అందుకే ముందస్తుగానే పారదర్శం ఉంటున్నాము. ఎంపిక మండలి ఎర్పాటు వికీ పద్ధతిలోనే జరిగింది. వికీమీడియా ప్రాజెక్టులలో ఏదో ఒకరూపంలో దీర్ఘకాలంగా కృషిచేస్తున్నావారిని, ఈ ప్రక్రియ కు సమయం వెచ్చించగలిగేవారిని, ఇప్పటికే గుర్తింపువున్న వారిని ఆహ్వానించడం జరిగింది. ఏర్పాటుకు మందు ఏమైనా అభ్యంతరాలు వచ్చినట్లైతే అవి పరిగణనలోకి తీసుకొని మండలి ఏర్పాటు చేయటం జరిగేది. ప్రక్రియ ప్రారంభమయ్యాక, ఎంపికమండలి అర్హతలను ప్రశ్నించడం సబబు కాదు.
15)ఎంపిక ప్రక్రియపై పలువురికి సందేహాలున్నప్పుడు దీన్ని మార్చే అవకాశం ఏమైనా ఉందా? లేదా ఇలాగే కొనసాగిస్తారా? ఇలా మార్చుకుంటూ వెళితే ప్రక్రియ ఎన్నటికీ పూర్తికాదనే సందేహం ఉందా? సరైన ప్రక్రియ ముందుస్తుగా సిద్ధం కానిదే అలాగే ముందుకు వెళ్ళి తర్వాత వివాదాలు తెచ్చుకోవడం భావమేనా?
వీలైనంతగా సముదాయాన్ని అద్దం పట్టడానికి ఒకరు, ఇద్దరు సభ్యులు నిర్ణయించకుండా ఐదుగురు సభ్యులతో ఎంపికమండలి ఏర్పడినది. ఎప్పటికప్పుడు చర్చించిన విషయాలను ఇక్కడ వ్రాస్తున్నాం, ప్రక్రియ ప్రారంభించటానికి ముందే సలహాలు సూచనలు ఆహ్వానించాం. ఎంపిక మండలిలో ఎవరైనా చేరే అవకాశం ఉంది. ఎంపికమండలి వికీలోనే, వికీ పద్ధతిలోనే ఏర్పడింది.