వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ జలవనరులు
స్వరూపం
(వికీపీడియా:WikiProject/ఆంధ్రప్రదేశ్ జలవనరులు నుండి దారిమార్పు చెందింది)
లక్ష్యం
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ లో జలవనరులు, జలసాధనకై ప్రభుత్వాలు చేసిన, చేస్తూన్న పనులు, వివిధ ప్రాజెక్టులు, వాటిపై వచ్చిన, వస్తూన్న వివాదాలు మొదలైనవాటిని రాయడం ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు ప్రాజెక్టు లక్ష్యం. ముందుగా కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులతో మొదలుపెట్టి ఇతర నదులకు ప్రయాణం - పుష్కరుడిలాగా!
విభాగాలు
[మార్చు]- నదులు
- నది వివరాలు
- ప్రాజెక్టులు, వివాదాలు
- జరుగుతున్న కథలు
- ఇతర జలవనరులు (సహజ, మానవ నిర్మిత)
వనరులు
[మార్చు]ఈ ప్రయత్నంలో ప్రస్తుతానికి పూర్తిగా వెబ్ వనరులే ఆధారం. ఉపయోగపడుతున్న వనరులు రెండు రకాలు -
- ప్రభుత్వ వనరులు: ప్రభుత్వ కార్యక్రమాల గురించీ, వాటి గణాంకాల గురించి ఉంటుంది. అయితే ఒక కోణమే కనిపిస్తుంది. అవతలివైపు ఏముందో తెలియజేయవు.
- ప్రైవేటు సైటులు: ప్రాజెక్టుల మరోకోణం చూడాలంటే ఇవి చూడాల్సిందే. సమాచారం విలువైనదైనా, సానుకూల విషయాల గురించి చెప్పేది చాలా తక్కువ. ఎక్కువగా ప్రాజెక్టుల వ్యతిరేకతే కనపడుతుంది.
సైట్లు
[మార్చు]- ఆంధ్ర ప్రభుత్వపు జలవనరుల సమాచారం సైటు (సైటులో పాత సమాచారం ఉన్నప్పటికీ విలువైనది. ప్రస్తుత సమాచారం కావాలంటే మరోచోటు చూసుకోవాల్సిందే. కొన్ని ప్రాజెక్టుల విషయంలో సమాచారం చాలా అస్పష్టంగా ఉంటుంది. ఉదా:ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు. ఉన్న బొమ్మలు అస్సలు బాగాలేవు)
- భారత ప్రభుత్వ నీటి అభివృద్ధి ఏజన్సీ (ఇది నదుల అనుసంధానం గురించిన సమాచారమిస్తుంది. బాగుంది. బొమ్మలు కూడా బాగానే ఉన్నాయి)
- వివిధ పత్రికలు. ముఖ్యంగా ప్రజాశక్తి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, హిందూ
- పరిశోధన వ్యాసాలు
- నిక్కు బాలరాజు గారి పరిశోధనఈ వ్యాసంలో తెలుగుగంగ ప్రాజెక్టుపై రాజకీయాలు, వివాదాల గురించిన సమాచారం ఉంది. బాగానే ఉంది. రాజకీయ విషయాలపై చర్చ ఎక్కువ, విషయం అదే కాబట్టి. అయితే అక్కడా, ఇక్కడా సేకరించిన సమాచారాన్ని కూరారిందులో. అతుకులూ, అస్పష్టతా కనిపిస్తూనే ఉంటాయి.
- ప్రజాశక్తి పత్రిక వారు ప్రచురించిన కృష్ణా నీటిపంపిణీ వాస్తవాలు, పరిష్కారాలు.
- ప్రజాశక్తి వారే ప్రచురించిన పులిచింతల ప్రాజెక్టు వివరాలు పై రెండు PDF ఫైళ్ళలో సమాచారం బాగుంది. అప్పుతచ్చులూ, అంకెల తప్పులూ ఉన్నా, విలువైన సమాచారం ఉంది.
- కృష్ణా బేసిన్ లో నీళ్ళగొడవల గురించిన సమాచారం బాగుంది. కాకపోతే పాత సమాచారం
- ఆంధ్ర ప్రభుత్వ అధికార వెబ్ సైటు. గత ప్రభుత్వం పెట్టిన సమాచారాన్ని, ప్రస్తుతం తొలగించారు. గూగుల్ కాష్ లో ఆ సమాచారం చూడొచ్చు. కాకపోతే సమాచారాన్ని జాగ్రత్తగా వడకట్టి తీసుకోవాలి. అప్పటి ప్రభుత్వపు ప్రభ, ప్రతిభ ఎక్కువగా కనపడవచ్చు.
ప్రాజెక్టు పురోగతి
[మార్చు]ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న వ్యాసాలు:
- ప్రకాశం బారేజి
- నాగార్జునసాగర్ ప్రాజెక్టు
- శ్రీశైలం ప్రాజెక్టు
- తెలుగుగంగ ప్రాజెక్టు
- పులిచింతల ప్రాజెక్టు
- పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్
- మూస:కృష్ణా నదిపై ప్రాజెక్టులు
- ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు
- శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ
- ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు
ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు ప్రాజెక్టు గమనిక
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ జలవనరులకు సంబందించిన అన్ని వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్| జలవనరు=అవును}} అనే మూసను ఒక దానిని చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. అంతేకాదు జలవనరుల వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు.
- అన్నిఆంధ్ర ప్రదేశ్ జలవనరుల యొక్క వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్| జలవనరు=అవును}} అనే మూసను అతికించాలి.