Jump to content

వికీపీడియా:2021 లక్ష్యాలు

వికీపీడియా నుండి
(వికీపీడియా:2021 లో తెవికీ కార్యక్రమాలు నుండి దారిమార్పు చెందింది)

ఎడిటథాన్లు, స్వల్పకాలిక ప్రాజెక్టులూ పెట్టుకుని అందరం కలిసి తెవికీని అభివృద్ధి చేసే పనులు చేస్తూ ఉన్నాం. 2020 లో అలాంటి కార్యక్రమాలు నాలుగింటిని విజయవంతంగా చేసాం. అలాగే 2021లో కూడా అలాంటి ఎడిటథాన్లను, మహానాడులను, సప్తాహాలనూ పెట్టుకునే ఆలోచనను సముదాయం దృష్టికి తెచ్చే ప్రయత్నమే ఇది. ఈ విషయమై వాడుకరులను చర్చకు అహ్వానిస్తూ, చర్చకు ఒక మొదలంటూ ఉండాలి కాబట్టి కింది విషయాలను చేరుస్తున్నాను. వాడుకరులు దీనిపై తమతమ అభిప్రాయాలను, సూచనలను, మార్పుచేర్పులనూ చేర్చవలసినదిగా కోరుతున్నాను. చర్చ కోసం దీని చర్చ పేజీని వాడవలసినది.

కార్యక్రమాల రకాలు

[మార్చు]
  1. మహానాడులు: శని, ఆది - ఈ రెండు రోజుల్లో జరిపే తిరునాళ్ళు. దీన్ని నెలకు ఒకసారి చొప్పున ప్రతి నెలా జరుపుకోవచ్చు. ప్రతిసారీ ఒక్కో అంశాన్ని తీసుకోవచ్చు. లేదా రెండు మూడు అంశాలను తీసుకుని ఎవరిష్టం వచ్చిన పనులు వాళ్ళు చెయ్యవచ్చు. అలా ఈ ఏడు 11 సార్లు ఇది జరుపుకోవచ్చు
  2. సప్తాహాలు: వారం పాటు జరిగేవి.
  3. యజ్ఞాలు: నెల పాటు జరిపేవి
  4. సందర్భానుసారం చేసే పనులు: వివిధ సందర్భాల్లో (పండుగలు, ఎన్నికలు, క్రీడలు, వగైరా), ఘటనల్లో (ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రసిద్ధుల మరణాలు, వగైరా) పేజీలను సృష్టించడం, విస్తరించడం

చెయ్యదగ్గ పనులు

[మార్చు]

పై కార్యక్రమాల్లో ఏయే పనులను తలపెట్టవచ్చో కింది జాబితా సూచిస్తుంది.

  1. మొలకల విస్తరణ
  2. కొత్త వ్యాసాల సృష్టి
  3. ముఖ్యమైన వ్యాసాల విస్తరణ
  4. వ్యాసాల నిర్వహణా పనులు (శుద్ధి, వికీకరణ, మూలాల చేర్పు, అనాథ/అగాధ వ్యాసాల సంస్కరణ,.. వగైరాలు)
  5. అనువాద పరికరం ద్వారా పేజీల సృష్టి
  6. వర్గీకరణ

<<మరిన్ని చేర్చండి>>

ఏయే అంశాలపై రాయవచ్చు

[మార్చు]

పైన తలపెట్టిన పనులను ఏయే అంశాలపై చెయ్యవచ్చో కింది విభాగాల్లో చూడవచ్చు

సందర్భాలు, ఘటనలను బట్టి వ్యాసాలను రాయడం

[మార్చు]

2021 లో రెండు తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా కింది ఘటనలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన పేజీలను సృష్టించడం, విస్తరించడం వంటి పనులను చేపట్టవచ్చు:

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

[మార్చు]
  1. ఫిబ్రవరి: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికలు

<<మరిన్ని చేర్చండి>>

భారతదేశం

[మార్చు]
  1. డిసెంబరు 13: భారత పార్లమెంటుపై ఉగ్రవాద దాడికి 20 ఏళ్ళు
  2. చంద్రయాన్-3 జరగవచ్చు
  3. ఏప్రిల్-మే: కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం లలో శాసనసభ ఎన్నికలు

<<మరిన్ని చేర్చండి>>

ప్రపంచవ్యాప్తంగా

[మార్చు]
  1. జూలై 23 నుండి: జూలై-ఆగస్టు నెలల్లో టోక్యోలో ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి.
  2. ఫిబ్రవరి: నాసా వారి మార్స్ 2020 నౌక అంగారకుడిపై దిగనుంది.
  3. ఫిబ్రవరి: చైనా వారి అంతరిక్ష నౌక కూడా అంగారకుడిపై దిగనుంది.
  4. మే 18:దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం
  5. జూన్: సూర్య గ్రహణం
  6. జూన్ 26 నుండి జూలై 18 వరకు: టూర్ డి ఫ్రాన్స్ - సైకిలు తొక్కుడు పోటీ
  7. సెప్టెంబరు 11: న్యూయార్కు వరల్డ్ ట్రేడ్ సెంటరు టవర్లపై ఉగ్రవాద దాడికి 20 ఏళ్ళు

<<మరిన్ని చేర్చండి>>

వివిధ అంశాల వారీగా

[మార్చు]

వివిధ అంశాల వారీగా కూడా ఎడిటథాన్లు, మహానాడులూ పెట్టుకోవచ్చు. కింది అంశాలు కేవలం సూచనామాత్రమే. (ఇంకా ఇందులో చేర్చండి)

  1. భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో, ఇప్పటి వరకు వచ్చిన తుపానులు
  2. ఆంధ్రప్రదేశ్ తీరం వెంట, భారత దేశ తీరం వెంట ఉన్న దీపస్థంభాలు
  3. భారతదేశంలో జరిగిన ఆర్థిక కుంభకోణాలు
  4. భారతదేశంలోని ఓడరేవుల గురించిన వ్యాసాలు (రేవు పట్టణాలు కాదు)
  5. భారతదేశం లోని స్టాక్ ఎక్స్ఛేంజీల గురించిన వ్యాసాలు
  6. ఆంధ్ర తెలంగాణా నగరాల్లోని ప్రసిద్ధ స్థలాల గురించిన వ్యాసాలు. (ఉదా:డాల్ఫిన్స్ నోస్, జగదాంబ సెంటరు, నాజ్ సెంటరు వగైరా) ప్రస్తుతం హైదరాబాదు నగరం లోని ప్రదేశాలకు అలాంటి వ్యాసాలున్నాయి.
  7. ఆంధ్ర తెలంగాణా ల్లోని సుప్రసిద్ధ వ్యాపార సంస్థలు
  8. ఆంధ్ర తెలంగాణా ల్లోని సుప్రసిద్ధ సాంస్కృతిక సంస్థలు
  9. ఆంధ్ర తెలంగాణాల్లో 2020 లో జరిగిన ప్రసిద్ధ రాజకీయ, సామాజిక, సంస్కృతిక సంఘటనలు
    1. 2020 లో ఆంధ్రప్రదేశ్: ఇక్కడ రాసే ప్రతి అంశానికీ వికీలో పేజీ ఉండాలి
    2. 2020 లో తెలంగాణ: ఇక్కడ రాసే ప్రతి అంశానికీ వికీలో పేజీ ఉండాలి
    3. 2020 లో భారతదేశం: ఇక్కడ రాసే ప్రతి అంశానికీ వికీలో పేజీ ఉండాలి
  10. ఆంధ్ర తెలంగాణాల్లో 2021 లో జరిగిన ప్రసిద్ధ రాజకీయ, సామాజిక, సంస్కృతిక సంఘటనలు
    1. 2021 లో ఆంధ్రప్రదేశ్: ఇక్కడ రాసే ప్రతి అంశానికీ వికీలో పేజీ ఉండాలి
    2. 2021 లో తెలంగాణ: ఇక్కడ రాసే ప్రతి అంశానికీ వికీలో పేజీ ఉండాలి
    3. 2021 లో భారతదేశం: ఇక్కడ రాసే ప్రతి అంశానికీ వికీలో పేజీ ఉండాలి
  11. పద్మ పురస్కార గ్రహీతల పేజీలు ("పద్మ"ధారులకు తెవికీలో ఉన్న పేజీల కంటే కొన్ని వికీల్లో రెట్టింపు పేజీలున్నాయి)
  12. ఆంధ్ర తెలంగాణల్లో మట్టిలో మాణిక్యాలు (అన్‌సంగ్ హీరోలన్నమాట). వీరి గురించి పత్రికల్లో వ్యాసాలు వచ్చి ఉంటాయి.
  13. వివిధ పత్రికలకు పేజీలు సృష్టించడం, విస్తరించడం (దీనికి ఒక ప్రాజెక్టు కూడా ఉంది)

<<మరిన్ని చేర్చండి>>

2021 లో జరిపే కార్యక్రమాల ప్రతిపాదనలు

[మార్చు]

2021 లో మనం ఏయే కార్యక్రమాలను జరుపుకోవచ్చనే విషయమై మీ ప్రతిపాదనలను కింది ఆకృతిలో రాయండి.

# ఎప్పటి నుండి ఎప్పటి వరకు -- ఏ కార్యక్రమం -- ఏ పని -- ఏ అంశం -- ఇతర వివరాలేమైనా -- సంతకం

  1. ఫిబ్రవరి 20, 21 -- మహానాడు -- మొలకల విస్తరణ -- అంశంతో సంబంధం లేదు -- కనీసం 200 మొలకల విస్తరణ -- __చదువరి (చర్చరచనలు)
  2. మార్చి 8 - మార్చి 14 -- సప్తాహం -- కొత్త వ్యాసాల సృష్టి -- అంశం ఏదైనా కావచ్చు -- ఒక్కొక్కటీ కనీసం 6 కెబి ల పరిమాణంతో కనీసం 200 కొత్త వ్యాసాలను సృష్టించాలనే లక్ష్యంతో __చదువరి (చర్చరచనలు)
  3. ఏప్రిల్ 1 - 30 -- యజ్ఞం -- మొలక వ్యాసాలు అభివృద్ధి -- సంబందిత వర్గాలలో ఉన్న ఏ వ్యాసాలు అయినా -- ఒక్కొక్కటీ కనీసం 6000 బైట్ల పరిమాణానికి మించి, తగిన మూలం లేదా మూలాలుతో విస్తరించటం. కనీసం 2000 వ్యాసాలు విస్తరణ లక్ష్యంతో (గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో మొదటిసారిగా చేశాం. మొలకపేజీల నియంత్రణ విధానం 2013 ఏప్రిల్ 1 నుండి (ఇదే తేదీ నుండి) అమలులోకి వచ్చిన సందర్బంగా ఈ కార్యక్రమం ప్రతిపాదించాను. __యర్రా రామారావు (చర్చరచనలు)
  4. మే మొదటి వారం -- మూలాలు లేని పేజీలను గుర్తించి, కనీసం ఒక వనరును మూలంగా చేర్చాలి. --రహ్మానుద్దీన్ (చర్చ) 17:28, 23 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఇవీ చూడండి

[మార్చు]