బెంగుళూరు లో తెవికీ కార్యక్రమాలు, సభ్యుల వృద్ధి.. అందరు
తెవికీలో సమస్యలు పరిష్కారాలు.. అందరు
తెలుగువారి కుటుంబాలలో సంబంధబాంధవ్యాలు.. అందరు
<విషయం చేర్చండి>
సూచనలు: బెంగుళూరులో వున్న వారు తప్పక నోట్ బుక్ లేక టాబ్లెట్ కంప్యూటర్లు తెచ్చుకుంటే ప్రత్యక్షంగా సమస్యల పరిష్కారానికి వీలవుతుంది.
ప్రత్యక్షంగా పాల్గొనలేనివారికోసం గూగుల్ హేంగౌటు ప్రయత్నించబడుతుంది. వివరాలకు సమావేశసమయానికి వెబ్ ఛాట్ లో #wikimedia-in చానల్ లేక ఇదే పేజీలో చూడండి.
అర్జున, రవిచంద్ర, శశి లతో బాటు, ప్రముఖ జీవసాంకేతిక పరిశోధకులు, ఆచార్యులు మరియు అరవిందుల రచన సావిత్రిని తెలుగు అనువాదం చేసిన డాక్టర్ టి రామకృష్ణ గారు మరియు వై.ఎస్.ఆర్ జిల్లావిద్యాశిక్షణ సంస్థ తెలుగుఅధ్యాపకులు గుడిపాటి నారాయణ గారు హాజరయ్యారు.
ప్రణాళిక ప్రకారం స్వాగత, పరిచయాల తర్వాత, అతిధులకి తెవికీ ప్రాజెక్టు, దాని ఉపయోగాలు, వ్యాసాల శోధన, సవరణ, సహాయ సహకారాలు, పరస్పర క్రియలపై టూకీగా ప్రదర్శనాపూర్వకంగా ఒక అవగాహనని ఇవ్వటం జరిగినది.
వికీ సోదర ప్రాజెక్టులైన కామన్స్, విక్షనరీ, వికీసోర్స్, వికీకోట్ల పై కూడా అవగాహనని ప్రదర్శనాపూర్వకంగా ఇవ్వటం జరిగినది.
అతిధుల సందేహాలని అర్జున, రవిచంద్ర, శశి లు సోదాహరణలతో నివృత్తి చేశారు.
రామకృష్ణ గారు తెలుగువికీ అభివృద్ధికి సమాంతరంగా పరిపాలన వ్యవహారాలలో తెలుగు వాడుకని పెంచాలని, దానికి పనిచేస్తున్న సంస్ధలు, అధికారులతో సంప్రదింపులు చేయాలని సూచించారు.
నారాయణ గారు, తెలుగు బోధనా రంగంలో ప్రమాణాలు పెంచడానికి తెలుగు వికీపీడియా బాగా సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు.
రామకృష్ణ మరియు నారాయణ గార్లు తమ తమ అనుబంధ సంస్థలలో వికీ అవగాహన సదస్సులు నిర్వహించడానికి తోడ్పడతామని హామీ ఇచ్చారు.
బెంగుళూరు లో ప్రతి రెండవ శనివారం (జులైనుండి) మధ్యాహ్నం తెలుగు వికీ అవగాహనను పెంచడానికి మరియు పలురంగాలలోనున్న తెలుగు ప్రముఖులను దీనిలో భాగస్వాములని చేయాలని సంకల్పించడమైనది.