వికీపీడియా:సమావేశం/జూన్ 9,2013 సమావేశం
స్వరూపం
తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.
వివరాలు
[మార్చు]- ప్రదేశం : థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్
- తేదీ : 09:06:2013; సమయం : సా 3 నుండి 6 వరకూ.
సమావేశం నిర్వాహకులు
[మార్చు]సమావేశంలో పాల్గొన్నవారు
[మార్చు]- రహ్మానుద్దీన్
- రాజశేఖర్
- నాగేశ్వరరావు
- భాస్కరనాయుడు
- ప్రణయ్‌రాజ్
- మల్లాది కామేశ్వరరావు
- పందిళ్ల శేఖర్‌బాబు
- బండి.శ్రీనివాస్ శర్మ
చర్చించిన అంశాలు
[మార్చు]- తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు పరిశీలన. సుమారు వెయ్యి మంది ప్రముఖుల జీవితచరిత్రలు ఒక వేదిక మీదకు వచ్చాయి. వానిలో 80 శాతం వ్యాసాలు మొలక స్థాయిలో ఉన్నాయి. ఈ నెల మొలక అభివృద్ధిమీద దృష్టి పెట్టాలని సూచించారు.
- ఆంధ్ర మహాభాగవతము పూర్తి పాఠం మరియు ఆడియో వికీసోర్సులో చేర్చుట. నెట్ లో సాంబశివరావు గారితో సమావేశంలో ఉండగానే మాట్లాడి వారి అనుమతి తీసుకొవడం జరిగింది. అయితే ఆయన సూచించిన మేరకు పోతన భాగవతాలు తొమ్మిది రకాలుగా ఉన్నాయని; తన కృషిని ప్రత్యేకంగానే వుంచమని కోరారు. ఆ విధంగా పోతన తెలుగు భాగవతము అని సాంబశివరావు గారి పేరుమీద ఈ మొత్తం అంతా వికీసోర్సులో ఉంచడానికి అంగీకరించారు. తెలుగు అకాడమీ వారి భాగవతంతో కలపవద్దని మనవిచేసుకున్నారు.
- మొదటి పేజీ - మార్పులు చేర్పులు - అభిప్రాయాలు. ఒక్కొక్కరి అభిప్రాయాలను తెలియజేయమని; అన్నింటిని పరిశీలించిన పిమ్మట తగినవిధంగా మార్పులు చేయవచ్చునని నిశ్చయించాము.
- ఇంతవరకు రాసిన వ్యాసాలు, ఇకపై రాయాలనుకుంటున్న వ్యాసాల గురించిన చర్చ.
- శేఖర్‌బాబు మరియు పి.ఆర్.ఎస్. శర్మ గారు ఈసారి కొత్తగా చేరారు.
- విద్య - ఉపాధి తదితర అంశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించడానికి బండి శ్రీనివాస శర్మ ప్రతిపాదించగా మల్లాది గారు సమర్ధించి; అందరి ఆమోదంతో తెలుగు వికీపీడియాను నేటి యువతకు చేరువచేయడానికి; అంతర్జాల మాధ్యమంలో అందరికీ ఈ పోటీ వివరాలు తెలియజేయడానికి అంగీకరించాము. ఈనెల విద్య-ఉపాధి ప్రాజెక్టును సైట్ నోటీసులో ఉంచడానికి కూడా తీర్మానించాము. ఎనిమిది ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. పోటీ విధివిధానాలు నిశ్చయించాము.
- తెలుగు విక్షనరీలో తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు చేరిక పూర్తయిందని భాస్కరనాయుడుగారు తెలియజేశారు. తర్వాత తెలుగు అకాడమీవారి తెలుగు నిఘంటువు నుండి శాస్త్రవిజ్ఞానానికి చెందిన పదాలను చేర్చడం మొదలుపెట్టారు. ఒక వారంలో అది పూర్తవుతుంది. ఇంటిపేర్లు; మహిళల పేర్లు మరియు పురుషుల పేర్లకు ఆంగ్ల విక్షనరీలో మాదిరిగా అనుబంధాలను స్టీఫెన్ బ్రౌన్ సహకారంతో విక్షనరీలో చేర్చడం అయింది. తెలుగువారి పేర్లను అన్నింటినీ ఈ విభాగాలలో చేర్చవచ్చును.
- శేఖర్ బాబు గారి వద్ద నాటకరంగానికి చెందిన వీడియోలు 250 పైగా యూట్యూబ్ లో ఉంచినట్లు తెలియజేశారు; వాటిని వికీలో చేర్చడానికి చర్చించాము. అలాగే హిందూ దేవాలయాల గురించిన సమాచారం చాలా ఉన్నది.
- తెలుగు వికీపీడియా ప్రచారం కోసం బండి శ్రీనివాస శర్మ గారివద్ద నున్న 50,000 పైగా ఈమైల్ అడ్రసులకు సందేశం పంపడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను చర్చించాము.
- తెలుగు వికీలో ఏకవచన ప్రయోగం ద్వారా మీడియాలో కలిగిన ఇబ్బంది గురించి మల్లాది గారు తెలియజేశారు. దానిని వీలైనంత త్వరగా నిర్ణయాత్మకంగా మార్చకపోతే మీడియా నుండి ఎవరు కూడా వికీలో రచనలు చేయడం కష్టమని హెచ్చరించారు.
- పి.ఆర్.ఎస్.శర్మ గారిని భాస్కరనాయుడు గారు పరిచయం చేశారు. వీరికి భక్తి సమాచారం సేకరణ; పుణ్యక్షేత్రాలు దర్శించడం ప్రవృత్తి. ఆవిధంగా తెవికీ లో అకౌంట్ సృష్టించుకున్నారు.
చిత్రమాలిక
[మార్చు]-
ఊలపల్లి సాంబశివరావు (భాగవత గణనాధ్యాయులు) గారితో వెబ్ కాల్ లో చర్చ
-
తెవికీ సభ్యులు
-
తెవికీ సభ్యులు
-
తెవికీ సభ్యులు
-
తెవికీ సభ్యులు