Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020/సమీక్ష

వికీపీడియా నుండి

మూడు నెలల ప్రాజెక్టు విజయవంతంగా ముగిసింది. ప్రాజెక్టు లక్ష్యాన్ని అధిగమించి దాదాపు 40% అధికంగా పని జరిగింది. ఇది సామూహికంగా మనందరి విజయం. విజయవంతంగా జరిగిన పనిలో లోపాలు, అడుక్కు పోయి తరచి చూస్తే గానీ బయటికి రావు. సరిగ్గా జరగని పనిలో లోపాలు పైకి తేలుతూ తేలిగ్గా కనిపిస్తూంటాయి. ప్రాజెక్టు విజయవంతమైంది గదా అని అంతా బాగుందని అనుకోలేం. లోపాలు దొర్లి ఉండవచ్చు. వాటిని ఇక్కడ సమీక్షించుకుందాం. రాబోయే ప్రాజెక్టులకు మన ఈ లోచూపు పనికి రావచ్చు. అలాగే భవిష్యత్తు గురించి కూడా కొంతాలోచన, కొంత ముందాలోచన, వీలైతే కొత్తాలోచన చేద్దాం. మన ఆలోచననలను మూడు విభాగాల్లో పేర్చుదాం. మీ పేరు రాసి మీ ఆలోచన రాయండి. మూడు విభాగాల్లోనూ రాయండి. ఏదో ఒకటో రెండో విభాగాల్లో రాసినా పర్లేదు. మనకు వచ్చిన ఆలోచనే మరొకరికి వచ్చి ఈసరికే రాసినా సరే, ఏం పర్లేదు, మళ్ళీ రాయండి. మనవరకు అది కొత్తాలోచనే.

ప్రాజెక్టు ఎలా జరిగింది

[మార్చు]

ప్రాజెక్టు ఎలా చేసాం, ఎలా చేసాం, ఎలా చేసి ఉండాల్సింది.. వగైరా విషయాలను ఇక్కడ రాయాలి

  1. ప్రభాకర్ గౌడ్ నోముల: అభినందనలు... శుభాకాంక్షలు... మీ రాకెట్ వేగానికి తిరుగులేదని మరోసారి చదువరి గారు, గురువు గారు వెంకటరమణ గార్లు, రోజుకు 10 చొప్పున, 90 రోజులకు 900 విస్తరించి ఔరా! అని అందరికీ ఆశ్చర్యం కలిగించారు ... ఎన్నో సంవత్సరాలు ఒక్క లైను, రెండు లైన్లు ఉన్న వ్యాసాలను చూసి, చూసి మీలో ఆ కసి ఈ మూడు నెలల సమయంలో ఇతర పనులు యధావిధిగా వికీలో చేస్తూనే కలంతో యుద్ధం చేసి వీర విజయాన్ని అందుకున్నారు. ఓకే నెంబర్ దగ్గర నిలబడి ఇద్దరు కూడా ఒకరంటే ఒకరికి ప్రేమ, అనురాగం మా అభిమానం కూడా అందుకున్నారు. మిమ్మల్ని ఇంకా పొగడాలని ఉంది. కానీ 4 సెంచరీలు చేసిన మన టెండూల్కర్ యెర్ర రామారావు గారు తక్కువేమీ కాదు కదా, మరియు డబల్ సెంచరీ చేసిన ప్రణయ్‌రాజ్ గారు సెంచరీ చేసిన స్వరలాసిక గారు రవిచంద్ర గార్లు, ఫాస్టెస్ట్ ఏకంగా సెంచరీ చేసిన వీరేంద్ర సేవాగ్ కశ్యప్ గారిని...ప్రత్యేకంగా అభినందించాలి, లంకకు వారధి లో సహాయంగా ఉడతాభక్తిగా నేను, నా గురువు పవన్ సంతోష్ గారు, మహేశ్వరరాజు గారు అభినందనలు...  ప్రభాకర్ గౌడ్ నోముల 15:32, 1 సెప్టెంబరు 2020 (UTC)బాగా చేసాం.[ప్రత్యుత్తరం]
  1. చదువరి: బాగా చేసాం. ఆ సంగతి ప్రాజెక్టు ఫలితంలో తెలిసిపోతోంది. ఇంకా బాగా చేసి ఉండాల్సినవి కొన్నున్నై
    1. మెరుగైన ప్లానింగు: ప్రాజెక్టు ప్లానింగు ఇంకొంచెం బాగుండాల్సింది. ఇలాంటి బృహత్తరమైన ప్రాజెక్టు - దాదాపు 3000 పేజీలను స్పృశించే ప్రాజెక్టు - చేసే ముందు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటుంది: ఈ పేజీలు ఒక పద్ధతిలో ఉండకపోవచ్చు, కొన్ని వికీ నియమాలను అతిక్రమిస్తూ ఉండవచ్చు కూడా. ఉదాహరణకు, సరైన వర్గీకరణ లేకుండా, మూలాల్లేకుండా, విషయ ప్రాధాన్యతే లేకుండా.. ఈ విధంగా ఉండవచ్చు. కాబట్టి ఈ పేజీల విషయంలో తీసుకోవాల్సిన చర్యలు ముందే స్పష్టంగా నిర్వచించుకోవాలి. వర్గీకరణ లేనివాటిని వర్గీకరించాలి, దానికి నియమాలను నిర్దేశించుకోవాలి. వికీ నియమాలను అతిక్రమించేవాటిని ఏం చెయ్యాలనే పద్ధతిని నిర్వచించుకోవాలి. అదయ్యాకే ప్రాజెక్టు మొదలవ్వాలి. మనం ఈ ప్రాజెక్టు ప్రిపరేషను మీద పెట్టిన సమయం రెండు రోజులు. ఆ రెండ్రోజుల్లో వర్గీకరణ చేసుకున్నాం. సుమారు 3500 (సినిమా, గ్రామాలు ముందే రామారావు గారు చేసి ఉంచారు) పేజీలను 40 వర్గాల్లోకి చెయ్యడానికి రెండు రోజులు సరిపోదు. అందుచేతనే వందకు పైగా పేజీల వర్గాలను మార్చాల్సి వచ్చింది. ఇంకోటి - జాబితా పేజీలను ఏం చెయ్యాలి అనేది తేలలేదు. అది ఇంకా తేలకుండా అలాగే ఉంది. అలాగే పని నిర్వచనంలో 5000 కెబి అనేది తప్పనిసరి కాదు అని స్పష్టంగా చెప్పలేదు. కృషి పేజీ రూపకల్పనను తరువాత కొద్దిగా మార్చాం. ఆ సంగతి అందరికీ చెప్పలేదు. చెప్పి ఉండాల్సింది.
    2. సభ్యులకు అవగాహన: ప్రాజెక్టు మొదలయ్యే సమయానికి సభ్యులందరికీ ప్రాజెక్టు లక్ష్యాలు, పని, చేసే విధానం వగైరాల పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎక్కడైనా సందేహాలు వచ్చినపుడు అడగాలి, వాటిపై స్పష్టత రావాలి. అలాంటి చర్చేమీ జరగలేదు.2
    3. చర్చలు: సభ్యులు ముందుకు వచ్చి ధారాళంగా చర్చలో పాల్గొనాలి. వికీలో చర్చలే ప్రగతికి మార్గం అనేది ప్రాథమిక సూత్రం. ఆగస్టు కోసం సినిమా పేజీల్లో సూచనలు కావాలి అని అడిగినపుడు ముగ్గురు వెంటనే స్పందించారు. అది ఈ ప్రాజెక్టు చర్చల్లో అతిపెద్ద వెలుగు. వారి సూచనలు ప్రాజెక్టుకు ఎంతో మేలు చేసాయి. ఆగస్టులో జరిగిన పనే దానికి తార్క్జాణం. కానీ, మొత్తమ్మీద సభ్యులు పెద్దగా చర్చల్లో పాల్గొనలేదు. గణాంకాలు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే, వాటిపై ఎవరూ పెద్దగా స్పందించేవాళ్ళు కాదు. పెద్ద చర్చ ఏమీ చెయనక్కర్లా.. ఓహో అని తలపంకించవచ్చుగా!? ఓ, అలాగా అనొచ్చుగా!?. అసలు చూసారో లేదో తెలీదు. ఇకపై గణాంకాలు ఇవ్వాలా వద్దా అనే సందేహం వచ్చింది. మధ్యలో కొన్నాళ్ళు ఆపేసాను కూడా. నెలవారీ ప్రగతి నివేదిక గురించి ఎవరూ మాట్లాడలా. జూన్ నెలాఖరులో, ఇక ముందు ప్రాజెక్టు మందగిస్తుందేమో అని సందేహిస్తూ, అలా జరక్కుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చర్చిద్దాం రండి అంటే ఒక్కరూ ముందుకు రాలేదు. చివర్లో ప్రతీరోజూ గణాంకాలు ఇద్దామనుకున్నాను గానీ ఇవ్వలేకపోయాను. ఇస్తానన్నావుగా ఇవ్వడం లేదే అని ఎవరూ అడగలా. ప్రాజెక్టు మనది అని అనుకోవాలి అందరూ. యర్రా రామారావు గారు లేకపోతే నేను ఒంటరినని ఫీలయ్యేవాణ్ణి బహుశా.
    4. కృషి నివేదికలు: ప్రాజెక్టు సభ్యులు ఎప్పటి కప్పుడు తమ కృషిపై నివేదికలు ఇస్తూ ఉండాలి. ఈ ప్రాజెక్టులో పాల్గొని ప్రధానమైన పని చెసిన వారంతా చాలా ప్రాంప్ట్‌గా తమ కృషిని నమోదు చేసేసారు. ఏరోజుకారోజు రోజుకు మూణ్ణాలుగు సార్లు కూడా తాజాకరించేసేవాళ్ళు. కొందరు సభ్యులు మాత్రం కృషి పేజీల్లో తమ పనిని నమోదు చెయ్యలేదు. నేను వెతుక్కుని వాటిని నా ఎక్సెల్ షీటులో ఇతరులు అనే షీటులో చేర్చుకున్నాను. అయితే నాకు కనబడనివి, నా దృష్టిలోకి రానివి కూడా ఉంటే ఉండొచ్చు.
    5. నాణ్యత: ఇలాంటి ప్రాజెక్టుకు వేగం కీలకం. అంత మాత్రాన నాణ్యతను బలిపెట్ట కూడదు. నాణ్యతలో కొంత లోటు ఏర్పడితే అర్థం చేసుకోవచ్చు కానీ మృగ్యం కాకూడదు. సముదాయం నిర్ణయాలను, అభిప్రాయాలను, సూచనలనూ త్రోసిరాజన రాదు. ఇకముందు ప్రాజెక్టుల్లో నాణ్యతను ప్రత్యేకించి నిర్వచించుకోవాలనుకుంటాను.
    6. వ్యవధి: మూణ్ణెల్ల కాలం కొంచెం ఎక్కువ అని నాకు అనిపించింది. బహుశా పైన నేను రాసిన "చర్చలు" అనే అంశంలో లోటు లేకుండా ఉండి ఉంటే కాలం ఎక్కువ అని అనిపించి ఉండేది కాదేమో. __చదువరి (చర్చరచనలు) 04:59, 2 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు ఈ ప్రాజెక్టులో జరిగిన లోపాలు ఘంటాపదంగా చెప్పారు.లోపాలు ఎప్పుడూ అభివృద్ధికి సోపానాలు.అందరం అంగీకరించాల్సిందే.గణాంకాలు అందరూ ఆసక్తిగానే చూస్తారుగానీ,ఒక్క మాట రాయటానికి నాతో సహ అందరికీ బద్ధకం. అంతేగానీ వేరే ఉద్దేశం ఎంత మాత్రం కాదు.ఇక ముందు అలాంటి పొరపాట్లు జరగకుండా అందరం జాగ్రత్తపడదాం.ప్రాజెక్టుకు గణాంకాలు ఆయువుపట్టు.ఎంత చేసినా అవి లేకపోతే ఎవరికి వారు వారు చేసిన పని వారికే తెలియని పరిస్థితి ఉంటుంది.--యర్రా రామారావు (చర్చ) 04:19, 4 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  1. కె.వెంకటరమణ: ఈ ప్రాజెక్టు సమిష్టి కృషితో బాగా చేసాం. ఇది వరకు జరిగిన ప్రాజెక్టుల కంటే ఈ ప్రాజెక్టులో వేగంతో పాటు ఖచ్చితత్వంతో వ్యాసాలు అభివృద్ధి చేయడం గమనించాను. కొన్ని అనువాద వ్యాసాలలో దోషాలుంటాయి. వాటిని సరిదిద్దుకోవాలి. ఈ ప్రాజెక్టు నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ వ్యాస విస్తరణలో పడి మిగిలిన వికీ కార్యక్రమాలను కూడా పట్టించుకోలేదు. అంతగా నిమగ్నమయ్యాను. ఈ సందడిలో మొదటి పేజీలో "36వ వారం వ్యాసం" "మీకు తెలుసా 35వ వారం" లు ఎవరూ సృష్టించకుండా వదిలేసారు. సోమవారం ఖాళీగా ఉన్న 36వ వ్యాసం అర్జున సృష్టించారు. అంతగా సభ్యులు ఈ విస్తరణ ఋతువులో నిమగ్నం అయ్యారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తే మరిన్ని నాణ్యమైన వ్యాసాలు వికీలోకి చేరుతాయి.
    1. ఈ కార్యక్రమానికి ప్లానింగు చాలా కొద్ది సమయంలో జరిగింది. చాలా ముందుగా ప్లానింగు చేసుకొని వనరుల గురించి చర్చిస్తే వ్యాసాలు ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందేవి. కొన్ని మొలక వ్యాసాలకు మొలక మూసను చేర్చక పోవడం కూడా గమనించాను. నేను చేర్చి విస్తరించాను. సినిమా వ్యాసాల అభివృద్ది గురించి కొన్ని వనరులను సభ్యులు ఆగస్టులో అందించారు. అవే ముందుగా తెలియజేసి ఉంటే సినిమా వ్యాసాలన్నీ అభివృద్ధి చెందేవి. అయినా సగం మొలకలను వృద్ధి చేయగలడం సంతీషించదగ్గ విషయం. నేను ముందుగా వ్యక్తుల వ్యాసాలను మొదలు పెట్టాను. నేను ఎక్కువగా అనువాద వ్యాసాలపై ఆధారపడలేదు. వ్యక్తుల వ్యాసాల కొరకు వారు రాసిన పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ నుండి తీసుకొని వాటిలో ఉన్న ముందుమాటలో ఆ వ్యక్తుల గూర్చి ఉన్న సమాచారాలను చేర్చడానికి ఎక్కువగా కృషి చేసాను. సినిమా వ్యక్తుల గురించి ఆన్ లైన్ లో ఉన్న సితార, జ్యోతిచిత్ర వంటి సంచికల చిత్రాలు లభ్యమగుట చేత వాటిలోని సమాచారాన్ని చేర్చాను. రవిచంద్రగారు తెలియజేసిన సినిమా వెబ్‌సైట్ బాగా ఉపయోగపడింది. అందులో సినిమాకు సంబంధించిన లేని అంశంలేదు. అన్ని విషయాలూ ఉన్నాయి. పాత సినిమాలకైతే పాటల పుస్తకాలు, సినిమా సమీక్షలు కూడా అందులో ఉన్నాయి. వాటి ఆధారంగా సినిమా వ్యాసాలను అభివృద్ధి చేయగలిగాను. ఆ వెబ్‌సైట్ తెలియజేసిన రవిచంద్ర గారికి ధన్యవాదాలు. కొన్ని సినిమాలకైతే సినిమాను యూ ట్యూబ్ లో చూసి తారాగణం, సాంకేతిక వర్గం విషయాలను చేర్చాను. నేను గూగుల్ అనువాదాలపై ఎక్కువగా దృష్టి పెట్టలేదు. చాలా వరకు మూలాలను పరిశోధించి రాసాను. కొన్ని వ్యాసాలు 5000 బైట్లను దాటించగలిగితే మరికొన్నిండికి మొలక స్థాయి దాటించడమే కష్టతరమైంది.
    2. సభ్యుల సమిష్టి కృషి చాలా ఆనందాన్నిచ్చింది. చదువరి గారు అందించిన నివేదికలు, మొలక స్థాయి సమీపంగా ఉన్న వ్యాసాల జాబితాలు, తెలుగు సినిమా వ్యాసాలకు ఆంగ్లంలో ఉన్న వ్యాసాల జాబితాలు, ప్రతీ నెలలో మరిన్ని ఎక్కువ వ్యాసాలను రాయడానికి తగిన సూచనలు అందరికీ ఎంతో ఉపయోగపడ్డాయి. వ్యాసాలు రాస్తూనే నివేదికలు తయారుచేస్తూ, అందరికీ మార్గనిర్దేశం చేసిన చదువరిగారికి ధన్యవాదాలు. రోజుకొక వ్యాసం రాసే రికార్డులు సృష్టిస్టూనే ప్రాజెక్టులో అనేక వ్యాసాలు విస్తరించిన ప్రణయ్ రాజ్ గారికి ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టు రూపకల్పనకు మూలమైన మొలక వ్యాసాలను గుర్తించి, వాటిని జాబితాగా చేసి వాటిని వర్గీకరించడమే కాక అనేక గ్రామవ్యాసాలను, ఇతర వ్యాసాలను వృద్ధి చేసిన రామారావు గారి కృషి అభినందనీయం. ప్రాజెక్టులో భాగంగా అధిక సమాచారంతో నాణ్యమైన వ్యాసాలను అందించిన ( 25 పేజీలను విస్తరించి ఒక్కో పేజీలో సగటున 22,897 బైట్లు చేర్చారు) నోముల ప్రభాకర గౌడ్ గారికి అబినందనలు. ఒక్క రోజులో అనేక నాణ్యమైన వ్యాసాలతో అత్యధిక బైట్లు చేర్చిన కశ్యప్ గారికి ధన్యవాదాలు. వ్యాసాలను అభివృద్ధి చేయడమే కాక ఆగస్టు నెలలో సినిమా వ్యాసాల పురోగతికి మంచి వనరుల సూచనలు చేసిన రవిచంద్ర, స్వరలాసిక గార్లకు ధన్యవాదాలు. K.Venkataramana(talk) 04:19, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారూ మీరన్నట్లు ప్లానింగుకు ఇంకాస్త సమయం తీసుకుని ఉంటే పాల్గొనే వాడుకరుల ఆలోచనలు,అభిప్రాయాలకు ఆస్కారం ఉండటానికి బాగుండేది.ఇది ముందు జరగబోయే ప్రాజెక్టులకు మంచి సూచన.--యర్రా రామారావు (చర్చ) 04:39, 4 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

4.యర్రా రామారావు:

  • ప్రాజెక్టు రూపకల్పన జరిగిన తీరు
1.నేను నిర్వాహకునిగా కాక ముందు వెంకటరమణ గారు ఎక్కువుగా వికీపీడియా నిర్వహణలో భాగంగా తొలగింపులు ఎక్కువుగా చేసేవారు.చదువరి గారు ఇంకాస్త తక్కువుగా చేసేవారు.వెంకటరమణ గారు తొలగింపులు చూసి ఇతనికి ఏమి పనిలేదా అనిపించేది. కానీ వెంకటరమణగారు ప్రతిపాదనతో నేను నిర్వాహకత్వం పొందినాక ఎందుకు తొలగించాల్సివస్తుందో నాకు అప్పుడు అర్ధం అయింది.తొలగింపులకు ఎక్కువుగా ప్రతిపాదన చేస్తున్నందుకు నాకు, చదువరి, ప్రణయరాజ్, వెంకటరమణ గార్లకు అందరికి కలిపి ఒక అనుచిత బిరుదు కూడా ఇవ్వటం జరిగింది.ఇవ్వన్నీ ఇక్కడ అప్రస్తుతం అనిపించవచ్చు.కానీ చెప్పాల్సిన అవసరముంది.వీటిని తొలగించటానికే సమయం సరిపోతుంది.తొలగింపు చర్చలలో స్పందించకుందా తొలగించినప్పుడు అభ్యంతరాలు లేవనెత్తటం జరుగుతుంది.నాకు ఎందుకో అసలు ఇలాంటివి ఎన్ని మొలకలు ఉన్నవిఅనే జాబితా తయారు చేయాలనిపించింది.నేను ఎక్కువుగా ప్రత్యేక పేజీలు చూసి,వాటిని తగు విధంగా అవసరమైన చర్యలు తీసుకునే అలవాటు ఉంది.అందులో భాగంగా ప్రత్యేక పేజీలులులోని చిన్న పేజీలు విభాగంలో పరిశీలించగా మొదటి సినిమా వ్యాసం టీనేజ్ 203 బైట్సుతో మొదలైన జాబితా నుండి మొలక స్థాయికి చెందిన ఈ వ్యాసాలన్నీ 2048 బైట్సులోపు 2020 మే 13 నుండి మొదలుపెట్టి సుమారు 15 రోజులుకు తుది జాబితా 6653 వ్యాసాలకు తయారు చేయుట జరిగింది.ఈ మధ్యలో నేను చేసే పనిని చదువరి గారు గమనించి ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి అని అడుగుటకూడా జరిగింది.వాటిలో సినిమా వ్యాసాలు,గ్రామ వ్యాసాలుకు విడిగా జాబితాలు తయారు చేసాను.జాబితా పేజీలుఅయితే తయారైనవి.వీటిని ప్రాజెక్టుగా పెట్టి విస్తరించాలంటే నాకు ఉన్న పరిజ్ఞానం చాలదని, ప్రాజెక్టుల నిర్వహణలో నిష్ణాతుడైన చదువరి గారిని సంప్రదించి, నామీద ఉన్న బరువును వారి నెత్తిమీద పెట్టాను.ఈ ప్రాజెక్టు నిర్వహణలో చదువరి గారు చేసిన పని అంతా ఇంత కాదు.ఒక పక్క వ్యాసాలు విస్తరిస్తూ, గణాంకాలు ఎప్పటికప్పుడు అందిస్తూ, వర్గీకరణలో జరిగిన పొరపాట్లు సవరిస్తూ, వాడుకరులకు తగిన సూచనలు చేస్తూ,విస్తరణ తగ్గుతున్న సమయంలో వాడుకరులను ప్రోత్సహిస్తూ చేసిన శ్రమతో పోల్చుకుంటే నేను జాబితాలు చేసిన పని చాలా చాలా తక్కువ.
  • ప్రాజెక్టు ముఖ్యాంశాలు
2.ప్రాజెక్టులో అన్నీ సంతృప్తికరమైన విషయాలే. అందరూ సమిష్టిగా ఈ ప్రాజెక్టులో పాల్గొనటం సంతోషకరం.అనుకున్న టార్గెటుకు మించి వ్యాసాలు విస్తరించుట అన్నిటికన్నా మించిన సంతోషం.వెంకటరమణగారు వ్యక్తుల వ్యాసాలు, సినిమా వ్యాసాలు ఎక్కువ విస్తరించటం, 900 వ్యాసాలు విస్తరించటం, అలాగే చదువరి గారు 900 వ్యాసాలు విస్తరించటం ఈ ప్రాజెక్టులో హైలెట్.స్వరలాసిక, ప్రణయరాజ్, రవిచంద్ర గారలు సినిమా వ్యాసాల వారు విస్తరిస్తూ, టార్గెట్ తగ్గే సమయంలో మంచి కిటుకు చెప్పి సినిమా వ్యాసాలకు ఒక స్థాయి కల్పించటం రెండవ హైలెట్. 25 పేజీలను విస్తరించి ఒక్కో పేజీలో సగటున 22,897 బైట్లు చేర్చిన నోముల ప్రభాకర గౌడ్ గారికి, మహేశ్వరరాజుగార్కి, ఒక్క రోజులో 54 వ్యాసాలలో అత్యధిక బైట్లు చేర్చిన కశ్యప్ గారికి, ప్రాజెక్టులో పాల్గొనిన ఇతర వాడుకరులకు అందరికీ ధన్యవాదాలు. వికీలో జరిగే ప్రతి ప్రాజెక్టు పనిలో ఇదే స్పూర్తితో మనందరం సమిష్టి కృషితో కొనసాగాలని మనసారాకోరుతూ--యర్రా రామారావు (చర్చ) 07:15, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

5. ప్రణయ్‌రాజ్ వంగరి: మొలక వ్యాసాల విస్తరణలోని విధివిధానాలు (విస్తరణకు నిర్వచనం) సరిగా అమలుకాకపోవడం, వ్యాసాల నాణ్యతలో కొంత లోటు ఏర్పడడం వంటివి వాస్తవం. ఈ ప్రాజెక్టులో నేను ఇంగ్లీష్ వికీపీడియాలో పేజీలు ఉన్న పౌరాణిక, సినిమా తెవికీ మొలక వ్యాసాలనే ఎక్కువగా విస్తరణకు వాడుకున్నాను. ప్రతి వ్యాసం 5వేల బైట్లు, 2 లేదా 3 మూలాలు, ఇన్‌కమింగు లింకులు-అంతర్వికీ లింకులు, వర్గాలు ఉండేలా వ్యాసాలు విస్తరణ చేశాను. అంతేకాకుండా సినిమా వ్యాసాలను విస్తరణ చేసేటప్పుడు ఆ సినిమాలోని నటినటులు, సాంకేతిక నిపుణుల వికీ పేజీల్లో కూడా ఆయా సినిమా పేరు రాసి అంతర్వికీ లింక్ ఇచ్చి, మూలాలు కూడా చేర్చేవాడిని, ఆయా పేజీల వికీడాటలో వ్యాస సారాంశాన్ని కూడా రాసేవాడిని. ఆగస్టు 12వ తేదీ వరకు అలాగే చేశాను. అప్పుడు రోజుకు 4, 5 వ్యాసాల విస్తరణే నాకు సాధ్యమయ్యేది. ఎందుంటే పేజీ విస్తరణకు 20 నిముషాలు పడితే, ఆయా పేజీల్లో పేరు లింకు మూలం చేర్చేడానికి మరో 20 నిముషాలు పట్టేది. ఆగస్టు 14వ తేదీ నుండి నటినటులు, సాంకేతిక నిపుణుల పేజీల్లో సినిమా పేర్లు రాయడం, మూలాలు ఇవ్వడం మానుకొని నేను కూడా విస్తరణ వేగం పెంచాను. పౌరాణిక పాత్రల వ్యాసాలకోసం కొన్ని తెలుగు వెబ్సైట్స్, సినిమా వ్యాసాలలోని నటినటులు సాంకేతిక నిపుణుల పేర్లకోసం యూట్యూబ్ లో సినిమా వీడియోలు, Indiancine.ma., MovieGQ, Medium... పాటలకోసం naasongs.co., gaana వంటి వెబ్సైట్స్ వెతికి విస్తరణ చేశాను. నేను విస్తరణ చేసిన వ్యాసాలలో 5 నుండి 10 వ్యాసాలు మినగా మిగతా వాటిల్లో రెండు కంటే ఎక్కువ మూలాలు చేరేలా శ్రద్ధ తీసుకున్నాను. అలాగే వీలైనన్ని వర్గాలు కూడా చేర్చాను.

ఈ మూణ్ణెళ్ళకాలం నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. ఇలా నేను పెద్ద మొత్తంలో మొలక వ్యాసాలను విస్తరణ చేయడం నా వికీ ప్రయాణంలో మరొక మైలురాయి అని చెప్పగలను. సమిష్టి కృషితో ఏదైనా సాధ్యమే అని నిరూపించడానికి చక్కని ఉదాహరణ ఈ ప్రాజెక్టు. నాకున్న పరిమితుల్లో ఎంత ప్రయత్నించినా 100 నుండి 120 వ్యాసాల వరకు విస్తరణ చేయగలనేమో అనుకున్నాను. కానీ, "మొలకల విస్తరణలో చదువరి, వెంకటరమణ గారలు చూపిన ఉత్సాహం౼యర్రా రామారావు గారి ప్రోత్సాహం" నాతో 254 వ్యాసాలను విస్తరణ చేయించాయి. వికీపీడియాలో వ్యాసాలను తొలగించడానికే ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు అనుకుంటున్న అభిప్రాయానికి ఈ ప్రాజెక్టు ఒక సమాధానం అని నేను భావిస్తున్నాను. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న అందరికీ అభినందనలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:05, 4 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త ప్రాజెక్టుల గురించిన ఆలోచనలు

[మార్చు]

ఇకపై మనం ఏయే ప్రాజెక్టులు చేపట్టవచ్చు, ఎలాంటి ప్రాఅజెక్టులు ఛేపట్టవచ్చు అనేవి ఇక్కడ రాయాలి. ఈ ప్రాజెక్టుకు సంబంధం ఉండాల్సిన పనిలేదు. తెవికీలో ఉండే ఏ పని గురించైనా అవి ఉండవచ్చు

  1. ప్రభాకర్ గౌడ్ నోముల:మీ విస్తరణ సంఖ్య చూసి చాలా ప్రేరణ కలిగింది, నాకు అసలు ఈ మొలకలు అనేది తెలుగు వికీపీడియాలో లేకుండా చేయడం ఈ సంవత్సరం లోనే మరో ప్రాజెక్టు, వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 రెండో నెంబర్ పెట్టుకొని ఆ సగం 2020 లో చివరలోగా మొలకలు అనేది తెలుగు వికీపీడియాలో లేకుండా చేయడం 15 సెప్టెంబర్ నుండి డిసెంబర్ 31 సుమారుగా వంద రోజుల ఈ సంవత్సరం మరో ప్రాజెక్టు పెట్టుకుని ఉన్న సగం మొలకలు కూడా లేకుండా చిదివేస్తే ఇది తెలుగు వికీపీడియాకు ఎంతో గౌరవం ఉంటుంది కదా అని అనిపిస్తుంది. చివరి పది రోజులు నాకు ల్యాప్టాప్ ఇంటర్నెట్ ఇబ్బందులకు గురి చేసి నేను సెంచరీ మిస్ అయ్యాను. ఈసారి పూర్తికాలం మొలకల విస్తరణ లేకుండా పాటుపడాలని సహకరించాలని అందరం ఇది వేగం కొనసాగిద్దాం. అని అనిపిస్తుంది.  ప్రభాకర్ గౌడ్ నోముల 16:05, 1 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  2. చదువరి: ప్రస్తుతం నా తలపున కొచ్చిన కొత్త ప్రాజెక్టుల ఆలోచనలు కొన్ని:
    1. అనువాద పరికరం గురించి ఒక ప్రాజెక్టు. ట్యుటోరియల్ తయారు చెయ్యడం, కిటుకులు, చిట్కాలు తయారు చెయ్యడం, సాధారణంగా అది చేసే తప్పులు ఎలా ఉంటాయి, వాటిని ఎలా సవరించాలి వగైరా సమాచారాన్ని అందించడం. ఆ పరికరం గురించి విశదీకరిస్తూ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం వగైరాలు. ఇందులో భాషా శైలి గురించి కూడా కొంత ప్రాథమిక సమాచరాన్ని చేర్చాలి.
    2. ఆటోవికీ బ్రౌజరు శిక్షణ: ఆటో వికీ బ్రౌజరు చాలా పవర్‌ఫుల్ ఉపకరణం. పది మంది చేసే పనిని పదో వంతు సమయంలో చేయగల సామర్థ్యం దాని సొత్తు. దానికి వికీపీడియా:AutoWikiBrowser/Typos పేజీని అనుసంధానించి పనిచేస్తే వందలాది పేజీల్లో ఉన్న వేలాది తప్పులను, అప్రామాణికతనూ సరిచెయ్యవచ్చు. ఊరికినే దానికి ఎదురుగా కూచుని ఓకె కొడుతూ ఉంటే చాలు. ఇవి నిరంతరంగా జరిగే పని. అలాగే కొన్ని తాత్కాలికంగా చెయ్యాల్సిన సామూహిక పనులను కూడా దీనితో చెయ్యవచ్చు. ఉదాహరణకు ఈ ప్రాజెక్టులో విస్తరించిన పేజీలను విస్తరణ్ వర్గంలో చేర్చడం. ఒక స్వరలాసిక గారు చేసిన సుమారు నూటపాతిక పేజీలు తప్పించి మిగతా 2700 పేజీలను కూడా ఈ వర్గాల్లోకి చేర్చినది మనిషి కాదు ఈ పరికరమే. ప్రాజెక్టు మొదలు పెట్టడానికి ముందు సుమారు 3500 పేజీలను 40 వర్గాల్లోకి తరలించినది కూడా ఈ పరికరమే. మనిషి కూచ్చుని ఒక్కో పేజీనీ తెరిచి వర్గం లోకి చేర్చడం లాంటిది చెయ్యలా. అంచేత ఈ పరికరాన్ని వీలైనంత మంది చేస్తే బాగుంటుంది. దీనిపై శిక్షణ కార్యక్రమం ఇవ్వాలనేది నా ఉద్దేశం.
    3. వికీప్రాజెక్టు పేజీలో ఉన్న ప్రాజెక్టులన్నిటినీ సమీక్షించి వాటిని వాటివాటి లక్షణాలు, సభ్యుల కుండాల్సిన నైపుణ్యతా స్థాయి, అవి చేసే పనులూ మొదలైన వాటి ఆధారంగా వర్గీకరించి, ఒక పట్టికలో చేర్చడం. వాడుకరులు ప్రాజెక్టులన్నిటినీ పరిశీలించి తమకు అనుకూలమైన వాటిని ఎంచుకుని పనిచేసే వీలు అందుబాటు లోకి తేవడం దీని ఉద్దేశం. నేను ఏం పని చెయ్యాలి అనే డైలమా ఎవరికైనా ఉంటే ఆ విషయంలో వికీప్రాజెక్టు పేజీ ఒక మంచి సూచనలిచ్చే స్థలం కావాలి అనేది నా ఉద్దేశం.__చదువరి (చర్చరచనలు) 05:38, 2 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
    4. చదువరి గారు తెలిపిన కొత్త ప్రాజెక్టుల ఆలోచనలు,సూచనలు బాగా ఉన్నవి.అటో వికీ బ్రౌజరు ఎక్కువమంది వాడితే వారికి వచ్చిన ఆలోచనలతో బ్రౌజరు మరిత నాణ్యతచెందటానికి అవకాశం ఉంటుంది.దీని వాడకం పెంపొందించాలి.మొదటి పాయింటులో చెప్పినదానిలోని విషయాలు పవన్ సంతోష్ గారులాంటి వారు వీడియా రూపంగా తయారుచేసి వికీలో పెడితే బాగుంటుదని నాఅభిప్రాయం.ఇక మూడవ ఐటంలో తెలిపిన ప్రకారం ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు అన్నీ ఒకేచోట పెడితే అసలు ఏమేమి చేయాల్సినవి ఉన్నవి అనేది తెలుస్తుంది, ఎవరికి ఆసక్తి ఉన్నది వారు అభివృద్ధి చేయటానికి అవకాశం ఉంటుంది.ఇంకొక సూచన అవకాశం ఉంటే వాడుకరులు ఎదైనా పెద్ద ఎత్తున చేయబోయే, చేసిన కార్యక్రమం రికార్డు వివరాలు మాసవారీ తెలిపే పేజీ ఒకటి ఉంటే, వారిని ప్రోత్సహించినట్లు ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 03:55, 4 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
    5. ఆటో వికీ రెండు వైపులా పదును ఉన్న కత్తిటాంటిది , దానిని వాడగల సామర్ధ్యం ఉన్న వాడుకదారులు వాడుతున్నారు కూడా, ఆంగ్ల వికీ ప్రకారం సరైన పాలసీలు తీసుకొని ఆటోవికీ బ్రౌజరు నిర్వాహకులకు మాత్రమే శిక్షణ ఇస్తే బాగుంటుంది , అది వారిపనిని సులభంతరం చేస్తుంది అని నా విన్నపం Kasyap (చర్చ) 15:44, 4 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
    6. నాకు ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుల గురించిన ఆలోచనలేవి లేవు. తెవికీ అభివృద్ధికి సముదాయం నిర్ణయించిన ప్రాజెక్టుల్లో పాల్గొనడానికి నేనెప్పుడూ సిద్ధమే.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:19, 4 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  3. యర్రా రామారావు:నాకు తోచిన ప్రాజెక్టులు
    1. .ఆంధ్రప్రదేశ్ లో 50 రెవెన్యూ డివిజన్లు, తెలంగాణలో 70 రెవెన్యూ డివిజన్లు ఉన్నవి.వీటిలో బహు కొద్ది వాటికి మాత్రమే పేజీలు ఉన్నవి.లేని వాటిని గుర్తించి ఒక ప్రాజెక్టు తయారు చేయాలనే అభిప్రాయం ఉంది.
    2. .అలాగే రెండు రాష్ట్రాలలో ఉన్న పురపాలక సంఘాలకు బహుకొద్దివాటికి మాత్రమే పేజీలు ఉన్నవి.వాటిని గుర్తించి మహేశ్వరరాజు సహకారంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొన్ని పురపాలక సంఘాలకు పేజీలు సృష్టించి పరిపూర్ణంగా తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతుంది.దాని తరువాత తెలంగాణలో ఉన్న 110 పురపాలక సంఘాలలో పేజీలు ఉన్న 17 పోను ఇంకా 93 పురపాలక సంఘాలకు పేజీలు సృష్టించవలసి ఉంది.దీనిని అందరి భాగస్వామ్యం ఉంటే మరింత నాణ్యతగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉన్నందున ఒక ప్రాజెక్టుగా రూపకల్పన చేద్దామని అభిప్రాయం ఉంది.
    3. .వికీపీడియాలో అసలు మూలాలు లేని వ్యాసాలు గుర్తించి,వాటికి ఒక ప్రాజెక్టుగా రూపొందించాలనే అభిప్రాయం ఉంది.

వ్యక్తిగతంగా మీరు చెయ్యదలచిన పని

[మార్చు]

వికీలో మీరు వ్యక్తిగతంగా కొన్ని పనులు చెయ్యాలని భావిస్తూ ఉండవచ్చు. అవి చేస్తారా చెయ్యరా, ఎప్పుడు చేస్తారు.. ఇలాంటివేమీ అక్కర్లేదు. అసలు ఆలోచన ఏంటి అనేది ముఖ్యం. మీ ఆలోచన మరొకరికి స్ఫూర్తి నివ్వవచ్చు, ఉత్సాహం కలిగించవచ్చు. కొత్త ఆలోచన తెప్పించవచ్చు.

  1. చదువరి: నేను చెయ్యదలచిన పనులు కొన్ని ఇక్కడ:
    1. ఈ ప్రాజెక్టులో నేను రాసిన వ్యాసాలన్నిటినీ ఒకసారి చదవడం, అవసరమైన సవరణలు చెయ్యడం.
    2. ఈ ప్రాజెక్టులో విస్తరించిన వ్యాసాలన్నిటినీ (అందరూ చేసినవి) AWB చేత చదివించడం, అవసరమైన సవరణలు చేయించడం.
    3. పైన ప్రాజెక్టు ఆలోచనల్లో నేను రాసిన మూడవ ప్రాజెక్టు - అన్ని వికీప్రాజెక్టులనూ ఒక పట్టిక లోకి చేర్చడం - చెయ్యడం.
    4. సెమీ ఆటోమేషన్: ఆతోవికీ బ్రౌజరు లాంటి సెమీ ఆటోమేషన్ పనులు విరివిగా చేస్తూ ఉండడం.
    5. నెలకు 15 కొత్త వ్యాసాలు రాయాలనేది నా సంకల్పం. ముందుగా ఫిబ్రవరిలో మనం తొలగించిన ~1800 వ్యాసాలను ఎంచుకుని వాటినే చేద్దామనేది నా ఆలోచన. __చదువరి (చర్చరచనలు) 05:37, 2 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  2. రవిచంద్ర:
    1. అనువాద పరికరం ఉపయోగించి రాసిన వ్యాసాల్లో నాణ్యతను పరీక్షించి అభివృద్ధి చేస్తాను.
    2. ప్రాజెక్టు ముగిసినా సరే ఆ జాబితాలో మిగిలి ఉన్న వ్యాసాల్ని విస్తరించడానికి ప్రయత్నిస్తాను. -రవిచంద్ర (చర్చ) 05:57, 2 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  3. ప్రభాకర్ గౌడ్ నోముల:వికీ ప్రపంచ రికార్డు: ఏదైనా వికీ రికార్డు ప్రపంచ రికార్డు ప్రణయ్‌రాజ్ లాంటిది మీ మనసులో ఉంటే నాకు చెప్పండి, సాధించాలి అనేది నా మనసులో మాట... మీరు ఏదైనా అనుకుని చేయలేనిది, వీలు కాని లక్ష్యం ఉంటే చెప్పండి, నేను ప్రయత్నిస్తా... ఉదాహరణకు 1800 తొలగించిన ఫిబ్రవరిలో మనం తొలగించిన ~1800 వ్యాసాలను ఎంచుకుని కనీసం పదిహేను వందలు పేజీలు చాలా తెలుగు వికీపీడియాలో ఉండవలసినవి, అవి అన్ని మొత్తం నియమాలకు అనుగుణంగా నేను ఒక్కడిని అనువదించాలని నా ఆశ. వికీ ప్రపంచ రికార్డు కావడానికి దారి చెప్పండి.  ప్రభాకర్ గౌడ్ నోముల 06:50, 2 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  4. కశ్యప్ : అందరికీ నెనర్లు  ప్రభాకర్ గౌడ్ నోముల గారు , నేను కూడా మీతో కలసి ఫిబ్రవరిలో మనం తొలగించిన ~1800 వ్యాసాలను ముందుకు నడుస్తాను, యిది కాకుండా ఇవికాకుండా ఈ ఉపకరణం ద్వారా ఎక్కువగా వీక్షించే ఇంగ్లిష్ , ఇంకా తెలుగులో https://stats.wikimedia.org/#/te.wikipedia.org/reading/top-viewed-articles/normal%7Ctable%7Clast-month%7C~total%7Cmonthly వ్యాసాలు ఏవో చేసుకొని వాటిని అనువాదం, లేదా తెలుగులో అభివుద్ది చేస్తాను , పాజెక్టు లో పాలుపంచుకున్న అందరికి వందనాలు Kasyap (చర్చ) 08:00, 2 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  5. యర్రా రామారావు:నేను చేయదలచిన పనులలో నేను ఎంతకాలానికి, ఎన్ని చేయగలుగుతానో కానీ నాఆలోచనలో చాలా ఉన్నవి.
    1. ఆంధ్రప్రదేశలోని మండలాలలో ఎన్ని రెవెన్యూ గ్రామాలు ఉన్నవనే దానికి ఎటువంటి ప్రామాణిక గణాంకాలు లేవు.మండలంలోని గ్రామాలు విభాగంలో శివారు గ్రామాలు, కొన్ని గ్రామాలుకు రెండేసి పేజీలు,నిర్జన గ్రామాల పేజీలను తొలగించకుండా అలానే ఉండటం, జనణ గణన డేటా ఎక్కించని కొన్ని గ్రామాలు, సమాచారపెట్టెలు లేని కొన్ని గ్రామాలు ఇలా ఉన్నవి.మండలానికి ఎటువంటి మూలంలేకుండా ఉన్నవి. తెలంగాణాలో నేను చేసిన విధంగానే సాధ్యమైనంత పరిపూర్ణంగా చేయాలనే అభిప్రాయంతో మొలకల విస్తరణకు ముందు మొదలుపెట్టి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు పూర్తిచేసాను.ఇంకా 11 జిల్లాలు పని పూర్తి చేయవలసిఉంది.
    2. 2019 ఆగష్టు 15 చదువరిగారిచే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/గ్రామాల పేర్ల సవరణ ప్రాజెక్టు ఒకటి మొదలుపెట్టబడింది.అది అసంపూర్తిగా ఉంది.దానిలో నేను ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనంతపురం జిల్లాలోని సుమారు 10 మండలలాలో సరియైన పేర్లుకు సవరించే కార్యక్రమం ఇంది అది పూర్తిచేయాలి.అవకాశం ఉంటే ఇంకొక జిల్లా చేపట్టాలి.ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు.
    3. కొన్ని అయోమయ నివృత్తి పేజీల్లో సంబంధిత పేజీలన్నిటికీ లింకులు లేవు.మిస్సయిన లింకులన్నిటినీ చేర్చాలనే సంకల్పంతో 2019 డిశెంబరు 30న లక్ష్యిత పేజీకి లింకులను మార్చడం అనే ప్రాజెక్టును మొదలుపెట్టి చదువరిగారు ఒక్కరే కొంతవరకు చేసారు.నేను దానిలో పాల్గొంటాను అని రాశాను.కానీ నేను ఏమీ చేయలేదు.దానిలో నావంతు సహకారం అందించాలని అనుకుంటున్నాను.ఈ ప్రాజెక్టు ఉద్ధేశ్యం అయోమయ నివృత్తి పేజీలకు ఇచ్చిన లింకులను నేరుగా లక్ష్యిత పే జీకి లింకులను సవరించడం.
    4. వికీపీడియా:శైలి/అనుస్వారం సమస్య పేజీలు 2928 పేజీలు ఉన్నవి. వికీపీడియా:శైలి/భాష ప్రకారం వీటిని అవకాశం ఉన్నంతవరకు సవరించాలని అనుకుంటున్నాను.
    5. ఆంధ్రప్రదేశ్ లో 50 రెవెన్యూ డివిజన్లు, తెలంగాణలో 70 రెవెన్యూ డివిజన్లు ఉన్నవి.వీటిలో బహు కొద్ది వాటికి మాత్రమే పేజీలు ఉన్నవి.లేని వాటిని గుర్తించి వాటికి కొత్త పేజీలు సృష్టించి అభివృద్ధి చేయాలనే అభిప్రాయంలో ఉన్నాను.
    6. అలాగే రెండు రాష్ట్రాలలో ఉన్న పురపాలక సంఘాలకు బహుకొద్దివాటికి మాత్రమే పేజీలు ఉన్నవి.వాటిని గుర్తించి మహేశ్వరరాజు సహకారంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పురపాలక సంఘంలకు పేజీలు సృష్టించి పరిపూర్ణంగా తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతుంది.దాని తరువాత తెలంగాణలో ఉన్న 110 పురపాలక సంఘాలలో పేజీలు ఉన్న 17 పోను ఇంకా 93 పురపాలక సంఘాలకు పేజీలు సృష్టించవలసి ఉంది.
    7. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలకు 3 జిల్లాలకు మాత్రమే మూస:శ్రీకాకుళం జిల్లా, మూస:శ్రీకాకుళం జిల్లా, మూస:కృష్ణా జిల్లాకు మాత్రమే జిల్లాల మూసలు ఉన్నవి.ఇంకా 10 జిల్లాలకు ఇలాంటి మూసలు సృష్టించాల్సి ఉంది.
    8. తెలంగాణలో ఇదే పద్దతిపై పునర్య్వస్థీకరణ ప్రకారం జిల్లా మూసలు సవరించాల్సిన పని ఉంది.
    9. ఆంధ్రప్రదేశ్ లో జిల్లా పర్యాటకరంగం వ్యాసాలు అనంతపురం,కర్నూలు జిల్లాలుకు మాత్రమే ఉన్నవి.ఇలాగే 11 జిల్లాలకు సృష్టించాల్సిఉంది.
    10. తెలంగాణలో ఇదే పద్దతిపై పునర్య్వస్థీకరణ ప్రకారం పర్యాటకరంగం వ్యాసాలు పరిశీలించి ప్రాజెక్టుపనిగా పెట్టుకుని సవరించాల్సిన పని ఉంది.
    11. రెండు రాష్ట్రాలకు తేడా గమనించి, లేనివి ఆరాష్ట్రంలో ఉండేటట్లు రెండు సమాన స్థాయిలో ఉండే విధంగా పరిశీలించి,దాని ప్రకారం పేజీలు సృష్టించే కార్యక్రమం చేపట్టాను.ఈ కార్యక్రమంలో ఒక్క వ్యాసాలేకాదు,మూసలు, వర్గాలు,కూడా వస్తవి.
    12. సమాచారపెట్టెలుకు అవసరమైన లింకు పేజీలు ఎర్ర లింకులు లేకుండా ఉండాల్సిన వ్యాసాలు కొన్నిటిని గుర్తించాను.వాటిని సృష్టించాలని అనుకుంటున్నాను.నాదృష్టిలో ఇవి అవసరమని భావిస్తున్నాను.ఉదా:Telephone Code,Local government, State Region, Rajya Sabha అలాంటి వాటిని కొన్నింటిని గుర్తించి సృష్టించి అభివృద్దిచేయాలనుకుంటున్నాను.
చివరగా ఒక మాట నాకు వ్యాసాలు విస్తరణమీదకంటే, పరిశీలన ఇటువంటి వాటిమీదనే ఎక్కువ ఆసక్తి ఉంటుంది.ఎందుకో చెప్పలేను. ధన్యవాదాలతో--యర్రా రామారావు (చర్చ) 15:08, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
6. ప్రణయ్‌రాజ్ వంగరి:
  1. మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టులో నేను విస్తరణ చేసిన వ్యాసాలను పునఃసమీక్ష చేసుకోవడం, మిగిలిన సినిమా వ్యాసాలను విస్తరణ చేయడం
  2. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/గ్రామాల పేర్ల సవరణ ప్రాజెక్టులో భాగస్వామినై తెలంగాణ గ్రామాల పేర్లను సేకరించడం, సవరణ చేయడం
  3. తెవికీ వ్యాసాలను వికీకరణ చేయడం, మూలాలు, ఇన్‌కమింగు లింకులు-అంతర్వికీ లింకులు, వర్గాలు చేర్చడం
  4. ఇటీవలి మార్పులు, కొత్త పేజీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం... కొత్త వాడుకరులకు సహాయం చేయడం
  5. తెవికీ నిర్వహణ బాధ్యతను నిర్వర్తించడం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:50, 4 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]