వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/పాఠ్యాశాలు/వీక్షణ జాబితా
వీక్షణ జాబితా
చురుకుగా వుండే వాడుకరులు బాగా వాడుకోగలిగే ఒక ముఖ్య విశేషం ఈ వీక్షణ జాబితా. మీరు చూసే ప్రతి పేజీ లోను "నక్షత్రం" గుర్తు వుంటుంది. మీరు దానిని క్లిక్ చేస్తే ఆ పేజీ వీక్షణ జాబితాలోకి చేరుతుంది. ముందుగా మనం వీక్షణ జాబితా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
1. వీక్షణ జాబితా అంటే ఏమిటి?
- వికీపీడియాలో మీకు నచ్చిన పేజీలలో జరిగే మార్పులు చేర్పులను పర్యవేక్షిస్తూ ఉండడంకోసం ఎంచుకునే జాబితాను వీక్షణ జాబితా అంటారు. ప్రతీ సభ్యునికీ తనకు సంబంధించిన వీక్షణ జాబితా ఉంటుంది.
2. వీక్షణ జాబితాలో ఏం ఉంటాయి?
3. వీక్షణ జాబితా ఉపయోగం ఏంటి?
- మీకు నచ్చిన పేజీలలో జరిగే మార్పులు చేర్పులను పర్యవేక్షిస్తూ ఉండోచ్చు. మీరు ఇటీవలి మార్పులు, మెరుగైనఇటీవలి మార్పులు లేదా సంబంధిత మార్పులను వీక్షించినప్పుడు, మీరు ఎంచుకున్న పేజీలకు సంబంధించిన మార్పులు బొద్దు అక్షరాలతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఎంచుకున్న పేజీలను ప్రభావితం చేసే చర్యలు (పేజీ కదలికలు, పేజీ సృష్టిలు, తొలగింపులు, రక్షణ) కూడా ఈ వీక్షణ జాబితాలో కనిపిస్తాయి. మీరు ఎంచుకున్న పేజీలకు చర్చా పేజీ లేనపుడు, ఎవరైనా ఆ చర్చా పేజీని సృష్టించినప్పుడు అది మీ వీక్షణ జాబితాలో కనిపిస్తుంది. మీరు ఎంచుకున్న పేజీని కొత్త శీర్షికకు తరలించినట్లయితే, కొత్త శీర్షిక ఆటోమాటిక్ గా మీ వీక్షణ జాబితాకు చేరుతుంది. పేజీని తర్వాత వెనక్కి తరలించినప్పటికీ (కొత్త శీర్షికలో ఉన్న పేజీ తొలగించబడినప్పటికీ), కొత్త శీర్షిక పాత దానితో పాటు మీ వీక్షణ జాబితాలో అలాగే ఉంటుంది. అలాగే ఎంచుకున్న పేజీలలో జరిగే మార్పులను ఈమెయిల్ ద్వారా కూడా నోటిఫికేషన్ అందించబడుతుంది.
4. వీక్షణ జాబితాలో నాకు కావలసినవి ఎలా ఎంచుకోవాలి ?
- మీకు కావలసిన వ్యాసం యొక్క పైభాగంలో ఉండే వీక్షించు (బ్లూ స్టార్ చిహ్నాన్ని క్లిక్ చేసి) అనే టాబ్ పై నొక్కితే ఆ పేజీ మీ వీక్షణ జాబితాలో చేరుతుంది. మీకు కావలసినన్ని పేజీలను మీ వీక్షణ జాబితాలో చేర్చుకోవచ్చు. ఆ జాబితా చూడడానికి నా వీక్షణ జాబితా నొక్కితే సరిపోతుంది. మీ వీక్షణ జాబితాలో చేరిన పేజీలు పూర్తిగా నిండిన బ్లూ స్టార్ చిహ్నం ద్వారా సూచించబడతాయి.
5. తాత్కాలిక వీక్షణ జాబితా ఉంటుందా?
- వికీపీడియాలో మీరు తాత్కాలిక వీక్షణ జాబితాను (1 వారం, 1 నెల, 3 నెలలు లేదా 6 నెలలు) కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. 2020లో ఈ కొత్త వాచ్‌లిస్ట్ ఫీచర్ (వాచ్‌లిస్ట్ ఎక్స్‌పైరీ) ప్రవేశపెట్టబడింది. మీరు ఎంచుకున్న వీక్షణ వ్యవధి ముగిసిన తర్వాత, పేజీ మీ వీక్షణ జాబితా నుండి ఆటోమాటిక్ గా తీసివేయబడుతుంది. మీరు వీక్షణ వ్యవధిని ఎప్పుడైనా మార్చవచ్చు, తాత్కాలిక నుండి శాశ్వత వీక్షణకు మారడం లేదా ఏ సమయంలోనైనా పూర్తిగా చూడకుండా చేయడం వంటివి చేయవచ్చు. తాత్కాలికంగా వీక్షించిన పేజీలు సగం నిండిన బ్లూ స్టార్ చిహ్నం ద్వారా సూచించబడతాయి.
వీడియో పాఠ్యం
[మార్చు]ఏదైనా సైటులోకానీ లేదా సోషల్ మీడియాలోకానీ, యూట్యూబ్ లో కానీ మనకు నచ్చిన పేజీని లైక్ చేయడం, నచ్చిన యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేయడం చేస్తుంటాం. అలా చేయడంవల్ల వాటిల్లో ఏదైనా పోస్టు చేసినపుడు, మన సోషల్ మీడియా అకౌంట్ కి లేదా మన మెయిల్ అడ్రస్ కి నోటిఫికేషన్ వస్తుంది. దానిమాదిరిగానే వికీపీడియాలో కూడా ఒక ఆప్షన్ ఉంది. అదే వీక్షణ జాబితా.
వికీపీడియాలో చురుకుగా వుండే వాడుకరులు బాగా వాడుకోగలిగే ఒక ముఖ్యమైన విశేషం ఈ వీక్షణ జాబితా. మనం చూసే ప్రతి పేజీలోనూ "నక్షత్రం" గుర్తు వుంటుంది. దానిని క్లిక్ చేస్తే ఆ పేజీ వీక్షణ జాబితాలోకి చేరుతుంది. ముందుగా మనం వీక్షణ జాబితా అంటే ఏమిటి, దాని ఉపయోగం ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం.
వికీపీడియాలో మనకు నచ్చిన పేజీలలో జరిగే మార్పులు చేర్పులను పర్యవేక్షిస్తూ ఉండడంకోసం ఎంచుకునే జాబితాను, వీక్షణ జాబితా అంటారు. ప్రతీ సభ్యునికీ తనకు సంబంధించిన ఒక వీక్షణ జాబితా ఉంటుంది. ఈ వీక్షణ జాబితాను ఎంచుకొని, మనకు నచ్చిన పేజీలలో జరిగే మార్పులు చేర్పులను పర్యవేక్షిస్తూ ఉండోచ్చు. అంతేకాకుండా, ఇటీవలి మార్పులు, మెరుగైన ఇటీవలి మార్పులు లేదా సంబంధిత మార్పులను చూసినపుడు, మనం ఎంచుకున్న పేజీలకు సంబంధించిన మార్పులు బొద్దు అక్షరాలతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఎంచుకున్న పేజీలలో జరిగే మార్పులను ఈమెయిల్ ద్వారా కూడా నోటిఫికేషన్ అందించబడుతుంది. అప్పుడు ఆయా పేజీలలో జరిగే మార్పులు సరైనవో కాదో పరిశీలించడానికి అవకాశం ఉంటుంది.
ఈ వీక్షణ జాబితాను ఇటివలి మార్పులలో కూడా చూడొచ్చు. మార్పులు వడగట్టండి అనేది క్లిక్ చేస్తే మనకు మరిన్ని ఆప్షన్స్ వస్తాయి. అక్కడ వీక్షణ జాబితాలో అనేది సెలక్ట్ చేసుకుంటే, మనం ఎంచుకున్న వ్యాసాలలో ఇటీవలికాలంలో జరిగిన మార్పులు బొద్దు అక్షరాలలో ఇక్కడ కనిపిస్తాయి.
ఒక వికీపీడియా వ్యాసాన్ని వీక్షణ జాబితాలోకి ఎలా చేర్చాలో ఇప్పుడు తెలుసుకుందాం
మనకు కావలసిన వ్యాసపు పైభాగంలో ఉండే వీక్షించు (బ్లూ స్టార్ చిహ్నాన్ని క్లిక్ చేసి) అనే టాబ్ పై నొక్కితే ఆ పేజీ మన వీక్షణ జాబితాలో చేరుతుంది. మనకు కావలసినన్ని పేజీలను మన వీక్షణ జాబితాలో చేర్చుకోవచ్చు. ఆ జాబితా చూడడానికి వీక్షణ జాబితా అనే బటన్ నొక్కితే సరిపోతుంది. మన వీక్షణ జాబితాలో చేరిన పేజీలు పూర్తిగా నిండిన బ్లూ స్టార్ చిహ్నం ద్వారా సూచించబడతాయి.
ఇదండీ, వీక్షణ జాబితా గురించిన సమాచారం. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వికీపీడియాలో అకౌంట్ ఓపన్ చేసి, చకచకా మీకు తెలిసిన సమాచారాన్ని వికీపీడియాలో రాసేయండి మరి.