Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/పాఠ్యాశాలు/యూజర్ ఇంటర్ ఫేజ్ పరిచయం

వికీపీడియా నుండి

వికీ యూజర్ ఇంటర్ ఫేజ్ పరిచయం

వికీపీడియా కోసం ఒక ప్రత్యకమైన సైటు రూపొందించబడింది. దానినే వికీ యూజర్ ఇంటర్ ఫేజ్ అంటారు. ఈ యూజర్ ఇంటర్ ఫేజ్ అన్ని భాషల వికీపీడియాలకు ఒకేవిధంగా ఉంటుంది. వికీలో రాయడానికి ముందుగా మనం వికీ యూజర్ ఇంటర్ ఫేజ్ గురించి తెలుసుకుందాం.

1. యాదృచ్ఛిక పేజీ అంటే ఏమిటి?

యాదృచ్ఛిక పేజీ అనే దానిపై నొక్కినపుడు తెవికీలోని ఎదో ఒక యాదృచ్ఛిక పేజీ ఓపన్ అవుతుంది.

2. రచ్చబండ అంటే ఏమిటి? అందులో ఏంఏం చేయవచ్చు?

వికీపీడియా సముదాయ సభ్యులందరు కలిసి వికీపీడియా గురించిన అంశాలు, విషయాలు చర్చించడానికి ఉపయోగించే వేదిక. ఇందులో కొత్త ప్రతిపాదనలు, పాలసీలు, అభిప్రాయాలు, వార్తలు మొదలైనవి ఉంటాయి.

3. వికీపీడియా గురించి విభాగంలో ఏం ఉంటుంది?

వికీపీడియా చరిత్ర, వికీపీడియాలో రచనలు చేయడం, ప్రాజెక్టు సభ్యులను సంప్రదించడం మొదలైన వివరాలు ఈ విభాగంలో ఉంటాయి.

4. సంప్రదింపు పేజీ ఎందుకు?

వికీపీడియాకు సంబంధించి ఎదైనా విషయాలను తెలుసుకోవడానికి లేదా తెలియజేయడానికి మరియు వికీపీడియా నిర్వాహకులను సంప్రదించడానికి సూచనలు ఈ విభాగంలో ఉంటాయి.

5. విరాళాలు ఎవరికి ఇవ్వాలి?

వికీపీడియా అనేది ఒక స్వచ్ఛంధ సంస్థ. దాన్ని మనలాంటి ఔత్సాహికులు నిర్వహిస్తున్నారు. వ్యాపార ప్రకటనలు లేకుండా పూర్తిగా ఉచితంగా లాభాపేక్షరహిత ఫౌండేషన్ చేత ఈ వికీపీడియా నడపబడుతోంది. వివిధ భాషలలో వికీపీడియా అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం అవసరమవుతోంది. దానికోసం వికీపీడియా విరాళాలు సేకరిస్తోంది. మీరు నేరుగా వికీమీడియా ఫౌండేషన్ కు విరాళాలు పంపవచ్చు. విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.

6. సహాయసూచిక విభాగంలో ఏం ఉంటుంది?

సహాయ సూచిక అనే విభాగంలో వికీపీడియాలో రచనలు చేయడం ఎలా, రిఫరెన్స్ (మూలాలు) ఎలా ఇవ్వాలి, బొమ్మలు-వీడియోలు ఎలా చేర్చాలి, వికీపీడియా రచనకు కావలసిన సాంకేతిక సమాచారం మొదలైన పేజీల వివరాలు, వాటి లింకులు ఉంటాయి.

7. సముదాయ పందిరి విభాగంలో ఏం ఉంటుంది?

సముదాయ పందిరి అనే విభాగంలో వికీపీడియా సభ్యులకు (వాడుకరులు) వికీపీడియాలో వ్యాసాల రచనకు సంబంధించిన సూచనలు, సలహాలు, విధానాలు, వికీపీడియాలో నిర్వహించబడుతున్న ప్రాజెక్టుల వివరాలు ఉంటాయి.

8. ఇటీవలి మార్పులు విభాగంలో ఏం ఉంటుంది?

వికీపీడియాలో నిరంతరం మార్పులు జరుగుతుంటాయి. వాటిని ఇటీవలి మార్పులు విభాగంలో చూడవచ్చు. ఎవరు ఏఏ వ్యాసాలలో ఎలాంటి మార్పులు చేస్తున్నారో ఇక్కడ తెలుస్తుంది.

9. కొత్త పేజీలు విభాగంలో ఏం ఉంటుంది?

కొత్త పేజీలు విభాగంలో వికీపీడియాలో కొత్త వ్యాసాల జాబితా ఉంటుంది. దీని ద్వారా ఏ వాడుకరి ఏఏ పేజీలను కొత్తగా సృష్టిస్తున్నారో ఇందులో చూడవచ్చు.

10. దస్త్రం ఎక్కింపు విభాగంలో ఏం ఉంటుంది?

వికీపీడియా వ్యాసంలో ఏదైనా బొమ్మనుకానీ, వీడియోను కానీ చేర్చడంకోసం ఈ పేజీ ఉపయోగపడుతుంది.

11. ఇక్కడికి లింకున్న పేజీలు విభాగంలో ఏం ఉంటుంది?

ఎంచుకున్న వ్యాసానికి ఏఏ ఇతర వ్యాసాలల నుండి వికీ లింకులు ఉన్నాయో ఈ పేజీలో చూపబడుతాయి.

12. సంబంధిత మార్పులు విభాగంలో ఏం ఉంటుంది?

ఎంచుకున్న వ్యాసానికి సంబంధించిన ఇతర వ్యాసాలలో జరిగిన మార్పులు ఈ విభాగంలో చూపబడుతాయి.

13. ప్రత్యేక పేజీలు విభాగంలో ఏం ఉంటుంది?

వికీపీడియా వ్యాసాలలో ఏదైనా మార్పులు చేయవలసిన వ్యాసాలు, వాడుకరుల సూచన పేజీలు, నిర్వాహణ పేజీలు ఈ విభాగంలో ఉంటాయి.

14. శాశ్వత లింకు విభాగంలో ఏం ఉంటుంది?

15. పేజీ సమాచారం విభాగంలో ఏం ఉంటుంది?

పేజీ సమాచారం విభాగంలో వ్యాసానికి సంబంధించిన సమాచారం (వ్యాసం సైజు, ఐడీ, భాష, వీక్షణలు, సృష్టించిన తేదీ, సృష్టించిన వాడుకరి పేరు మొ.నవి) ఉంటాయి.

16. ఈ పేజీని ఉల్లేఖించండి విభాగంలో ఏం ఉంటుంది?

ఈ పేజీని ఉల్లేఖించండి విభాగంలో వికీపీడియా వ్యాసానికి సంబంధించిన వివరాలు ఉంటాయి.

17. వికీడేటా అంశం విభాగంలో ఏం ఉంటుంది?

వికీడేటా విభాగంలో ఎంచుకున్న వ్యాసానికి సంబంధించిన వికీడేటా అంశాలు ఉంటాయి.

18. ఓ పుస్తకాన్ని సృష్టించండి, ఎలా సృష్టించుకోవాలి?

ఈ విభాగంలో వికీ వ్యాసాలతో పుస్తకాన్ని సృష్టించుకోవచ్చు. వివిధ రూపాలలో (ఉదాహరణకు PDF, ODT) లో పుస్తకాన్ని అప్లోడ్ చేయవచ్చు. లేదా ముద్రించిన పుస్తకాన్నికొనుక్కొవచ్చు.

19. PDF రూపంలో దించుకోండి, దిగుమతి చేసుకోవచ్చా?

ఈ విభాగాన్ని నొక్కడం ద్వారా వికీపీడియా వ్యాసాలలోని మనం ఎంచుకున్న వ్యాసాన్ని పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

20. అచ్చుతీయదగ్గ కూర్పు అంటే ఏమిటి?

అచ్చుతీయదగ్గ కూర్పు అనే విభాగాన్ని నొక్కినపుడు ఎంచుకున్న వ్యాసపు పేజీ, ప్రింట్ చేయడానికి కావలసిన రూపంలో కనిపిస్తుంది. దానిద్వారా వ్యాసాన్ని ప్రింట్ తీసుకోవచ్చు.