వికీపీడియా:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/ఆంధ్ర లొయోల కళాశాల/నివేదికలు
స్వరూపం
(వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర లొయోల కళాశాల/నివేదికలు నుండి దారిమార్పు చెందింది)
వికీప్రాజెక్టు ఆంధ్ర లొయోల కళాశాల |
ముంగిలి | వేడుకలు & శిక్షణ శిబిరాలు | తెవికీ వ్యాసాల అభివృద్ధి | వికీసోర్స్ తోడ్పాటు | నివేదికలు | చిత్రాలు | సంప్రదింపులు |
సీఐఎస్-ఎ2కె, ఆంధ్ర లొయొలా కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాల సంక్షిప్త నివేదికలు మరియు నివేదికలకు లంకెలు ఇవి, పూర్తి పాఠాల కొరకు ఆయా లంకెలు తెరచి చూడగలరు:
- డిజిటైజేషన్ స్ప్రింట్ - ఫిబ్రవరి 2016 - 13, 14 ఫిబ్రవరి 2016న నిర్వహించిన డిజిటైజేషన్ స్ప్రింట్ కార్యక్రమంలో 24మంది విద్యార్థి వికీపీడియన్లు పాల్గొని ఓసీఆర్ (ఆప్టికల్ క్యారెక్టర్ రిజల్యూషన్) సాంకేతికత ద్వారా స్కాన్ అయిన పుస్తకాలను డిజిటైజ్ చేయడం నేర్చుకున్నారు. తద్వారా కళాశాలకు చెందిన ఫాదర్ పూదోట జోజయ్య రచించిన పుస్తకాల్లోని 12 పుస్తకాలు వికీసోర్సర్లు నిర్ధారించిన ప్రాధాన్యత ప్రకారం వికీసోర్సులో చేర్చి డిజిటైజ్ చేశారు. ఈ క్రమంలో 750కి పైగా పేజీలను డిజిటైజ్ చేయడం ద్వారా వికీసోర్సును సుసంపన్నం చేశారు. ఈ పుస్తకాల్లోని కొన్నిటిని మూలాలుగా స్వీకరించి విద్యార్థులు వికీపీడియాలో 5-6 వ్యాసాలు కూడా అభివృద్ధి చేశారు. మిగతా వివరాల కోసం ఇక్కడ చూడండి.
- జనవరి 11-13, 2016 కార్యశాల: 2016 జనవరి 11 నుంచి 13 వరకూ ఆంధ్ర లొయోలా కళాశాలలో వికీపీడియా కార్యశాల నిర్వహించారు. కార్యక్రమంలో వృక్షశాస్త్రం, సాంఖ్యకశాస్త్రం, భౌతిక శాస్త్రం, తెలుగు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వికీపీడియాపై అవగాహన కల్పించారు. ప్రయోగశాలలో రాసిన వ్యాసాలు క్రమంగా పరిశీలన తర్వాత లైవ్ చేయాలని, యాంత్రికానువాదాన్ని నేరుగా ప్రచురించరాదని పలు సూచనలు చేశాం. కార్యక్రమంలో విద్యార్థులు తమ సబ్జెక్ట్ అంశాలపై ఎంపికచేసుకున్న విషయాలను వ్యాసాలుగా మలిచారు. అనుభవజ్ఞులైన విద్యార్థి వికీపీడియన్లతో పాటు, వికీపీడియాలో కొత్తగా ఖాతా తెరిచిన వికీపీడియన్లు కూడా కార్యశాలలో పాల్గొన్నారు. 13 తేదీన కళాశాలలో సీఐఎస్-ఎ2కె, కళాశాల సంయుక్తంగా ఏర్పాటుచేసిన తెలుగు వికీపీడియా డిజిటల్ రీసోర్సు సెంటర్ ను ప్రారంభించారు.