వికీపీడియా:పైపు లింకు
పైపు లింకు అనేది ఒక వికీపీడియా లింకే. అయితే లింకు ఏ పేజీకైతే ఇచ్చామో ఆ పేజీ పేరు, లింకు పేరు వేరు వేరుగా ఉంటాయి. మామూలు లింకులా కాక దీనిలో రెండు పదాలు ఉంటాయి. ఈ రెండు పదాలను పైపు గుర్తుతో వేరు చేసి రాస్తాం - [[హైదరాబాదు|రాజధాని]] - ఇలాగ. అంచేత దీనికి పైపు లింకు అని పేరు వచ్చింది. ఉదాహరణకు, [[హైదరాబాదు|రాజధాని]] అనేది రాజధాని గా కనిపిస్తుంది, కానీ లింకు మాత్రం హైదరాబాదు పేజీకి వెళ్తుంది.
ఉపయోగం
[మార్చు]వాక్యంలో ఎక్కడైనా ఒక పదానికో పదబంధానికో లింకును ఇచ్చేటపుడు వాక్యంలోని ఆ పదబంధాన్ని మార్చనక్కరలేకుండా లింకును ఇచ్చేందుకు పైపు లింకు వాడతాం. దీని అవసరం కింది సందర్భాలలో వస్తుంది:
- లింకు ఇస్తున్న పేజీ పేరు యథాతథంగా వాక్యంలో ఇమడనపుడు,
- ఆ పదానికి ఒకటి కంటే ఎక్కువ పేజీలున్నపుడు (అయోమయ నివృత్తి పేజీలోని ఖానాపూర్ ఉదాహరణ చూడండి).
ఎప్పుడు వాడకూడదు
[మార్చు]అన్నిటి కంటే ముందు, లింకులు వీలైనంత సింపులుగా ఉంచండి:
- అవసరమైనంత కంటే పొడుగ్గా పెట్టకండి:
- దారిమార్పు పేజీకి వెళ్ళకుండా నివారించేందుకు పైపు లింకులు పెట్టడమనేది ఏమంత మంచి పద్ధతి కాదు:
- మద్రాసు అనే దారిమార్పు పేజీకే లింకు ఇవ్వాలి గాని,
[[చెన్నై|మద్రాసు]]
అనే పైపు లింకు పెట్టకూడదు. అవసరం లేని చోట పైపు లింకును వాడితే వికీటెక్స్టును చదవడం కష్టమౌతుంది. పైగా, దారిమార్పు పేజీకి వెళ్ళే లింకుల సంఖ్యను బట్టి, ఆయా లింకులకు ప్రత్యేకించి పేజీని సృష్టించాలా అనేది తెలుస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో ఆ పేజీ సృష్టిస్తే, ఆయా లింకులను సవరించాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు:[[మద్రాసు]]
అనే లింకు ప్రస్తుతం చెన్నైకి దారిమార్పు అవుతోంది. భవిష్యత్తులో పాత పేరు "మద్రాసు"కు ప్రత్యేకంగా పేజీ ఉండాలని నిర్ణయించి దానికోసం ఓ కొత్త పేజీ సృష్టించామను కోండి.. అప్పుడు వివిధ పేజీల్లో[[మద్రాసు]]
అనే లింకులన్నీ ఈ కొత్త పేజీకి ఆటోమాటిగ్గా వెళ్ళిపోతాయి. అలాక్కాకుండా[[చెన్నై|మద్రాసు]]
అనే లింకు పెడితే, వాటన్నిటినీ మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుంది.
- పదం చివర ప్రత్యయం చేరితే, ఆ పదం వరకే లింకు ఇవ్వాలి:
- అయితే, అన్ని ప్రత్యయాలకూ ఇది కుదరదు. ఉదాహరణకు "అనంతపురం మండలానికి" అనే పదాల్లో "అనంతపురం మండలం" అనే పదాలను విడగొట్టి లింకు ఇవ్వలేం. ఆ సందర్భాల్లో పైపు లింకు ఇవ్వవచ్చు.
పారదర్శకత
[మార్చు]పైపు లింకులు వీలైనంత పారదర్శకంగా ఉండాలి. లింకును నొక్కి గమ్యం పేజీని తెరిస్తే తప్ప ఆ లింకు గురించి అర్థం కాకపోతే, అది పారదర్శకంగా లేనట్లే. మరో సంగతేంటంటే, వ్యాసాలను ముద్రించుకుని చదిచే వారు ఉండవచ్చు. కింది ఉదాహరణ చూడండి.., అలా రాయకూడదు:
- ...తెలుగుకవుల్లో జ్ఞానపీఠ పురస్కారం పొందిన వారు పెద్దగా లేరు, ఏవో కొన్ని [[విశ్వనాథ సత్యనారాయణ|మినహాయింపులు]] తప్పించి.
ఆలింకు ఇచ్చినది విశ్వనాథ సత్యనారాయణ పేజీకి అనే సంగతి, ఆ లింకు మీద కర్సరు పెడితే తప్ప పాఠకుడికి తెలియదు, ఊహించలేరు కూడా. ముద్రించి చదువుకునే వారికి అసలా లింకు కనబడే అవకాశమే లేదు.ఆ లింకును ఇలా పెట్టాలి:
- ...తెలుగుకవుల్లో జ్ఞానపీఠ పురస్కారం పొందిన వారు పెద్దగా లేరు, [[విశ్వనాథ సత్యనారాయణ]] వంటి మినహాయింపులు తప్పించి.
అలాగే:
- ఈ చర్యకు అంతకు ముందు జరిగిన ఉగ్రవాద వ్యతిరేక చర్యను ఆదర్శంగా...
బదులు, ఇలా రాయవచ్చు:
- ఈ చర్యకు అంతకు ముందు జరిగిన ఉగ్రవాద వ్యతిరేక చర్య, ఆపరేషన్ ఎంటెబీని ఆదర్శంగా...
లేదా ఇలా:
- గతంలో జరిగిన ఆపరేషన్ ఎంటెబీని ఈ చర్యకు ఆదర్శంగా ...
కొన్ని సందర్భాల్లో ఒకటి రెండు పదాలకు కాకుండా ఒక పదబంధానికే లింకు ఇవ్వాల్సి రావచ్చు. అలాంటి సందర్భాల్లో పదానికి కాకుండా మొత్తం పదబంధానికే లింకు ఇవ్వాలి.
- విజయనగర రాజు, ఆనందరాజు (పూసపాటి ఆనంద గజపతి రాజు)తో ఒప్పందం కుదుర్చుకుని - ఈ వాక్యంలో
- విజయనగర రాజు, ఆనందరాజు (పూసపాటి ఆనంద గజపతి రాజు)తో ఒప్పందం కుదుర్చుకుని
అని రాస్తే, ఇక్కడ ఇచ్చిన ఒప్పందం అనే లింకు ఒప్పందం అనే పేజీకి వెళ్తుందేమోనని అనిపిస్తుంది. అలా కాకుండా, కింది విధంగా రాస్తే మరింత వివరంగా ఉంటుంది:
వర్గాల్లో పైపు లింకులు
[మార్చు]వర్గం లింకుల్లో ఇచ్చే పైపు లింకుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ పేజీ ఆ వర్గంలో ఏ అక్షరం కింద చేరాలి అనేదాన్ని ఈ పైపు లింకులో పైపు తర్వాత రాసే మొదటి అక్షరం నిర్ణయిస్తుంది. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు అనే పేజీలో వర్గం:ఆంధ్రప్రదేశ్ అని రాసి వదిలేస్తే, ఈ పేజీ ఆ వర్గంలో "ఆ" అక్షరం కింద ఉన్న జాబితా లోకి చేరుతుంది. ఆంధ్రప్రదేశ్ పట్టణాలు, ఆంధ్రప్రదేశ్ నగరాలు, ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ నదులు,... ఇలా "ఆంధ్రప్రదేశ్" తో మొదలయ్యే కొన్ని వందల పేజీలు ఉంటాయి. ఈ పేజీలన్నిటి లోనూ వర్గాన్ని ఇలాగే, వర్గం:ఆంధ్రప్రదేశ్ అనే రాస్తే, ఈ పేజీలన్నీ కూడా ఆ వర్గంలో "ఆ" అక్షరం కిందకే చేరుతాయి. ఇక అక్షరాకు అనుగుణంగా వర్గీకరించి ప్రయోజనం ఉండదు. దీన్ని నివారించడానికి ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు అనే పేజీలో వర్గాన్ని వ్యక్తులు అని పైపు లింకు పెట్టి రాస్తే, ఈ పేజీ ఆంధ్రప్రదేశ్ వర్గంలో "వ" అక్షరం కిందికి చేరుతుంది. "సోర్స్ ఎడిటింగు" పద్ధతిలో దిద్దుబాటు చేసేటపుడు ఇలా చెయ్యాలి. నిజానికి వ్యక్తులు అని పూర్తి పదం రాయాల్సిన పని లేదు, "వ్య" అని మొదటి అక్షరం రాస్తే సరిపోతుంది -ఎందుకంటే మొదటి అక్షరం ఏదైతే, వర్గంలో ఆ అక్షరం కిందనే ఈ పేజీ చేరుతుంది కబట్టి.
విజువల్ ఎడిటింగు పద్ధతిలో దిద్దుబాటు చేసేటపుడు, "వర్గాలు" అనే డయలాగ్ పెట్టెలో వర్గం పేరు రాసాక, కింద ఉన్న "ఈ పేజీని క్రమబద్ధీకరించువిధము" అనే టెక్స్టు బాక్సులో "వ్యక్తులు" అని రాయాలి. ఈ పద్ధతిలో కూడా మొదటి అక్షరం రాస్తే సరిపోతుంది.
మూసల్లో
[మార్చు]మూసల్లో కూడా పైపు వాడతారు కానీ అక్కడ పైపు ఉపయోగం పూర్తిగా వేరు. మూసల్లో పారామీటర్లు ఇచ్చేందుకు పైపును వాడుతారు.