వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/ప్రమాణాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి చేసే సభ్యులకు ఉండదగిన అర్హతలు, ప్రమాణాల విషయమై కొన్ని మార్గనిర్దేశకాలు. ముఖ్యంగా ఇవి శిలాశాసనాలు కావని గుర్తించాలి. సమయానుగుణంగా, ఒక్కో ఆభ్యర్ధిత్వాన్ని బట్టి, సముదాయము యొక్క విచక్షణను బట్టి పట్టువిడుపులు ఉండవచ్చు.

  1. అభ్యర్ధికి తెలుగు వికీపీడియాలో ఖాతా ఉండాలి.
  2. అభ్యర్ధికి సభ్యుల పేజీ ఉండి ఉండాలి. ఆ సభ్యుల పేజీలో వ్యక్తిగత విషయాలు బయల్పరచవలసిన అవసరము లేదు కానీ తన వికీ ఇష్టాఇష్టాలు, పరిజ్ఞానము, వికీలో ఇంతవరకు చేసిన కృషి గురించి కొంతైనా సమాచారం ఇవ్వదగినది. ఈ విధముగా అభ్యర్ధి యొక్క ఇష్టాఇష్టాలు మరియు కృషిని సభ్యులందరూ తెలుసుకోగలరు.
  3. తెలుగు వికీపీడియాలో కనీసం ఒక మూడు నెలలైనా పనిచేసిన అనుభవం ఉండాలి.
  4. అభ్యర్ధి కనీసం ఒక వెయ్యి దిద్దుబాట్లైనా చేసి ఉండాలి (ఈ దిద్దుబాట్లు అన్ని నేంస్పేసులలోను విస్తరించి ఉంటే మరింత సానుకూలంగా ఉంటుంది).
  5. అభ్యర్ధి యొక్క దిద్దుబాట్ల రాసితో పాటు వాసిని కూడా పరిగణలోకి తీసుకుంటారు (ఉదా: ఎన్ని విశేష వ్యాసాలను రాశారు/లేదా మంచి వ్యాసాలపై పని చేశారు అనే సంఖ్య)
అవగాహన
  1. వికీ పద్ధతులు, మరియు విధానాలను (పాలసీలను) అర్థం చేసుకుని ఆచరిస్తూ ఉండాలి. (ఉదాహరణకు, దిద్దుబాటు సారాంశం రాయడం - వికీ దీన్ని చాలా మంచి అలవాటుగా పరిగణిస్తుంది, చిన్న మార్పులను గుర్తించడం, వ్యాసాల్లో వ్యక్తుల పేర్లు ఎలా రాయాలి, ఏకవచన సంబోధన వంటి శైలికి సంబధించిన విషయాలు మొదలైనవి)
  2. మూస, వర్గం, పట్టిక వంటి వికీపీడియా అంశాలను ఎంత బాగా అర్థం చేసుకుని ఉండాలి.
ఆసక్తి
  1. నిర్వహణా వ్యవహారాలలో ఆసక్తి.
  2. వికీ విధానాలపై చర్చలో పాల్గొని చక్కటి అభిప్రాయాలను వెల్లడించేవారు నిర్వాహకత్వానికి మెరుగైన అభ్యర్ధులౌతారని తెవికీ సముదాయము యొక్క ఉద్దేశ్యం.
  3. మంచి సూచనలు, సలహాలు ఇచ్చేవారు (సూచనలు, సలహాలు ఇవ్వగలిగిన వారు తప్పక వికీ గురించి ఎక్కువగానే తెలిసి ఉండి ఉంటారు)
  4. ఇతరసభ్యుల అభిప్రాయాలను గౌరవించేవారు
  5. తోటి సభ్యులతో సఖ్యతతో వ్యవహరించాలి.
  6. కొత్త ఆలోచనలతో మార్పులు చేయువారు.
  7. నిర్వాహక హోదాకై స్వీయ ప్రతిపాదన చేసుకున్నవారు.