Jump to content

వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/ఆరవ స్కైప్ సమావేశం నివేదిక

వికీపీడియా నుండి
తేది, సమయం

డిసెంబర్ 18,2013, భారత కాలమానం ప్రకారం ఉదయం 08;30 నుండి 09:30

పాల్గొన్న వారు

అర్జున, రాజశేఖర్, రాధాకృష్ణ,

పాల్గొననివారు

వైజాసత్య, సుజాత

సమావేశ సారాంశం

సుజాత గారు అనుకోని విధంగా ప్రయాణంలో వున్నందున హాజరు కాలేకపోతున్నానని చెప్పినట్లు అర్జున సమావేశానికి తెలిపారు. వైజాసత్య హాజరుకాకపోవటంతో సమావేశానికి అర్జున అధ్యక్షత వహించారు.

  1. క్రితం సమావేశం నివేదిక ఖరారుచేయబడింది.
  2. వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/కొలబద్ద స్పందనలపై సమీక్ష. వాడుకరి :రహ్మానుద్దీన్ గారు ట్రాన్స్లేట్ వికీ ని పరిగణించమన్నారు. ఇది మంచి సూచన. దీనిని చర్చించి దీనిలో కృషి వికీకు దగ్గరి సంబంధమున్నందున, వీకీమీడియా నిర్వహించే ప్రాజెక్టు కానప్పటికి, సాంకేతికాలతో కొద్దిగా సంబంధమున్నందున వికీసాంకేతికాల విభాగంలో పరిగణించుటకు నిర్ణయించడమైనది.
  3. ప్రతిపాదనల సమీక్ష

గడువు ముగిసే సమయానికి వచ్చాయి. వాటిలో 18 అంగీకారం పొందినవిగా నమోదవడం సంతోషించదగ్గ విషయం. ఈ ప్రక్రియలో పాల్గొన్న సహసభ్యులందరకు ఎంపికమండలి తరపున ధన్యవాదాలు. తొలిదశలో వికీలో విస్తృత కృషి చేసిన కొంత మంది సభ్యులు తమ అంగీకారం తెలపనందులకు ఎంపికమండలి విచారం వెలిబుచ్చింది. ఒకటి రెండు తప్ప ప్రతిపాదనలన్నీ చాలావరకు అసంపూర్ణంగా వుండడం వలన ఎంపిక సమర్ధవంతంగా చేయటానికి ఎంపికమండలిపై భారం పెరగనుంది. ఎంపిక మండలి సభ్యులందరు ప్రతిపాదిత సభ్యుల గణాంకాలను మరియు వాటి ప్రభావాన్ని పరిశీలించి వచ్చే సమావేశంలో చర్చించటానికి నిర్ణయం తీసుకొంది.

ప్రతిపాదిత సభ్యుల ఛాయాచిత్రాలు వికీపీడియా లోలేకపోతే వికీపీడియాలో చేర్చి వాడుకరి పేజీలో పెట్టమని సభ్యులకు తెలియచేయాలని నిర్ణయించింది.

  1. తరువాతి సమావేశం తేది నిర్ణయం

20, 22 డిసెంబర్ 2013

పూర్తైన పనులు
  1. ప్రతిపాదనలు మెరుగుచేయటానికి కొలబద్ద ని గమనించి తగిన ఆధారాలు, వివరాలు చేర్చవలసిందిగా ప్రతిపాదించిన సభ్యునికి, ప్రతిపాదితసభ్యునికి తెలపాలని నిర్ణయం తీసుకోవడమైంది. అర్జున