వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పాలపర్తి వెంకటేశ్వర్లు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: అసంపూర్తి. అర్జున (చర్చ) 04:22, 3 అక్టోబర్ 2013 (UTC)
పాలపర్తి వెంకటేశ్వర్లువ్యాసంలోని వివరాల ప్రకారం వికీపీడియాలో వుండాల్సిన వ్యాసం en:WP:NOTE ప్రకారం కాదు .--అర్జున (చర్చ) 05:14, 6 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- అవసరం లేదు అనుకొంటున్నాను, దీనిని తొలగించవచ్చు. విశ్వనాధ్ (చర్చ) 14:54, 6 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- జిల్లా కలెక్టరుగా, జిల్లా ముఖ్య కార్యనిర్వాహణాధికారి గానే కాకుండా రాష్ట్రస్థాయి ఉన్నత పదవులలో పనిచేసిన వ్యక్తి కాబట్టి వార్తాపత్రికలలో, ప్రభుత్వ వెబ్సైట్లలో వివరాలుంటాయి. కనుక వ్యాసాన్ని కొద్దిగా మార్చి మూలాలు ఇస్తే సరిపోతుంది. తొలిగించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మామూలు గల్లీ లీడర్ల వ్యాసాలు కూడా ఉన్నప్పుడు జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి అధికారుల వ్యాసాలు తెవికీలో ఉండరాదనుకోవడం భావ్యం కాదు. ఈ వ్యాసం సభ్యుడు స్వయంగా చేర్చలేదు. ఇది ప్రచార వ్యాసం కూడా కాదు. గూగుల్ సెర్చ్ చేస్తే పావె గారు ఆప్కో ఎండీగా, ఆదిలాబాదు జిల్లా కలెక్టరుగా పనిచేసినట్లు వివిధ పత్రికలలో వార్తలు వచ్చినట్లు గమనించాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:36, 6 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- చంద్రకాంతరావు గారు చెప్పింది సమంజసంగా ఉంది.వ్యాసం ఉంచితే ఆయన గురించిన విశేషాలు మరిన్ని జమ కావచ్చు.--Nrahamthulla (చర్చ) 05:49, 7 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- అలా అనుకుంటే ప్రతి ఐ.ఏ.ఎస్ కి ఒక పేజీ తయారు చేయాలి. రాష్ట్రస్థాయి ఉన్నత పదవులలో పనిచేసిన, చేస్తున్న, చేసే వ్యక్తులు వాళ్ళు వాళ్ళే అవుతారు కనుక. వీలయితే ఆంధ్రప్రదేశ్ కలెక్టర్లు, ప్రఖ్యాత ఐ.ఏ.ఎస్ ల మూస తయారు చేసి అనేక వ్యాసాలు చేయచ్చు.చేర్చచ్చు. చంద్రకాంతరావు గారూ అలాటి సమాచార వ్యాసాలు మీరే ఎక్కువ చేర్చారు కనుక మీకే సాధ్యం అవుతుంది. మొదలు పెడితే మేమూ తలో చేయీ వేస్తాం విశ్వనాధ్ (చర్చ) 15:22, 7 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- వికీ మూలస్వరూపానికి విరుద్ధమైనవి (ప్రాధాన్యత లేనివాటిని చేర్చటం) ఆదిలోనే తోలగించటం మంచిది. ఇంతకు ముందు కోత్తోక వింతగా, రాసిపై ప్రాధాన్యము పేట్టి వాసి కోల్పోయాము ( ఉదా: ప్రతి ఊరికి ప్రత్యేక వ్యాసం). ఇంతవరకు వికీలో ప్రాధాన్యత లేని వ్యాసాల తోలగింపు కార్యక్రమం పథకంలా చేపట్టకపోతే, ఇప్పుడైనా అందరం ఆ పనిచేస్తే వికీ నాణ్యత పేరుగుతుంది. ( అన్నట్లు ఈ వ్యాఖ్యలో ో కి హ్రస్వ గుణింత రాయలేకపోవడం, వేరే యంత్రం లో రాయడం వలన తప్పులు కోత్త నరయం ఇన్‌స్క్రిప్ట్ ద్వారా దోర్లినవి క్షమించగలరు)--అర్జున (చర్చ) 15:44, 7 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- విశ్వనాథ్ గారు, ఇలాంటి వ్యాసాలను నేను చేర్చలేదండి, ఉన్న వ్యాసాన్ని తొలిగించడానికి మాత్రం అభ్యంతరపరుస్తున్నాను. "అలా అనుకుంటే ప్రతి ఐఏఎస్ కి ఒక పేజీ తయారు చేయాల"ని వ్రాశారు కాని ఈ వ్యాసం ఉన్నందుకే ప్రతి ఐఏఎస్ పేజీ ఖచ్చితంగా ఉండాలని ఏమీ లేదండి. ఎప్పుడో ఒకప్పుడు చేర్చేవారు చేర్చుతారు. అర్జునరావు గారు, ఈ వ్యాసం వికీ మూలస్వరూపానికి విరుద్ధమైనదని (ప్రాధాన్యత లేనివాటిని చేర్చటం) అని ఎలా చెప్పగలరండి! ఒక్క సినిమాలో ఆడితే నటుడు అని పేజీ తయారుచేస్తాం, ఒక్క మ్యాచ్ లో ఆడితే క్రీడాకారుడని పేజీ సృష్టిస్తాం, ఒక్క ఎన్నికలో గెలిచితే రాజకీయనాయకుడంటాం, కొద్దిగా సంగీతం బజాయిస్తే పెద్ద సంగీతకారుడంటాం, ఒక్క పాట రాస్తే గొప్ప రచయిత అంటాం, ఒక చిత్రం గీస్తే ఉన్నత చిత్రకారుడంటాం, ఒక పుస్తకం రాస్తే గొప్ప రచయితనంటాం, మరి చిన్నప్పటి నుంచి ఎంతో శ్రమకోర్చి విజ్ఞానం సంపాదించి జాతీయస్థాయిలో ర్యాంకు సంపాదించి ఐఏఎస్ శిక్షణ పొంది కలెక్టరు అయినవాళ్ళకు తెవికీలో విలువలేదా? ఇవ్వరాదా? కలెక్టర్లు మీ దృష్టిలో ప్రాధాన్యత లేనివారు ఎలా అయ్యారండి? జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులు పొందిన అధికారులు పైన తెలిపిన వ్యక్తుల కంటే హీనమా? ఈ విషయం బ్యూరోక్రసిలో ఉన్నవాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ప్రతి ఊరికి ప్రత్యేక వ్యాసం రాసి ప్రాధాన్యత కోల్పోయాం అనడం కూడా సరైనది కాదు. తెవికీలో ఎక్కువ చురుకైన సభ్యులు లేకపోబట్టి గ్రామవ్యాసాలు ముందుకు పోవడం లేదు కాని తెవికీలో అవే అధిక ప్రాధాన్యత పొందే వీలుంది. ఇప్పటికీ కొత్త మరియు అజ్ఞాత సభ్యులు కూడా గ్రామవ్యాసాలపైనే దిద్దుబాట్లు అధికంగా చేస్తున్నారు. తెవికీలో ప్రాధాన్యత లేని వ్యాసం అని అనుకోవడానికి వీలుండదు. ఒకరికి ప్రాధాన్యత లేనిది మరొకరికి ప్రాధాన్యత కలిగి ఉండవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:01, 7 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- వికీ మూలస్వరూపానికి విరుద్ధమైనవి (ప్రాధాన్యత లేనివాటిని చేర్చటం) ఆదిలోనే తోలగించటం మంచిది. ఇంతకు ముందు కోత్తోక వింతగా, రాసిపై ప్రాధాన్యము పేట్టి వాసి కోల్పోయాము ( ఉదా: ప్రతి ఊరికి ప్రత్యేక వ్యాసం). ఇంతవరకు వికీలో ప్రాధాన్యత లేని వ్యాసాల తోలగింపు కార్యక్రమం పథకంలా చేపట్టకపోతే, ఇప్పుడైనా అందరం ఆ పనిచేస్తే వికీ నాణ్యత పేరుగుతుంది. ( అన్నట్లు ఈ వ్యాఖ్యలో ో కి హ్రస్వ గుణింత రాయలేకపోవడం, వేరే యంత్రం లో రాయడం వలన తప్పులు కోత్త నరయం ఇన్‌స్క్రిప్ట్ ద్వారా దోర్లినవి క్షమించగలరు)--అర్జున (చర్చ) 15:44, 7 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- అలా అనుకుంటే ప్రతి ఐ.ఏ.ఎస్ కి ఒక పేజీ తయారు చేయాలి. రాష్ట్రస్థాయి ఉన్నత పదవులలో పనిచేసిన, చేస్తున్న, చేసే వ్యక్తులు వాళ్ళు వాళ్ళే అవుతారు కనుక. వీలయితే ఆంధ్రప్రదేశ్ కలెక్టర్లు, ప్రఖ్యాత ఐ.ఏ.ఎస్ ల మూస తయారు చేసి అనేక వ్యాసాలు చేయచ్చు.చేర్చచ్చు. చంద్రకాంతరావు గారూ అలాటి సమాచార వ్యాసాలు మీరే ఎక్కువ చేర్చారు కనుక మీకే సాధ్యం అవుతుంది. మొదలు పెడితే మేమూ తలో చేయీ వేస్తాం విశ్వనాధ్ (చర్చ) 15:22, 7 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- చంద్రకాంతరావు గారు చెప్పింది సమంజసంగా ఉంది.వ్యాసం ఉంచితే ఆయన గురించిన విశేషాలు మరిన్ని జమ కావచ్చు.--Nrahamthulla (చర్చ) 05:49, 7 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- జిల్లా కలెక్టరుగా, జిల్లా ముఖ్య కార్యనిర్వాహణాధికారి గానే కాకుండా రాష్ట్రస్థాయి ఉన్నత పదవులలో పనిచేసిన వ్యక్తి కాబట్టి వార్తాపత్రికలలో, ప్రభుత్వ వెబ్సైట్లలో వివరాలుంటాయి. కనుక వ్యాసాన్ని కొద్దిగా మార్చి మూలాలు ఇస్తే సరిపోతుంది. తొలిగించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మామూలు గల్లీ లీడర్ల వ్యాసాలు కూడా ఉన్నప్పుడు జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి అధికారుల వ్యాసాలు తెవికీలో ఉండరాదనుకోవడం భావ్యం కాదు. ఈ వ్యాసం సభ్యుడు స్వయంగా చేర్చలేదు. ఇది ప్రచార వ్యాసం కూడా కాదు. గూగుల్ సెర్చ్ చేస్తే పావె గారు ఆప్కో ఎండీగా, ఆదిలాబాదు జిల్లా కలెక్టరుగా పనిచేసినట్లు వివిధ పత్రికలలో వార్తలు వచ్చినట్లు గమనించాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:36, 6 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- మీరు పైన చెప్పిన వాటిలో కొన్ని కరెక్టైనా, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులు పొందిన అధికారులు పైన తెలిపిన వ్యక్తుల కంటే హీనమా? అని రాసినది మాత్రం కరెక్ట్ కాదు. కళ, విద్య వేరు. ఉన్నత విద్యలు చదివిన డాక్టర్లు, ఇంజనీర్లు లాంటి అనేకులు కళల ద్వారా ప్రఖ్యాతి పొందినవారున్నారు. "ఒక్క సినిమాలో ఆడితే నటుడు అని పేజీ తయారుచేస్తాం, ఒక్క మ్యాచ్ లో ఆడితే క్రీడాకారుడని పేజీ సృష్టిస్తాం, ఒక్క ఎన్నికలో గెలిచితే రాజకీయనాయకుడంటాం, కొద్దిగా సంగీతం బజాయిస్తే పెద్ద సంగీతకారుడంటాం, ఒక్క పాట రాస్తే గొప్ప రచయిత అంటాం, ఒక చిత్రం గీస్తే ఉన్నత చిత్రకారుడంటాం, ఒక పుస్తకం రాస్తే గొప్ప రచయితనంటాం" అని రాసారు. ఒక్క సినిమాలో నటిస్తే నటుడైపోడు అతనికి పేజీ సృష్టించేయం, కొద్దిగా సంగీతం బజాయిస్తే సంగీతకారుడు అనేయలేం ఎందుకంటే అలా బజాయిస్తూ రోడ్లవెంట అనేక సంగీతకారులు తిరుగుతున్నారు అడుక్కుంటూ, వారందరికీ పేజీలు తయారుచేయలేం. ఒక్కో పాట రాసిన గొప్ప రచయితల పేజీలు ఎన్నున్నాయి మన వికీలో. ఒక్క ఎన్నికలో గెలిచినా ఎన్నిట్లో గెలిచినా అనేక మంది కలసి ఇతడు నాయకుడు అని ఎన్నుకోబట్టి మమూలు వ్యక్తి రాజకీయనాయకుడు అవుతాడు. ఐఏఎస్ శిక్షణ పొంది కలెక్టరు అయినవాళ్ళకు తెవికీలో విలువలేదా? కలెక్టర్లు మీ దృష్టిలో ప్రాధాన్యత లేనివారు ఎలా అయ్యారండి? అని రాసారు. ఎందుకు ప్రాధాన్యం ఉండదండి. లేకే స్వయంకృషితో పైకెదిగిన జె.పి ని కె.పి.హెచ్.బి. నుండి గెలిపించామా ?. ఎవరికి ఉండే ప్రాధాన్యం వారికి ఉంటుంది. కాని కళ, కళ ద్వారా గుర్తింపు పొందిన వారు వేరు, చదువు, చదువు ద్వారా గుర్తింపు పొందిన వారు వేరు. అ రెండిటికి వెటికవే గొప్పవి. వీళ్లు మాత్రమే గొప్ప వాళ్ళు కాదు అని లేదు. ప్రాధాన్యత కలిగిన వ్యాసం అనిపిస్తే అభివృద్ది చేయండి, మరింత సమాచారం ద్వారా మాకూ తెలుస్తుందికదండి.ఇది తప్పక ఉండవలసిన వ్యాసం అని
- అర్జునరావు గారూ ఆంధ్రప్రదేశ్ గ్రామాల వివరాలు వెతికే వారికి ఎక్కడా కనీసం 10 శాతం కూడా దొరకడంలేదు. ఒక్క వికీలోనే కొంత వరకూ దొరకటం జరుగుతున్నది. చంద్రకాంత్ గారు రాసినట్టుగా కొత్త సభ్యులు ముందుగా సమాచారము చేర్చడానికి ఆశక్తి చూపించేది తమ, తమకు తెలిసిన గ్రామముల వ్యాసములలోనే. అవి ముందు ముందు మంచి వ్యాసాలుగా మారుతాయి. విశ్వనాధ్ (చర్చ) 06:29, 8 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- గ్రామం పేరు వికీలో వుండడానికి, గ్రామం పేరుతో ప్రత్యేక పేజీ వుండటానికి చాలా వ్యత్యాసముంది. గ్రామం పేరుతో లింకు వచ్చితే 99 శాతం గ్రామాలకు ఏం సమాచారం దొరుకుతుందంటే అది ఏ మండలంలో వున్నాయి, ఏ జిల్లా లో వున్నాయి మాత్రమే. అది తెలుసుకొనడానికి ఆ గ్రామం పేరు ఆ మండలం వ్యాసం లేక జాబితాలో వుంచినా సరిపోతుంది. వెతికినప్పుడు ఆ లింకు ఎలాగూ వస్తుంది. ఊరి వ్యాసం పై ఆసక్తిగలవారు ఆ లింకుకి వెళ్లి ఎలాగు ప్రత్యేక వ్యాసం సృష్టించవచ్చు. ఇక చంద్రకాంతరావు గారి వాదనతో ఏకీభవించలేను. దానిని అలాగే కొనసాగిస్తే ప్రతి మనిషికి పేజీ వుండాలి ఎందుకుంటే ప్రతి మనిషికి వారికి దగ్గరి వారి దృష్టిలో ప్రాధాన్యత వుంటుంది. ఇక్కడ మనమందరము వికీ ప్రాధాన్యత పై ఏకాభిప్రాయానికి రావాలి.ఆ దిశగా స్పందించమని కోరుతున్నాను. సంబంధిత వ్యాసంలో ఒక పత్రికలో వ్యాసాన్ని మూలంగా పేర్కొన్నారు. నేటి వార్తాపత్రికల ప్రాంతీయ ఎడిషన్ల ద్వారా మారుమూల విషయాలు ప్రచురిస్తున్నాయి. అవి కొన్నాళ్లకే వెబ్‌లో కనుమరుగవుతాయి.జనాలు మరిచిపోతారు. వాటిని ప్రామాణికంగా తీసుకొనాలా అన్నదే దీనివలన వచ్చే మరో ప్రశ్న. తెవికీ అభివృద్ధి కొంతవరకు జరిగి కుంటుబడింది. దీనిని ఇంకా అభివృద్ధి చేయాలంటే సభ్యులు విధానాల పై దృష్టిపెట్టాలి. దానికనుగుణంగా వికీని నిర్వహించాలి.ఎవరికి వారు ఏదైనా రాసుకోవచ్చు తర్వాత ఇంకెవరో వృద్ధిచేస్తారులే అనుకుంటే, ఇంగ్లీషు వికీలాగా తెవికీ వుపయోగబడే వనరు కాలేదు.--అర్జున (చర్చ) 07:01, 8 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
వికీలో రాయాలంటే ఆశక్తితో పాటు కొంత వికీ గురించి తెలుసుకోవటం అవసరం. అందుబాటులో నెట్ ఉన్నవాళ్లకు పర్వాలేదు. నెట్ సెంటర్లలో కూర్చొని తమ ఊరు వ్యాసం కొత్తగా సృష్టించి దానిలో సమాచారం చేర్చేవారు అరుదు. అప్పటికే వ్యాసం ఉండి దానిలో సమాచారం లేకపోతే వెంటనే స్పందించి ఏదో ఒకటి రాయలనిపిస్తుంది, ఉంటే మరికొంత తమకు తెలిసింది మరికొంత రాయాలనుకుంటారు. 2007,08,09 లో వికీ ఎక్కువగా అభివృద్ది చెందడానికి ఇలా ప్రోత్సహించడమే కారణం. తరువాత వ్యాసాల కంటే వాటిని గురించి వాదనల కారణంగా కొందరు విసుగు చెందటం, బాధపడటం ద్వారా దూరమైపోయారు. వారికి ఎలా రాయాలో చెప్పకుండా కొత్తవారు రాసినదానిని వెంటనే చెరిపేస్తుండటం వలన కొత్త సభ్యుల దిద్దుబాట్లు తగ్గిపోతున్నాయి. ఆంగ్ల వికీ లాగ తెలుగు వికీ ఉపయోగపడే వనరు కాకుండా పోవడం జరగటం లేదు. ఇప్పటికే తెలుగులో కావలసిన సమాచారం కొరకు మొదటగా దీనినే ఆశ్రయిస్తున్నారు. అయినా ప్రపంచం మొత్తం విస్తరించుకొన్న ఆంగ్లవికీతో తెలుగుకు పోలిక చేయడం కంటే ఉన్న వనరులతో ముందుకు వెళ్లడం ఉత్తమం.విశ్వనాధ్ (చర్చ) 07:38, 8 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- "జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులు పొందిన అధికారులు పైన తెలిపిన వ్యక్తుల కంటే హీనమా? అని రాసినది మాత్రం కరెక్ట్ కాదు" అనడం సరైనది కాదు. పైన సభ్యులు చెప్పినవాటి ప్రకారం అధికారులపై వివక్ష స్పష్టంగానే కనిపించింది. "కళ, విద్య వేరు. ఉన్నత విద్యలు చదివిన డాక్టర్లు, ఇంజనీర్లు లాంటి అనేకులు కళల ద్వారా ప్రఖ్యాతి పొందినవారున్నారు" అనడం సాంకేతిక విద్య అభ్యసించిన వారికే కాని అధికారులకు వర్తించదు. ఒక్క...ఒక్క... అనలేం కాని ఇక్కడ మాత్రం వారికే ప్రాధాన్యత ఉంది. రోడ్లవెంబడి తిరిగే "సంగీతకారుల" వ్యాసాలు కూడా తెవికీలో రావచ్చు, ఎందుకంటే అలాంటివాటికి ఎవరూ అభ్యంతరం చెప్పరు! జేపీకి అధికారిగా కాకుండా రాజకీయ నాయకుడిగానే ప్రాధాన్యత ఉంది. గ్రామవ్యాసాలలో 99% వ్యాసాలు కేవలం ఏకవాక్య వాక్యాలుగానే (మండలం, జిల్లా తెలిపే) సంబోధించబడింది. ఆ శాతం ఎలా తీసుకున్నారో తెలియదుకాని నేను రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాదు జిల్లాలకు సంబంధించిన చాలా గ్రామవ్యాసాలలో సమాచారం చేర్చాను. ఉదా:కు తాండూరు మండలమునకు చెందిన ఏ గ్రామవ్యాసమైననూ చూడండి, ఏదీ ఏకవాక్యం కాదు. కొత్తవారు కూడా గ్రామవ్యాసాలలో సమాచారం బాగానే చేర్చుతున్నారు. నా వాదనతో ఏకభవించ లేను. దానిని అలాగే కొనసాగిస్తే ప్రతి మనిషికి పేజీ వుండాలి ఎందుకుంటే ప్రతి మనిషికి వారికి దగ్గరి వారి దృష్టిలో ప్రాధాన్యత వుంటుంది. అని రాశారు. నేను పైన వివరించేది జిల్లా, రాష్ట్ర స్థాయిలో పదవులు పొందిన అధికారుల గురించేనండీ. వారికే ఇక్కడ వ్యాసాలుంచే గతి లేనప్పుడు ప్రతిమనిషి వ్యాసాల గురించి నేను చెప్పి ఉంటే అది నా మూర్ఖత్వమే అవుతుంది. ఉన్నత స్థానం పొందిన అధికారులకు, ఇతరులకు తారతమ్యం చేసి మాత్రమే చెప్పినప్పుడు వాటిగురించే ఆలోచించాలి. పై చర్చలొ సామాన్య వ్యక్తి గురించి అస్సలు వివరించలేము. అధికారులను ప్రాధాన్యత లేనివారుగా పేర్కొన్నందుకు ఒకరికి ప్రాధాన్యత లేని వ్యాసాలు మరొకరికి ప్రాధాన్యత కలిగిఉండవచ్చు అన్నాను. రాతలను వక్రీకరిస్తే బాగుండదు. అలాగే పత్రికలోని విషయాలకు మూలంగా పేర్కొనడం తప్పేమి కాదు. దీనిపైన ఇదివరకే చాలా సార్లు చర్చ జరిగింది. ఇక వ్యాసం విషయానికి వస్తే ఈ వ్యాసం తొలిగించడానికి ఏ కారణం కనిపించుటలేదు. ఇది అతిచిన్న వ్యాసం కాదు, పూర్తిగా ఆంగ్లంలో లేదు, మూలాలు లేవని చెప్పడం కుదరదు, కాపీవ్యాసం కాదు, అభ్యంతరకరమైన వాక్యాలు లేవు, ప్రచారవ్యాసం కాదు, వ్యాసంతో సంబంధం ఉన్న వ్యక్తి సొంతగా వ్రాయలేరు... ఇలా ఏది చూచిననూ తొలిగించుటకు కారణం కనిపించుటలేదు. ఇక మిగిలింది ఎక్కడో ఆంగ్లవికీలోని నియమాన్ని చూపించి తొలిగించాలని ప్రతిపాదించడం ఒక్కటే (అదే జరిగింది). కొసమెరుపు ఏమిటంటే ఏ ఆంగ్లవికీ నియమాన్ని చూపించి దీన్ని తొలిగించాలని చూస్తున్నారో అదే ఆంగ్లవికీలో ఇలాంటి అధికారులకు సంబంధించిన పెద్ద వర్గమే ఉంది. (చూడండి: en:Category:Indian civil servants) సి. చంద్ర కాంత రావు- చర్చ 16:02, 8 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- పనిచేసే సభ్యులు తక్కువగా వున్నప్పుడు ప్రాధాన్య విషయాలపై దృష్టిపెట్టితే నాణ్యత బాగుంటుంది. భౌగౌళికంగా తీసుకుంటేరాష్ట్రం, జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇతర రాష్ట్రాలు, మన రాష్ట్ర మండలం, గ్రామాలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తే నాణ్యత మెరుగుగా వుంటుంది. ఇది ఏ మాధ్యమంలో నైనా ప్రాధాన్యతలు నిర్ణయించేటప్పుడు జరిగేదే. నాణ్యత మెరుగయ్యేది నలుగురు కలసి పనిచేసేటప్పుడేకదా. అలాగే దీనిని వ్యక్తులకు అన్వయించవచ్చు. 99% అన్నది నేను గుణించి వాడినది కాదు. గుణించితే దానికి చాలా దగ్గర సంఖ్యే వస్తుందని వికీలో నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్న అనుభవం ప్రకారం చెప్తున్నాను. వికీ సభ్యులు విరమించడానికి రకరకాలైన కారణాలుంటాయి. చర్చలకు భయపడి వెళ్లిపోయేవారు ఎక్కువగా వుంటే మన చర్చల స్థాయి ఎలా వుందో సమీక్షించుకోవాలి మరియు అలా వుండడం తెవికీ కి మంచిది కాదు. చంద్రకాంతరావు గారు చివరిలో రాసినదానికి (వర్గం:వుండడం) ప్రస్తుత చర్చకు నేరు సంబంధం లేదు. ప్రతీ వర్గంలో పేరు పొందిన వ్యక్తులు తప్పకుండా ఒకటి కన్నా ఎక్కువ వుంటారు. అప్పుడు అటువంటి వర్గాలు ఏర్పడతాయి. విధానాలనేవి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ మెరుగపరచుకుంటూ పోవాలి. అయినా తొలగించటం, వుంచటం ప్రతి వికీలోనూ జరుగుతున్న జరగాల్సిన చర్చ. దీనికి స్పందించిన వారందరికి ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్న సభ్యులు తక్కువగా వుండడం వలన ప్రస్తుతానికి ఈ తొలగింపు ప్రతిపాదన ప్రక్కకు పెడుతున్నాను. నిర్వాహక కార్యక్రమాల్లో పాల్గొనే సభ్యులు పెరిగినప్పుడు మరల దీనిని చర్చించవచ్చు. --అర్జున (చర్చ) 10:05, 13 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- నేను రాసినది ఈ చర్చకు సంబంధించినదే. మీరు రాసేవి మాత్రము చర్చకు అస్సలు సంబంధం లేని విషయాలు ఉంటున్నాయి. సభ్యులు అంగీకరించకున్ననూ "ప్రస్తుతానికి" ప్రతిపాదన ప్రక్కన పెడుతున్నాను అనడంలో అర్థం ఏమిటి? అంటే మీరు అనుకున్న విధంగా నిర్ణయం వచ్చేవరకు మళ్ళీ మళ్ళీ ప్రతిపాదన చేస్తూ పోతుంటారా? ఈ చర్చలో పాల్గొన్నవారు తక్కువగా ఉన్ననూ చూసిన వారు సభ్యులు కారా? అందరూ చర్చలో పాల్గొనడానికి ఇష్టపడరు. రాజశేఖర్ గారే ఆ విషయం ఒకప్పుడు స్పష్టం చేశారు. సీనియర్ సభ్యులు దిద్దుబాట్లు చేస్తున్నారంటే చర్చా పేజీలు చూస్తున్నారనే అనుకోవాలి. దిద్దుబాట్లు చేయకున్ననూ గమనించేవారున్నారు. అసలు ఇలాంటి వ్యాసాలు తొలిగించాలని ఎందుకంటున్నారు? ఇంతకంటే తొలిగింపునకు గురయ్యే వ్యాసాలు బోలెడు ఉన్నాయి. కనీసం వాటి గురించినైనా ఆలోచిస్తే ఫలితం ఉంటుంది. అసలు చర్చతో సంబంధం లేకుండా మీరు నాకు ఉద్దేశించి చెప్పే విషయాల గురించి తర్వాత స్పందిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:19, 13 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- పనిచేసే సభ్యులు తక్కువగా వున్నప్పుడు ప్రాధాన్య విషయాలపై దృష్టిపెట్టితే నాణ్యత బాగుంటుంది. భౌగౌళికంగా తీసుకుంటేరాష్ట్రం, జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇతర రాష్ట్రాలు, మన రాష్ట్ర మండలం, గ్రామాలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తే నాణ్యత మెరుగుగా వుంటుంది. ఇది ఏ మాధ్యమంలో నైనా ప్రాధాన్యతలు నిర్ణయించేటప్పుడు జరిగేదే. నాణ్యత మెరుగయ్యేది నలుగురు కలసి పనిచేసేటప్పుడేకదా. అలాగే దీనిని వ్యక్తులకు అన్వయించవచ్చు. 99% అన్నది నేను గుణించి వాడినది కాదు. గుణించితే దానికి చాలా దగ్గర సంఖ్యే వస్తుందని వికీలో నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్న అనుభవం ప్రకారం చెప్తున్నాను. వికీ సభ్యులు విరమించడానికి రకరకాలైన కారణాలుంటాయి. చర్చలకు భయపడి వెళ్లిపోయేవారు ఎక్కువగా వుంటే మన చర్చల స్థాయి ఎలా వుందో సమీక్షించుకోవాలి మరియు అలా వుండడం తెవికీ కి మంచిది కాదు. చంద్రకాంతరావు గారు చివరిలో రాసినదానికి (వర్గం:వుండడం) ప్రస్తుత చర్చకు నేరు సంబంధం లేదు. ప్రతీ వర్గంలో పేరు పొందిన వ్యక్తులు తప్పకుండా ఒకటి కన్నా ఎక్కువ వుంటారు. అప్పుడు అటువంటి వర్గాలు ఏర్పడతాయి. విధానాలనేవి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ మెరుగపరచుకుంటూ పోవాలి. అయినా తొలగించటం, వుంచటం ప్రతి వికీలోనూ జరుగుతున్న జరగాల్సిన చర్చ. దీనికి స్పందించిన వారందరికి ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్న సభ్యులు తక్కువగా వుండడం వలన ప్రస్తుతానికి ఈ తొలగింపు ప్రతిపాదన ప్రక్కకు పెడుతున్నాను. నిర్వాహక కార్యక్రమాల్లో పాల్గొనే సభ్యులు పెరిగినప్పుడు మరల దీనిని చర్చించవచ్చు. --అర్జున (చర్చ) 10:05, 13 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.