వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నానార్థాలు
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: :తొలగించాలి. – K.Venkataramana – ☎ 15:35, 12 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పేజీని వ్యాసంగా పరిగణించుటకు అవకాశంలేదు.దీనిలోని సమాచారానికి ఎటువంటి మూలాలు లేవు. ఇది వికీపీడియాలో ఉండతగినదికాదు.స్వంత అభిప్రాయాలు రాసినట్లుగా ఉంది.ప్రామాణిక వ్యాసం కాదు.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 17:29, 23 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- రాసినవి తప్పులో ఒప్పులో కచ్చితంగా తెలియదు. తప్పో ఒప్పో తేల్చుకుందామంటే మూలాల్లేవు. నిర్ధారించుకునే వీలుండడం (వెరిఫయబిలిటీ) అనేది వికీలో ముఖ్యమైన అంశం. అది లేకుండా పోయిందిక్కడ. కొన్ని ఉదాహరణలు
- ఆర్థి అని రాసారు. అది అర్థి ఏమోనని అనుమానం. దానికి ఉన్న నానార్థాల్లో "వీడే వాడు" అని రాసారు. అది "వేడేవాడు" అని ఉండాలనుకుంటాను ("వేడేవాడు" కూడా సరైన మాట కాకపోవచ్చు.. వేడుకునే వ్యక్తి అని ఉండాలి). వీటికి మూలం ఇచ్చి ఉంటే ఈ సందేహం ఉండేది కాదు.
- చంద్రునిలో పదహారో వంతు అని మరోచోట రాసారు చంద్రుడి కళలు అని రాస్తే అర్థమయ్యేదేమో.. కానీ చంద్రుడిలో పదహారో వంతు అంటే సరిగ్గా లేదు.
- ఇంద్రధనుస్సును గుడి అంటారని రాసారొక చోట. నాకు తెలిసినంతలో ఇంద్రధనుస్సును గుడి అనరు. చంద్రుని చుట్టూ ఏర్పడే వలయాన్ని గుడి అంటారు.
- పృథ్వికి వ్యక్తి పేరు అనేది నానార్థమంట! ఏది తోస్తే అది రాసిపడేస్తారా?
- మూలాలు కావాలని ఎవరో అడిగారు గానీ, ఎవరూ పట్టించుకోలేదు. ఒక వారం పాటు చూసి, మూలాలు దొరక్కపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 00:16, 24 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.