వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు/చర్చించాల్సిన వర్గాల జాబితా
స్వరూపం
తెవికీలో కొన్ని వర్గాల పేర్లు సరిగ్గా లేవు. ఒకే వర్గంగా ఉండాల్సినవి కొద్ది అక్షర భేదాలతో రెండు లేదా రెండుకన్నా ఎక్కువ వేరువేరు వర్గాలుగా ఉంటున్నాయి. వ్యాకరణ విరుద్ధంగా ఉండే పేర్లుంటున్నై. ఇలాంటి పేర్లున్న వర్గాల గురించి చర్చించి తగు మార్పులు చెయ్యాల్సిన అవసరం ఉంది. అలాంటి వర్గాలు ఒక్కోసారి ఒక్కో వర్గం గురించి చర్చించడం లాగా కాకుండా ఒక్కసారే చర్చించి నిర్ణయిస్తే బాగుంటుంది. అలాంటి వర్గాల పేర్లను ఈ పేజీలో చేరుస్తూ ఉంటే నెలకో రెణ్ణెల్లకో ఒకసారి చర్చించి సరైన పేర్లను నిర్ణయించవచ్చు.
క్ర.సం | తేదీ | చేర్చిన వాడుకరి | గమనించిన అంశాలు | దృష్టాంతాలు | మరింత సమాచారం |
---|---|---|---|---|---|
1 | 2021 జనవరి 20 | చదువరి | "అమెరికా" తో మొదలయ్యే వర్గాలు
"అమెరికన్" తో మొదలయ్యే వర్గాలు "అమెరికా సంయుక్త రాష్ట్రాల"తో మొదలయ్యే వర్గాలు |
ఉదా: | |
2 | 2021 జనవరి 20 | యర్రా రామారావు | ఒకే అంశం ఉన్న వర్గాలు | వర్గం:కలకత్తాలో చిత్రీకరించిన సినిమాలు | |
3 | 2024 మార్చి 21 | చదువరి | కొన్ని వృత్తుల లోని మహిళలకు, "మహిళా" అని చేర్చకుండానే చెప్పే ప్రత్యేకమైన పేర్లున్నాయి. ఉదాహరణకు "రచయిత్రులు", "క్రీడాకారిణులు", "నటీమణులు". ఈ పదాలను "మహిళా రచయితలు", "మహిళా క్రీడాకారులు", "మహిళా నటులు" అని అనం. వీటికి ఏం చెయ్యాలి? ఈ విషయంలో ఉన్న అస్పష్టత కారణంగా ఒకే అంశానికి ఈ రెండు రకాల వర్గాలూ ఉన్నాయి. ఉదా: వర్గం:మహిళా క్రీడాకారులు, వర్గం:క్రీడాకారిణులు
అభిప్రాయం: మహిళలను సూచించేందుకు ఇలా ప్రత్యేకమైన పదాలు విస్తృతంగా వాడుకలో ఉన్నయో ఆయా పదాలను మాత్రమే వాడాలి. |
||
4 | 2024 మార్చి 21 | చదువరి | నృత్య / నాట్య (రెండూ ఒకటే అయినప్పటికీ నృత్య కంటే నాట్య ఎక్కువ వాడుకలో ఉంది. అంచేత అదే వాడాలని అభిప్రాయం) | ||
5 | 2024 ఏప్రిల్ 30 | వి.జె.సుశీల | వర్గం:భారతీయ మహిళలులో ఉప వర్గం:ఆదర్శ వనితలు అనే ఉప వర్గం ఉంది. దానిలో 61 పేజీలున్నాయి. ఈ ఉప వర్గం:ఆదర్శ వనితలు కూడా ఆదర్శ మహిళలుగా మార్చవచ్చేమో పరిశీలించండి. మార్చవచ్చంటే నేను మారుస్తాను. | ||
6 | 2024 మే 3 | వి.జె.సుశీల | సినిమాలు, చలన చిత్రాలు, చిత్రాలు, బాలీవుడ్ మొదలగు వర్గాలు ఒకే విషయానికి సంబంధించి ఉన్నాయి. సినిమాలలో భారతీయ సినిమాలు ఉపవర్గం ఉంది. ఈ ఉపవర్గం లో సినిమాలు అనే ఉపవర్గం గమనించాను. తగు నిర్ణయం అవసరం. | ||
7 | 2024 మే 7 | కె.వెంకటరమణ | "వర్గం:భారతీయ మహిళా గాయకులు" అనే వర్గాన్ని సరైన విధంగా మార్చాలి. ఆంగ్లంలో పురుషులకు male singers అనీ, స్త్రీలకు female singers అనీ వాడబడుతోంది. తెలుగు భాషలో గాయకుడు/గాయని లేదా గాయకుడు/గాయకురాలు అనే పురుష, స్త్రీ లింగ పదాలున్నవి. వాటి బహువచనాలు గాయకులు/గాయనులు అని వాడవచ్చు. కనుక ఈ వర్గాన్ని "వర్గం:భారతీయ గాయనులు" అని మార్చితే బాగుండునని నా అభిప్రాయం. అదే విధంగా "మహిళా గాయకులు" అనే పదం కల శీర్షిక గల అన్ని వర్గాలకు "మహిళా గాయకులు" బదులుగా "గాయనులు" అని వాడితే బాగుండునని నా అభిప్రాయం. |