వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 1
స్వరూపం
- డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి సందర్భంగా జాతీయ వైద్యుల దినోత్సవం
- 1863: సురినామ్లో నెదర్లాండ్స్ బానిసత్వాన్ని రద్దు చేసింది.
- 1879: భారతదేశంలో పోస్టుకార్డును ప్రవేశపెట్టారు.
- 1882: భారత స్వాతంత్ర సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ పూర్వ ముఖ్యమంత్రి బిధాన్ చంద్ర రాయ్ జననం (మ.1962).
- 1909: భారత స్వాతంత్ర సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు ఇంటూరి వెంకటేశ్వరరావు జననం (మ.2002).
- 1929: భారతీయ సినిమా నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఏ.యం.రాజా జననం (మ.1989).
- 1938: వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా జననం. (చిత్రంలో)
- 1961: అంతరిక్షం లోకి వెళ్ళిన భారతీయ సంతతికి చెందిన తొలి మహిళ కల్పనా చావ్లా జననం (మ.2003).
- 1962: భారత స్వాతంత్ర సమరయోధుడు పురుషోత్తమ దాస్ టాండన్ మరణం (జ.1882).
- 2006: ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు ఉద్యమ నేత కొరటాల సత్యనారాయణ మరణం (జ.1923).
- 1930: బుర్రకథ కళాకారుడు కుమ్మరి మాస్టారు జననం (మ.1997).
- 1966: తెలుగుకవి దేవరకొండ బాలగంగాధర తిలక్ మరణం (జ.1921).