వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 9
స్వరూపం
- 2003: ప్రవాస భారతీయుల దినోత్సవం, 1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశం తిరిగివచ్చిన రోజు.
- 1922: నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు హరగోవింద్ ఖురానా జననం (మ.2011). (చిత్రంలో)
- 1934: భారతీయ నేపథ్య గాయకుడు మహేంద్ర కపూర్ జననం (మ.2008).
- 1965: భారతీయ సినిమా దర్శకురాలు, నటి, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ జననం.
- 1968: వెస్ట్ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు జిమ్మీ ఆడమ్స్ జననం.
- 1969: మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము ప్రారంభమైనది.
- 1982: భారత శాస్త్రవేత్తల బృందం మొదటిసారి అంటార్కిటికాను చేరింది.
- 1985: ప్రముఖ తెలంగాణ జానపద గీత రచయిత, గాయకుడు మిట్టపల్లి సురేందర్ జననం.
- 2009: 8వ ప్రపంచ తెలుగు ద్వైవార్షిక మహాసభలు విజయవాడలో ప్రారంభమయ్యాయి.
- 1831: తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలేతో కలసి పనిచేసిన విద్యావేత్త, సంఘ సంస్కర్త ఫాతిమా షేక్ జననం.