వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 6
స్వరూపం
- 1896 : ఏథెన్స్ లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభించబడ్డాయి.
- 1919 : రౌలట్ చట్టానికి నిరసనగా మహాత్మా గాంధీ భారతీయులందరినీ జాతీయ అవమాన దినోత్సవంగా పాటించాలని పిలుపునిచ్చారు.
- 1922 : వక్త, సాహితీ వ్యాఖ్యాత శ్రీభాష్యం అప్పలాచార్యులు జననం (మ. 2003).
- 1928 : డీఎన్ఏను కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ జన్మించాడు.
- 1930 : మహాత్మాగాంధీ నేతృత్వంలో గుజరాత్ లోని దండి వద్ద ఉప్పు సత్యాగ్రహం ముగిసింది.(చిత్రంలో)
- 1931 : కమ్యూనిస్టు నేత నల్లమల గిరిప్రసాద్ జన్మించాడు (మ. 1997).
- 1956 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు దిలీప్ వెంగ్సర్కార్ జననం.
- 1989 : గుజరాతీ భాషా రచయిత పన్నాలాల్ పటేల్ మరణం (జ. 1912).
- 2002 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ మరణం (జ. 1931).
- 2011 : దక్షిణ భారత సినిమా నటి సుజాత మరణం (జ. 1951).