వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 14
స్వరూపం
- 1895 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని ప్రచురించిన మాగంటి బాపినీడు జననం. (చిత్రంలో మాగంటి అన్నపూర్ణమ్మ, మాగంటి బాపినీడు)
- 1933 : తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకుడు అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అక్కినేని అన్నపూర్ణ జననం (మ.2011).
- 1947 : భారత దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది.
- 1958 : ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ మరణం (జ.1900).
- 1966 : ఒక అమెరికన్ నటి, అందాల రాణి హాలీ బెర్రీ జననం.
- 1968 : భారత దేశ క్రికెట్ క్రీడాకారుడు ప్రవీణ్ ఆమ్రే జననం.
- 2011 : భారత ప్రముఖ సినీనటుడు, దర్శకుడు షమ్మీ కపూర్ మరణం (జ.1931).