Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసాల పుస్తకం-2012/పరిచయం

వికీపీడియా నుండి

పరిచయం

[మార్చు]

2012లో ఈ వారం వ్యాసం నిర్వహణలో అర్జున ప్రధాన పాత్ర పోషించారు. అంతవరకు మొదటిపేజీ నిర్వహణ చేసిన కాసుబాబు, కృషి తగ్గించుకొనటంతో అర్జున చేపట్టారు. బహశా మొదటిసారిగా కేలండర్ లో ప్రముఖ పండుగలు ఘటనలకు సంబంధించిన వ్యాసాలను ఆయావారంలో ప్రదర్శించడం జరిగింది. మహాశివరాత్రి,ఉగాది,శ్రీకృష్ణుడు,వినాయక చవితి ,శక్తిపీఠాలు,యేసు, ఇస్లాం మతం పండగల సందర్భంగా ప్రదర్శించిన వ్యాసాలు. 3 యాంత్రిక అనువాద వ్యాసాలను (హోళీ, మిరపకాయ,గుడ్ ఫ్రైడే)కూడా మెరుగుపరచి ప్రదర్శించడం జరిగింది. ప్రముఖుల జయంతి, వర్ధంతుల సందర్భంగా ప్రదర్శించిన వ్యాసాలు గిడుగు రామమూర్తి ,ప్రశాంతి నిలయం. వార్తల అధారంగా ప్రదర్శించినవి కాలజ్ఞాన తత్వాలు ,( 2012లో యుగాంతం వార్త) .

ఈ సంకలాన్ని తయారుచేయటానికి పుస్తకం కూర్పరి (mw:Extension:Collection ) ని వాడి పేజీకి వెళ్లి ఆ వర్గంలోని పేజీలు చేర్చి ఆతరువాత ఆపుస్తకాన్ని భద్ర పరచి, ఆ భద్రపరచిన పేజీలో "చర్చ:" పదాన్ని తొలగించి భద్రపరచి, ఆ తరువాత PDF దించుకోవాలి. ఇలా చేసిన PDF లో చక్కటి విషయసూచికతో పాటు వ్యాసాల రూపం బాగానే వున్నా , పేజీ సంఖ్యలు మరియు మూలాల సంఖ్యలు వుండవలసిన చాలా చోట్ల మరియు వరుస చివరలో పదం విరుపుల దగ్గర కొన్ని చోట్ల ట '?' అక్షరం లేక 'పెట్టె' అక్షరం రావటం ప్రస్తుతానికి లోపంగా వుంది.ఇది పీడియాప్రెస్ లోని మునుజూపులో సరిగా వున్న, దింపుకొనేటప్పుడు రూపం లోపం వలన ఇలా వుంది. ఈ సాఫ్ట్వేర్ తయారీదారులు పని ఆపేసినందున, WMF కొత్త సాఫ్ట్వేర్ రూపొందించినపుడు ఇది మెరుగవవచ్చు.

ఈ పుస్తకానికి ముఖపత్ర పేజీ ప్రత్యేకంగా తయారుచేసి అలా దింపుకున్న PDF లో చేర్చితే పుస్తకం తయారవుతుంది. ఈ పుస్తకం దాదాపు 350పేజీల పరిమాణంలో డిస్క్ లో 72MB వుంది. దీనిని చదివిన వారు, ఇలాంటి పుస్తకాలను మరింత మెరుగు చేయటానికి, తెవికీ వ్యాసాలబలాలు, బలహీనతలను, తెలుగువికీపీడియాలోని ఈ పుస్తకం పేజీ చర్చ లో తెలపకోరుచున్నాము.


అర్జునరావు చెవల

తెవికీ సభ్యుడు

సంకలన కర్త

12 మే 2015