Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2025 11వ వారం

వికీపీడియా నుండి
గుల్మార్గ్

గుల్మార్గ్ భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ లోని ఒక పర్వత ప్రాంత పట్టణం (హిల్ స్టేషన్). దీని అసలు పేరు గౌరీమార్గ్. దీనిని 16వ శతాబ్దంలో కాశ్మీర్ ని పాలించిన యూసుఫ్ షా చక్ గుల్మార్గ్‌గా మార్చాడు. దీనిని భూతల స్వర్గం అని కూడా పిలుస్తారు. ఇది దేశంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. పూల భూమిగా పిలువబడే ఈ ప్రదేశం బారాముల్లా జిల్లాలో ఉంది. ఇక్కడ పచ్చటి వాలు ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. సముద్ర మట్టానికి 2730 మీ. ఎత్తులో ఉన్న గుల్‌మార్గ్‌ కి శీతాకాలంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. మంచులో ఆడే సాహస క్రీడలైన స్కీయింగ్, స్నో బోర్డింగ్ కూడా ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.
(ఇంకా…)