Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 14వ వారం

వికీపీడియా నుండి
కాపీహక్కు

కాపీహక్కు అనేది ఒక రకమైన మేధో సంపత్తి. దీని ద్వారా హక్కుదారుకి, తాను చేసిన సృజనాత్మక పనిని ఇతరులు కాపీ చేయడానికి, పంపిణీ చేయడానికి, స్వీకరించడానికి, ప్రదర్శించడానికి, నిర్వహించడానికీ పరిమిత కాలం పాటు ప్రత్యేక హక్కు కలుగుతుంది. సృజనాత్మక పని సాహిత్య, కళాత్మక, విద్య లేదా సంగీత రూపాల్లో ఉండవచ్చు. కాపీహక్కు అనేది సృజనాత్మక పని రూపంలో వ్యక్తి తన ఆలోచనకు చేసిన ఒరిజినల్ వ్యక్తీకరణను రక్షించడానికి ఉద్దేశించబడినదే గానీ, ఆలోచనను రక్షించేందుకు కాదు. యునైటెడ్ స్టేట్స్‌లో కాపీహక్కు, సముచిత వినియోగ సిద్ధాంతం వంటి ప్రజా ప్రయోజన పరిమితులకు లోబడి ఉంటుంది. కొన్ని న్యాయాధికార పరిధుల్లో కాపీహక్కు ఉన్న కృతులను ప్రత్యక్ష రూపంలో "పరిష్కరించాల్సిన" అవసరం ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ కర్తలున్నపుడు వారంతా వివిధహక్కులను పంచుకుంటారు. ఆ హక్కులను అనుసరించి వారికి ఆ పనిని వినియోగించడం లేదా లైసెన్సు ఇవ్వడం వంటివి చేస్తారు. వీరిని హక్కు దారులు అంటారు. ఈ హక్కులలో పునరుత్పత్తి, ఉత్పన్న పనులపై నియంత్రణ, పంపిణీ, బహిరంగ ప్రదర్శనలతో పాటు ఆపాదింపు వంటి నైతిక హక్కులు ఉంటాయి. ప్రజా చట్టం ద్వారా కాపీహక్కు‌లను మంజూరు చేయవచ్చు. ఆ సందర్భంలో వీటిని "ప్రాదేశిక హక్కులు" అని పరిగణిస్తారు. దీనర్థం నిర్దుష్ట దేశపు చట్టం ద్వారా మంజూరైన కాపీహక్కు‌లు ఆ దేశపు అధికార పరిధికి మించి విస్తరించవు. ఈ రకమైన కాపీహక్కు‌లు దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి; అనేక దేశాలు, కొన్నిసార్లు పెద్ద సంఖ్యలో దేశాలు, తమతమ దేశాల మధ్య హక్కుల స్థితి అస్థిరంగా ఉన్నప్పుడు, వర్తించే విధానాలపై ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకున్నాయి.
(ఇంకా…)