Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 52వ వారం

వికీపీడియా నుండి
సిల్క్ రోడ్డు

సిల్క్ రోడ్డు తూర్పు, పశ్చిమ ప్రాంతాలను అనుసంధానించే వాణిజ్య మార్గాల అల్లిక. క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దం నుండి సా.శ. 18 వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన పరస్పర సంపర్కాలకు ఈ సిల్క్ మార్గం అనుసంధాన కర్తగా ఉంది. సిల్క్ రోడ్డు ప్రధానంగా తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాలను దక్షిణ ఆసియా, పర్షియా, అరేబియా ద్వీపకల్పం, తూర్పు ఆఫ్రికా, దక్షిణ ఐరోపాతో కలిపే భూ మార్గాలను సూచిస్తుంది. చైనాలోని హాన్ రాజవంశం కాలం నుండి ప్రారంభించి, ఈ దారి పొడవునా జరిగిన లాభదాయకమైన పట్టు వ్యాపారం కారణంగా దీనికి సిల్క్ రోడ్డు దాని పేరు వచ్చింది. చైనా సామ్రాజ్య రాయబారి జాంగ్ కియాన్ చేసిన యాత్రలు, అన్వేషణల ద్వారా, అనేక సైనిక విజయాల ద్వారానూ హాన్ రాజవంశం క్రీ.పూ. 114 ప్రాంతంలో మధ్య ఆసియా విభాగాన్ని విస్తరించింది. చైనీయులు తమ వాణిజ్య ఉత్పత్తుల భద్రత పట్ల ఎంతో ఆసక్తి చూపారు. వాణిజ్య మార్గపు రక్షణ కోసం మహా కుడ్యాన్ని విస్తరించారు. చైనా, కొరియా, జపాన్, భారత ఉపఖండం, ఇరాన్, ఐరోపా, హార్న్ ఆఫ్ ఆఫ్రికా, అరేబియా నాగరికతల అభివృద్ధిలో సిల్క్ రోడ్డు వాణిజ్యం ముఖ్యమైన పాత్ర పోషించింది. వివిధ నాగరికతల మధ్య సుదూరమైన రాజకీయ, ఆర్థిక సంబంధాలను తెరిచింది.
(ఇంకా…)